Top Stories
ప్రధాన వార్తలు

‘కూటమి’ కుట్రలు.. గవర్నర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌లో కలిసి వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతున్న నేపథ్యంలో తక్షణం గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరింది. అనంతరం రాజ్‌భవన్ బయట పలువురు మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.ఇటీవల గంగాధర నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అన్ని పనులు తెలుగుదేశం వారికే చేయాలి.. వైఎస్సార్సీపీ వారికి ఏ పనీ చేయకూడదు.. అలా చేస్తే పాముకు పాలుపోసినట్లేనంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ సమదృష్టితో పాలనను అందిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన చంద్రబాబు, దానికి విరుద్దంగా చేసిన వ్యాఖ్యలపై తక్షణం గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజాస్వామిక స్పూర్తికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో సంక్షేమాన్ని అందుకునే లబ్దిదారులకు పార్టీలు, వర్గాలు ఉండవని అన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలతో అర్హతను బట్టి పథకాలను వర్తింపచేస్తారని, కానీ చంద్రబాబు మాత్రం ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని, కొందరి పట్ల వివక్ష చూపించాలంటూ చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చంద్రబాబులా మాట్లాడలేదన్నారు.రాష్ట్రంలోని ఏ రాజకీయపార్టీ అయినా వారి సిద్ధాంతాలు, విధానాల ప్రకారం పనిచేస్తుందని, రాష్ట్రంలోని మొత్తం ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలన్నదే వారి లక్ష్యంగా పెట్టుకుంటారని అన్నారు. ఏ పార్టీ అయినా వ్యక్తిగత ఏజెండాతో పనిచేయవని, కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు దానికి భిన్నంగా చేసిన వ్యాఖ్యలు, ఆయన అనుసరిస్తున్న విధానాలపై తక్షణం స్పందించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. సామాన్యుల అవసరాలకు కూడా రాజకీయ పార్టీ రంగు పులమడం దారుణమన్నారు.ప్రతిపక్ష పార్టీగా ప్రజల ప్రయోజనాల కోసమే వైఎస్సార్సీపీ.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ మెడలు వంచి ప్రజలకు ప్రయోజనాలు కలిగించేలా వ్యవహరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లు, చివరికి జర్నలిస్ట్‌లపైన కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామని బొత్స సత్యనారాయణ తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేరుగు నాగార్జున, విడదల రజనీ, కారుమూరు వెంకట నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు వున్నారు.

ధీరూభాయ్ అంబానీ సంతకం వృథా కాబోతోంది..
చండీగఢ్‌కు చెందిన వ్యక్తి ఇల్లు శుభ్రం చేస్తుండగా 37 ఏళ్ల నాటి రూ.12 లక్షల విలువైన రిలయన్స్ షేర్ సర్టిఫికెట్లు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా వ్యక్తికి వీటిని డిజిటలైజేషన్ చేసుకుందామని ప్రయత్నించగా చిక్కులు ఎదురవుతున్నాయి. దీంతో వాటిని అలాగే వదిలేయాలని నిర్ణయానికి వచ్చేశాడు.వివరాల్లోకి వెళ్తే.. చండీగఢ్‌కు చెందిన రతన్ ధిల్లాన్ వ్యక్తి ఇల్లు శుభ్రం చేస్తుండగా 37 ఏళ్ల నాటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) షేర్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. 1988లో ఒక్కొక్కటి రూ.10 చొప్పున వీటిని కొనుగోలు చేయగా ఈ షేర్లు స్టాక్ స్ప్లిట్స్, బోనస్ ద్వారా 960 రెట్లు పెరిగాయి. దీంతో వీటి ప్రస్తుత విలువ రూ.12 లక్షలకు చేరింది.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న రతన్ ధిల్లాన్ మొదట వాటిని డిజిటలైజ్ చేసుకోవాలో సలహా కోరారు. అయితే చట్టపరమైన వారసుడి సర్టిఫికెట్, వారసత్వ ధృవీకరణ పత్రం, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ) క్లియరెన్స్ అవసరమయ్యే విస్తృతమైన పేపర్ వర్క్ గురించి తెలుసుకున్న తరువాత, ధిల్లాన్ ఈ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.