సోనియా తల్లి!
తెలంగాణ తల్లి రూపంలో దర్శనమిస్తున్న ఈమె మరెవరో కాదు... కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ. 'అమ్మ'కు గుడి కడతానన్న మాజీమంత్రి శంకర్రావు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు గ్రామంలో శ్రీ సాయి బాబా మెగా శిల్పశాలలో తయారు చేస్తున్న నమూనా మట్టి విగ్రహం ఇది. దీనిని పరిశీలించేందుకు శంకర్రావు మంగళవారం కృష్ణాజిల్లాకు వెళ్లారు.
అధిష్టానమ్మ సోనియా గాంధీని స్తుతించడంలో శంకర్రావుది ప్రత్యేక శైలి. 'మేడమ్' వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడబోతోందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. సోనియాను తెలంగాణ దేవతగా వర్ణిస్తూ ఆమెకు ఆలయం కట్టేందుకు సన్నద్ధం అయ్యారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం నందిగామలో శంకర్రావు .... సోనియా గుడికి శంకుస్థాపన కూడా చేశారు. తన 9 ఎకరాల పొలంలో కొంతమేర అమ్మకు ఆలయం కట్టిస్తున్న విషయం తెలిసిందే.