ధీరూభాయ్ అంబానీ సంతకాలు వృథా కాబోతున్నాయని, షేర్ల డిజిటలైజేషన్ చేయకూడదని నిర్ణయించుకున్నానని రతన్ ధిల్లాన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. "ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది- చట్టపరమైన వారసుడి ధృవీకరణ పత్రాన్ని పొందడానికే 6-8 నెలలు పడుతుంది. ఐఈపీఎఫ్ఏ ప్రక్రియకు 2-3 సంవత్సరాలు పడుతుంది. అంత సమయాన్ని వెచ్చించడంలో అర్థం కనిపించడం లేదు. భారత్ తన పేపర్ వర్క్ ను క్రమబద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉంది" అని పేర్కొన్నారు.ప్రస్తుతానికి ఫిజికల్ షేర్ సర్టిఫికెట్లను ఏమీ చేయకుండా అలాగే వదిలేస్తానని ధిల్లాన్ తెలిపారు. రతన్ ధిల్లాన్ నిర్ణయంపై మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) లో స్పందనలు వెల్లువెత్తాయి. పలువురు యూజర్లు షేర్ సర్టిఫికెట్ల డిజిటలైజేషన్లో తమ అనుభవాలను పేర్కంటూ కామెంట్లు చేశారు.Final Update: It seems Dhirubhai Ambani’s signatures will go to waste, as I’ve decided not to proceed with digitizing the shares. The process is just too lengthy—obtaining the legal heir certificate alone takes 6-8 months, and the IEPFA process reportedly takes 2-3 years. I… https://t.co/sDt1uPKiqL— Rattan Dhillon (@ShivrattanDhil1) March 12, 2025

దానివల్ల ఏమీ ఉపయోగం లేదు: అమెరికాకు తేల్చి చెప్పిన రష్యా
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ ల మధ్య అమెరికా జరుపుతున్న శాంతి చర్చలు ఇప్పట్లో సఫలీకృతం అయ్యేటల్లు కనిపించడం లేదు. ‘ మేము వెనక్కి తగ్గం అంటే.. మేము కూడా వెనక్కి తగ్గేదే లేదు’ అన్నట్లుగా ఉంది ఇరు దేశాల పరిస్థితి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుపుతున్నప్పటికీ అది కాస్తా విఫలయత్నంగానే మిగిలి ఉంది. ఒకవైపు వైట్ హౌస్ వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో జరిపిన చర్చలు వాగ్వాదానికి దారి తీశాయే తప్ప వాటిలో ఎటువంటి ముందడుగు పడలేదు. అదే సమయంలో రష్యాను కూడా కాస్త తగ్గే ఉండమని ట్రంప్ చేస్తున్న విజ్ఞప్తిని కూడా ఆ దేశం పెద్దగా పట్టించుకోవడం లేదు. కనీసం 30 రోజుల శాంతి ఒప్పందంతో ఇరు దేశాల యుద్ధం ఓ కొలిక్కి వస్తుందని ఆశించిన అమెరికాకు ఇరు దేశాల వైఖరి ఏమాత్రం మింగుడు పడటం లేదు.అది ఉక్రెయిన్ ఆర్మీ ఊపిరి తీసుకునేందుకే..తాజాగా అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఆడ్వైజర్ మికీ వాల్ట్ కు ఇదే విషయాన్ని రష్యా స్పష్టం చేసింది. 30 రోజుల మీ శాంతి ఒప్పందం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అత్యంత కీలక విషయాలు చూసే యురీ ఉషాకోవ్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఫోన్ లో అమెరికాకు తేల్చిచెప్పారు.‘మీరు కోరుకునే మా ఇరుదేశాల 30 రోజుల శాంతి ఒప్పందం(కాల్పుల విరమణ ఒప్పందం)తో ఎటువంటి ఉపయోగం లేదు. అది కేవలం ఉక్రెయిన్ ఆర్మీ కి కాస్త రిలాక్స్ కావడానికి మాత్రమే పనికొస్తుంది. మేము కోరుకునేది శాశ్వత శాంతి ఒప్పందం. రష్యా చట్టబద్ధమైన ప్రయోజనాలను" కాపాడే దీర్ఘకాలిక శాంతియుత పరిష్కారం కోసం రష్యా లక్ష్యంగా పెట్టుకుంది. మా తాపత్రయం అంతా దానిపైనే ఉంది. అంతే కానీ 30 రోజుల శాంతి ఒప్పందం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు’ అని అమెరికాకు తేల్చిచెప్పారు. ఫలితంగా ఇరు దేశాల శాంతి ఒప్పందం మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జెలెన్ స్కీ భేటీ తర్వాత.. రష్యా మళ్లీ ఉక్రెయిన్ పై దాడులకు దిగింది. అదే సమయంలో ఆ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టిన ఉక్రెయిన్ సైతం తాము కూడా తాడో పేడో తేల్చుకుంటామనే రీతిలో యుద్ధ రంగంలోకి దూకింది. ఆ క్రమంలోనే రష్యాపై మెరుపు దాడి చేసింది. సుమారు 300 పైగా డ్రోన్ల సాయంతో రష్యాపై విరుచుకుపడింది. ఈ దాడితో ప్రాణనష్టం, ఆస్తినష్టం కూడా అధికంగా వాటిల్లినట్లు తెలుస్తున్నప్పటికీ, దానిపై రష్యా అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు.అమెరికాకు పుతిన్ డిమాండ్స్.. రష్యాకు ట్రంప్ సీరియస్ వార్నింగ్

నేను రాలేను.. డీకేను రిక్వెస్ట్ చేశా: సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: డీలిమిటేషన్ అంశంపై చర్చించేందుకు రావాలంటూ పలు దక్షిణాది రాష్ట్రాలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ నెల 22వ తేదీన డీలిమిటేషన్ అంశంపై చర్చకు రావాలంటూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాలకు మెయిల్స్ ద్వారా లేఖలు పంపారు స్టాలిన్. అయితే ఈ అంశంలో చర్చించడానికి తమ రాష్ట్రం తరఫున డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వస్తారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ మేరకు తమిళనాడు సీఎం స్టాలిన్ కు లేఖ రాశారు.‘ నేను కొన్ని వ్యక్తిగత పనులు వల్ల ఆ సమావేశానికి రాలేకపోతున్నాను. కానీ మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మా ప్రభుత్వం తరఫున డీకే శివకుమార్ వస్తారు. ఈ విషయంపై డీకే శివకుమార్ తో చర్చించిన తర్వాతే మీకు లేఖ రాస్తున్నా’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.కాగా, డీలిమిటేషన్ అంశంపై మాట్లాడేందుకు కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవత్ మాన్, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీలకు లేఖలు రాశారు స్టాలిన్. ఇది సమాఖ్య వాదంపై స్పష్టమైన దాడిగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర పరిపాలనను శిక్షించడమేనని స్టాలిన్ పేర్కొన్నారు. దీనిపై స్పష్టమైన విముఖత వ్యక్తం చేస్తున్న స్టాలిన్.. ఏడుగురు సీఎంలకు లేఖలు రాశారు. దాంతో పాటు మాజీ సీఎంలకు ఆయన లేఖలు పంపినట్లు స్టాలిన్ పేర్కొన్నారు.

కెనడా పౌరులపై ట్రంప్ ఆంక్షలు.. ఉల్లంఘిస్తే భారీ ఫైన్, జైలు జీవితం ఖాయం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై ఆంక్షలు విధించారు. బోర్డర్ దాటి అమెరికాలోకి వచ్చే కెనడా పౌరులు తమ దేశంలో 30 రోజులు మించి ఉండకూడదు. దాటితే తమ నిబంధనలకు లోబడి ఉండాలి. లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్ కెనడాపై 25 శాతం టారిఫ్ విధించారు. దీంతో అమెరికాలోని మూడు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న విద్యుత్‌పై ఎగుమతి సుంకాలను 25శాతం పెంచుతున్నట్లు కెనడాలోని ఒంటారియో (Ontario) ప్రకటించింది. ఆ ప్రకటన ఇలా వచ్చిందో లేదో.. ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించారు. సాధారణంగా కెనడా పౌరులు బోర్డర్ దాటి అమెరికాలో చొరబడుతుంటారు. 30 రోజుల కంటే ఎక్కువ ఉన్నా.. ఇందుకోసం ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సి ఉండేది కాదు. కానీ తాజాగా ట్రంప్ నిర్ణయంతో 30రోజులు దాటిన అమెరికాలోని కెనడా పౌరులు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.లేదంటే 5వేల డాలర్ల ఫైన్, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫైన్‌తో పాటు, ఆరు నెలల జైలు శిక్షను విధించాల్సి ఉంటుంది. తాజాగా, ట్రంప్ విధించిన నిబంధనలు ఏప్రిల్ 11 నుంచి అమల్లోకి రానున్నాయి.

బహిష్కరణకు గురైన కుటుంబాలకు అండగా వైఎస్ జగన్
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసే మంచి ఏమీ లేకపోయినా కక్ష సాధింపు చర్యలు మాత్రం తీవ్రతరమవుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే పల్నాడు జిల్లా పిన్నెళ్లి గ్రామంలోని 400 కుటుంబాలపై బహిష్కరణ వేటు వేసింది. బహిష్కరణకు గురైన వారంతా ఎస్సీ, బీసీ, మైనార్టీలే. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. బహిష్కరణకు గురైన పిన్నెళ్లి గ్రామంలోని కుటుంబాలకు అండగా నిలిచారు వైఎస్ జగన్ఈ క్రమంలోనే అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. గ్రామంలోకి వస్తే తమను చంపుతామని బెదిరిస్తున్నారని వారు వైఎస్ జగన్‌కు విన్నవించుకున్నారు. వీరికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. దీనిలో భాగంగా ‘చలో పిన్నెళ్లి’ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ‘ సిద్ధమైంది. రెండు నెలల్లో చలో పిన్నెళ్లి’ కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్సీపీ‘ నిర్ణయించింది. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సహా పిన్నెల్లి, తురకపాలెం, మాదెనపాడు, చెన్నాయపాలెం గ్రామస్తులున్నారు.

ఒకప్పుడు టీమిండియా ప్లేయర్.. కట్‌చేస్తే! ఇప్పుడు ఆ జట్టు నెట్ బౌలర్‌గా
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ చేతన్ సకారియా ఆన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. రూ. 75 లక్షల బేస్‌ప్రైస్‌తో వచ్చిన సకారియాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే వేలంలో సకారియా అమ్ముడుపోనప్పటికి.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం భాగం కానున్నాడు.ఐపీఎల్-18వ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నెట్‌బౌలర్‌గా సకారియా తన సేవలను అందించనున్నాడు. కాగా సకారియా గత సీజన్లో కేకేఆర్కే ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా అతడికి ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అతడిని కేకేఆర్ విడిచిపెట్టింది. ఇప్పుడు నెట్‌బౌలర్‌గా అదే జట్టుతో సకారియా కొనసాగనున్నాడు. కాగా చేతన్ సకారియా ఇటీవల మణికట్టు గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చాడు. ఈ క్రమంలో ముంబైలో జరిగిన ఓ టీ20 టోర్నమెంట్లో సకారియా మెరుగ్గా రాణించి కేకేఆర్ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ దృష్టిలో పడ్డాడు. దీంతో అతడిని నెట్ బౌలర్‌గా కేకేఆర్ తమ జట్టులోకి తీసుకుంది. భరత్ అరుణ్ పర్యవేక్షణలో తన స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకోవడానికి చేతన్‌కు ఇదొక మంచి అవకాశం. అదేవిధంగా రహానే, రస్సెల్ వంటి క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను సకారియా పంచుకోనున్నాడు.మూడే మూడు మ్యాచ్‌లు..చేతన్ సకారియా భారత్ తరపున 2021లో శ్రీలంకపై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో ఇప్పటివరకు రెండు టీ20లు, ఒక వన్డే ఆడాడు. అదేవిధంగా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, కేకేఆర్‌కు సకారియా ప్రాతినిథ్యం వహించాడు.2021 సీజన్లో సకారియా రాజస్తాన్ తరపున 14 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే భారత సెలక్టర్లు నుంచి సకారియా పిలుపును అందుకున్నాడు. కానీ అంతర్జాతీయ స్థాయిలో సకారియా తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఇక ఐపీఎల్లో 19 మ్యాచ్‌లు ఆడిన చేతన్.. 20 వికెట్లు సాధించాడు.ఐపీఎల్-2025కు కేకేఆర్ జట్టు: రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు), క్వింటన్ డి కాక్ (రూ. 3.60 కోట్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (రూ. 200 కోట్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (రూ. 5 కోట్లు. కోటి), అంగ్క్రిష్ రఘువంశీ (రూ. 3 కోట్లు), వైభవ్ అరోరా (రూ. 1.80 కోట్లు), మయాంక్ మార్కండే (రూ. 30 లక్షలు), రోవ్‌మన్ పావెల్ (రూ. 1.50 కోట్లు), మనీష్ పాండే (రూ. 75 లక్షలు), స్పెన్సర్ జాన్సన్ (రూ. 2.80 కోట్లు), ఎ. 30 లక్షల రూపాయలు. రహానె (రూ. 1.50 లక్షలు), అనుకుల్ రాయ్ (రూ. 40 లక్షలు), మొయిన్ అలీ (రూ. 2 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 75 లక్షలు).చదవండి: హార్దిక్ పాండ్యా కంటే అతడు ఎంతో బెటర్: పాక్ మాజీ కెప్టెన్

అసెంబ్లీలో స్టార్ హీరోయిన్‌పై నోరు పారేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
జైపూర్ : అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. రాష్ట్రంలో సెకండ్ గ్రేడ్ యాక్టర్ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ (madhuri dixit) ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. సెకండ్ గ్రేడ్ యాక్టర్లు తప్ప మీకు ఇంకెవరి ఫొటోలు దొరకలేదా? షారుఖ్ ఖాన్ తప్ప మిగిలిన నటులంతా ఆ కోవకే చెందుతారంటూ తన నోటికి పనిచెప్పారు. ప్రస్తుతం సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్.. రాష్ట్రంలో జరిగిన ఐఫా అవార్డ్‌ల ఫంక్షన్‌పై బీజేపీ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించింది.ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే టికారం జుల్లీ (Congress MLA Tikaram Jully) అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఐఫా (IIFA Awards 2025) ఉత్సవాల్ని నిర్వహించింది. ఐఫా పేరిట దేనికి ఎంతెంత? ఖర్చు పెట్టారో లెక్కలు బయటకు తీయాలి. మీరు ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తున్నట్లుగా లేదు. ఐఫాను ప్రమోట్ చేస్తునట్లుంది.ఐఫా వల్ల రాష్ట్రానికి ఏ ఒరిగింది? ఈ కార్యక్రమానికి వచ్చిన సినీ ప్రముఖులు టూరిస్ట్ ప్రాంతాల్ని సందర్శించారా? సినీ ఇండస్ట్రీ నుంచి ఐఫా కార్యక్రమానికి వచ్చిన స్టార్లు ఎవరు? నాకు తెలిసి షారుఖ్‌ఖాన్ మినహా మిగిలిన వాళ్లందరూ సెకండ్ గ్రేడ్ యాక్టర్లే. ఫస్ట్ గ్రేడ్ యాక్టర్లు ఈ కార్యక్రమానికి వచ్చినట్లు లేదే? అని వ్యాఖ్యానించారు.దీంతో ఎమ్మెల్యే టికారం జుల్లీ వ్యాఖ్యల్ని అధికార బీజేపీ ఎమ్మెల్యేలు ఖండించారు. ప్రతి స్పందనగా.. అవును మాధిరి దీక్షిత్ ఇప్పుడు సెకండ్ గ్రేడ్ యాక్టర్. నాటి దిల్, బేటా సినిమాలకు మాత్రమే ఆమె స్టార్. ఆమె ఎరా ఎప్పుడో ముగిసింది’అని తాను చేసిన వ్యాఖ్యల్ని సమర్ధించుకున్నారు.కొద్ది రోజుల క్రితం ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేత షామా మొహమ్మద్ (shama mohamed) ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపింది. షామా తన ట్వీట్లో రోహిత్ శర్మ (rohit sharma) ఫిట్‌గా లేడు! బరువు తగ్గాలి. భారత క్రికెట్ జట్టులో గత సారథులతో పోల్చితే ఆకట్టుకోని కెప్టెన్ అతడే’ అని రాసుకొచ్చింది. ఆమె చేసిన ట్వీట్‌పై పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది.భారతీయులు రోహిత్ శర్మకు మద్దతు పలుకుతూ షామాపై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలు తట్టుకోలేక దెబ్బకు దిగొచ్చారు. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టును విజయపథం వైపు నడిపించారంటూ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఫ్రెషర్లకు డిమాండ్: ఐటీలో నియామకాలు డబుల్
గతకొన్ని నెలలుగా దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం.. కొత్త ఉద్యోగులను నియమించుకోకపోవడం మాత్రమే కాకుండా, ఉన్న వారిని కూడా ఉద్యోగాల్లో నుంచి తీసేస్తోంది. అయితే త్వరలోనే ఐటీ రంగం పుంజుకుంటుందని.. ఉద్యోగ నియామకాలు కూడా భారీగా ఉంటాయని రిక్రూటింగ్ సంస్థ టీమ్‌లీజ్ తన నివేదికలో వెల్లడించింది.2026 ఆర్థిక సంవత్సరంలో టెక్నాలజీ సేవల రంగంలో ఫ్రెషర్ల నియామకం దాదాపు రెట్టింపు అవుతుందని, గత సంవత్సరంతో పోలిస్తే నియామకాలు 1,50,000 కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. టీమ్‌లీజ్ డేటా ప్రకారం, మార్చి 2025 నాటికి దాదాపు 85,000 - 95,000 మంది ఫ్రెషర్ల నియమాలకు జరుగుతాయి.అన్ఎర్త్ఇన్సైట్ పరిశోధన ప్రకారం.. యాక్సెంచర్, క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ ఐటీ సేవల సంస్థలు కొత్తగా 1.6 లక్షల నుంచి 1.8 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొత్త ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతుంది.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు.. టెక్ కంపెనీ కొత్త రూల్! 2024 ప్రారంభం నుంచి కూడా చాలా కంపెనీలు.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చాయి. కాబట్టి కొత్త నియమాల విషయం కొంత ఆలోచించి, ప్రస్తుత టెక్నాలజీకు అవసరమైన నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగావకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇండియన్, మల్టి నేషనల్ కంపెనీలు రెండూ కూడా కొత్తవారి నియామకాలను చేపట్టనున్నాయి. అయితే కొత్త నైపుణ్యాలను నేర్చుకున్న.. ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని టీమ్‌లీజ్ సర్వేలో వెల్లడైంది.

కారు ఢీకొట్టి ఈడ్చుకెళ్లినా.. నొప్పి తెలియదట ఆమెకు..!
ఓ పట్టాన అంతుచిక్కని కొన్ని రకాల వ్యాధులు వైద్యులకు భలే గమ్మత్తైన సవాళ్లని విసురుతుంటాయి. ఒక్కోసారి అదెలా సాధ్యం అని వైద్యులకే చెమటలు పట్టించేస్తాయి. అచ్చం అలాంటి వైద్య పరిస్థితితోనే పోరాడుతోంది ఈ చిన్నారి. వైద్యపరంగా ఆమె ఓ అద్భుతంగా మారింది. ప్రతి వ్యక్తి మనుగడకు, ఆరోగ్యానికి ప్రధానమైన మూడు ప్రాథమిక అవసరాలు లేకుండానే బతికేస్తుంది ఆమె. మరీ ఆ చిన్నారి ఎలాంటి వైద్యపరిస్థితితో బాధపడుతోందంటే..యూకేకి చెందిన ఒలివియా పార్న్స్వర్త్ అనే అమ్మాయి అరుదైన జన్యుపరమైన సమస్యతో పోరాడుతోంది. ఆ ప్రత్యేకమైన పరిస్థితి కారణంగా వైజ్ఞానికంగా అద్భతమైన అమ్మాయిగా మారిందామె. ప్రపంచంలో ప్రతి మానవుడికి కీలమైన మూడు ప్రాథమిక అవసరాలు లేకుండానే జీవించగలదామె. సింపుల్‌గా చెప్పాలంటే ఆమె ఆ మూడు సవాళ్లను ఒకేసారి అధిగమించగల అసాధారణ అమ్మాయి. అంతెందుకు వైద్యులు కూడా ఆమెను ఓ ఆద్బుతంగా పరిగణించారు. ఏంటా వైద్యపరిస్థితి అంటే..ఒలివియాకి నొప్పి, ఆకలి, నిద్ర అనేవి ఉండవట. ఇది మనిషిలో ఉండే ఆరవ క్రోమోజోమ్‌లోని జన్యుపరమైన అసాధారణత ఫలితంగా ఆమెకు ఇలాంటి పరిస్థితని వైద్యలు భావిస్తున్నారు. ఒకరకంగా ఇది వరంలా కనిపించినా ఆమెకు ఈ పరిస్థితి ఆందోళనకరమైనదే అనే ఒలివియా తల్లి ఆవేదనగా చెప్పారు. ఈ మూడింటి ఫీలింగ్స్ ఆమెకు తెలియదు కాబట్టి ఏ క్షణంలో తనను తాను ఎలా గాయపరుచుకుంటుందో అనే భయపడుతూ బతకాల్సి వస్తోందంటూ కన్నీటి పర్యాంతమైంది ఒలివియా తల్లి. ఇక ఆమెకు ఆకలి ఉండదు కాబట్టి ఆమె పోషకాహార లోపంతో బాధపడకుండా మంచి ఆహారాన్ని ఇచ్చేలా పర్యవేక్షించక తప్పదని చెబుతోంది. అంతేగాదు ఒలివియాకు ఏడేళ్ల వయసులో జరిగిన ప్రమాదం గుర్తించేసుకుంటూ..నాడు తామంతా ఒలివియా పరిస్థితి చూసి కంగుతిన్నామని చెప్పింది. ఆమె చిన్నతనంలో ఓ కారు ఆమెను ఢీకొట్టి చాలాదూరం ఈడ్చుకుని వెళ్లిపోయిందని నాటి ఘటనను వివరించారు. ఒళ్లంతా నెత్తురోడుతున్న...ఆ ఆకస్మిక ఘటనకు మా కుటుంబం అంతా షాక్‌లో ఉండిపోయింది. కొద్దిపాటి మెరుపు వేగంలో తేరుకుని ఒలివియాను రక్షిద్దాం అనుకునేలోగా ..ఒలివియా ఏమి కానట్లుగా తనంతాట తానే లేచి తమ వద్దకు రావడంతో హుతాసులైపోయాం అంటూ నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారామె. ఒంటినిండా గాయలైనా ఏం కానట్లు ఒలివియా ప్రవర్తించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేనంటోంది తల్లి. "ఒలివియాకి నిద్ర కూడా ఓ సవాలు. ఎందుకంటే మందులు లేకుండా సహజంగా నిద్రపోలేదు. మనం గనుక మందులు వేయకపోతే అలా మూడు రోజుల వరకు మేల్కొనే ఉంటుందట. ఆ నిద్రలేమిని నిర్వహించేలే కఠినమైన నిద్ర సహాయాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు". ఒలివియా తల్లి. ఆ అమ్మాయి పరిస్థితిని ఆస్పత్రి వారు బయోనిక్‌గా అబివర్ణించారు. ఈ అరుదైన కేసు జీవశాస్త్రం సంక్లిష్టతలు, జన్యుఉత్పరివర్తనాల ప్రభావంపై అంతర్దృష్టిని అందిస్తోందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఆ అమ్మాయి కేసు తమ వైద్యానికే అంతపట్టని చిక్కుప్రశ్నలా ఉందన్నారు. ఒలివియా పరిస్థితిని ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాటిలో ఒకటిగా పేర్కొన్నారు. నిజంగా ఆ అమ్మాయి పరిస్థితి వైద్య నిపుణులకేకాదు సాధారణ ప్రజలకు కూడా ఆశ్చర్యం కలిగించేలా ఉంది కదూ..!.(చదవండి: కిడ్నీలు పదిలమేనా..? మదుమేహం లేకపోయినా వస్తుందా..?)
అక్కా తమ్ముళ్లు సెట్స్‌లో ఉండకూడదు: దీప్తి గంటా
కాన్స్ కాలింగ్
హల్దీరామ్స్‌లో టెమాసెక్‌కు వాటా
అమ్మ శ్రమలో ఎన్ని రంగులో!
నేను రాలేను.. డీకేను రిక్వెస్ట్ చేశా: సీఎం సిద్ధరామయ్య
ఆసీస్‌తో సెమీస్.. యువరాజ్, సచిన్ విధ్వంసం! వీడియో వైరల్
ఐకూ నుంచి నియో 10ఆర్.. పవర్ఫుల్ గేమింగ్ ఫోన్
మరో షాక్.. ఆప్ నేతలపై కేసు నమోదుకు రాష్ట్రపతి అనుమతి?
'ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ'.. ఆసక్తిగా ట్రైలర్
కెనడా పౌరులపై ట్రంప్ ఆంక్షలు.. ఉల్లంఘిస్తే భారీ ఫైన్, జైలు జీవితం ఖాయం
లే నాన్నా.. అమ్మా, చెల్లి వచ్చాం
ఓటీటీలో రచిత గ్లామరస్ సినిమా.. మొత్తం 'ఫైర్' అయిపోతారు
ఇంకా నయం! ప్రభుత్వాన్ని హైజాక్ చేస్తారేమోనని భయపడ్డా..!
ఈ రాశి వారికి వస్తులాభాలు.. స్థిరాస్తి వృద్ధి
Hyderabad: ప్యారడైజ్ నుంచి డైరీఫామ్ వరకు సొరంగ మార్గం..
సార్.. ప్రపంచం మీదనే బరువేస్తున్నట్టుంది!
మేజిస్ట్రేట్ ముందు కన్నీరు పెట్టుకున్న పోసాని
Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ
Wine Shops Closed : వైన్‌షాపులు బంద్.. ఎందుకో తెలుసా?
ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట
అక్కా తమ్ముళ్లు సెట్స్‌లో ఉండకూడదు: దీప్తి గంటా
కాన్స్ కాలింగ్
హల్దీరామ్స్‌లో టెమాసెక్‌కు వాటా
అమ్మ శ్రమలో ఎన్ని రంగులో!
నేను రాలేను.. డీకేను రిక్వెస్ట్ చేశా: సీఎం సిద్ధరామయ్య
ఆసీస్‌తో సెమీస్.. యువరాజ్, సచిన్ విధ్వంసం! వీడియో వైరల్
ఐకూ నుంచి నియో 10ఆర్.. పవర్ఫుల్ గేమింగ్ ఫోన్
మరో షాక్.. ఆప్ నేతలపై కేసు నమోదుకు రాష్ట్రపతి అనుమతి?
'ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ'.. ఆసక్తిగా ట్రైలర్
కెనడా పౌరులపై ట్రంప్ ఆంక్షలు.. ఉల్లంఘిస్తే భారీ ఫైన్, జైలు జీవితం ఖాయం
లే నాన్నా.. అమ్మా, చెల్లి వచ్చాం
ఓటీటీలో రచిత గ్లామరస్ సినిమా.. మొత్తం 'ఫైర్' అయిపోతారు
ఇంకా నయం! ప్రభుత్వాన్ని హైజాక్ చేస్తారేమోనని భయపడ్డా..!
ఈ రాశి వారికి వస్తులాభాలు.. స్థిరాస్తి వృద్ధి
Hyderabad: ప్యారడైజ్ నుంచి డైరీఫామ్ వరకు సొరంగ మార్గం..
సార్.. ప్రపంచం మీదనే బరువేస్తున్నట్టుంది!
మేజిస్ట్రేట్ ముందు కన్నీరు పెట్టుకున్న పోసాని
Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ
Wine Shops Closed : వైన్‌షాపులు బంద్.. ఎందుకో తెలుసా?
ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట
సినిమా

'ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ'.. ఆసక్తిగా ట్రైలర్
టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన తాజా చిత్రం షణ్ముఖ. ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్గా కనిపించనుంది. డివోషనల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమాకు షణ్ముగం సప్పని దర్శకత్వం వహించారు. సాప్‌బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్లో తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ చేశారు.'సూరులైనా.. అసురులైనా.. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇది ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ అనే డైలాగ్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. ఇందులో ఆది సాయి కూమార్ పోలీసు అధికారి పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని, మనోజ్ ఆది, వీర శంకర్, కృష్ణుడు, అరియానా గ్లోరీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 21న థియేటర్లలో సందడి చేయనుంది.

అవును.. ఆమెతో డేటింగ్లో ఉన్నా: అమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ప్రస్తుతం రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు. తన స్నేహితురాలితో డేటింగ్లో ఉన్నమాట వాస్తవమేనని వెల్లడించారు. ముంబయిలో నిర్వహించిన తన పుట్టినరోజు వేడుకల ముందు ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో ఏడాదిగా డేటింగ్లో ఉన్నట్లు తెలిపారు. తాను దాదాపుగా 25 ఏళ్ల నుంచి తెలుసని అమిర్ స్పష్టం చేశారు.గౌరీ స్ప్రాట్ ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నట్లు అమిర్ ఖాన్ వెల్లడించారు. అంతేకాకుండా తన ప్రొడక్షన్ బ్యానర్లో పనిచేస్తోందని వివరించారు. ఆమెతో పాటు ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నారని వివరించారు. ఆమె తన కుటుంబ సభ్యులను కూడా కలిసిందని.. మా రిలేషన్ గురించి వారు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఆమెతో రిలేషన్లో తాను నిబద్ధతతో, సంతోషంగా ఉన్నానని అమిర్ ఖాన్ పేర్కొన్నారు. 'లగాన్', 'దంగల్' లాంటి కొన్ని చిత్రాలను మాత్రమే గౌరీ స్ప్రాట్ చూశారని అన్నారు. తనకు 'సూపర్ స్టార్' అనే లేబుల్‌ను ఉండడాన్ని తాను నమ్మడం లేదని చెప్పినట్లు ఈ సందర్భంగా అమిర్ ఖాన్ గుర్తు చేసుకున్నాడు.తన స్నేహితులు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్‌లను పుట్టినరోజు విందుకు ఆహ్వానించినట్లు అమిర్ ఖాన్ తెలిపారు. ఈ డిన్నర్ పార్టీకి గౌరీ స్ప్రాట్ వచ్చిందని వెల్లడించారు. ఆమె సగం తమిళియన్ కాగా.. మరో సగం ఐరిష్ మహిళ అని అన్నారు. ఆమె తాత స్వాతంత్ర్య సమరయోధుడని అమిర్ పేర్కొన్నారు.కాగా.. అమిర్ ఖాన్ అంతకుముందే చిత్ర నిర్మాత కిరణ్ రావును పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జూలై 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ దంపతులకు ఆజాద్ రావ్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. మొదట మన సూపర్ స్టార్ రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఐరా ఖాన్, జునైద్ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెతో 2002లో విడిపోయారు.

వరుణ్ సందేశ్ లేటేస్ట్ మూవీ.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది
వరుణ్ సందేశ్, మధులిక జంటగా చిత్రం కానిస్టేబుల్. ఈ మూవీకి ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై బలగం జగదీష్ నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ మూవీ నుంచి 'మేఘం కురిసింది' అనే క్రేజీ సాంగ్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..' శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్ర ప్రధానమైxof. పోలీసు శాఖలో కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, కుటుంబ నేపథ్యం, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో నిర్మించిన ఈ చిత్రం విజయవంతం కావాలి. ప్రేక్షకుల ఆదరణ పొందాలి. సినీ పరిశ్రమలో రాణించాలనే లక్ష్యంతో కొత్త నటీనటులు వస్తున్నారని.. వారిని ప్రోత్సహించాలని' సూచించారు.సందేశాత్మక చిత్రాలను తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలోనే హైదరాబాద్ నగరం సినీ హబ్‌గా మారిందని చెప్పారు. చిత్ర నటీనటులు, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ మధులిక, డైరెక్టర్ ఆర్యన్ సుభాన్, నిర్మాత బలగం జగదీశ్, నాయకులు జగ్గయ్య, రమణ పాల్గొన్నారు.

ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సంస్థ!
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఏజెంట్'. 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా మెప్పించింది. అయితే అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ మూవీ విడుదలై దాదాపు రెండేళ్లైన ఓటీటీకి రాలేదు. ఎట్టకేలకు ఈ నెల 14 నుంచి ఓటీటీకి రానుందని సోనిలివ్ ప్రకటించింది. అయితే అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందుగానే ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోజు సాయంత్రం నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇంకేందుకు ఆలస్యం ఏజెంట్ మూవీని ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.Secrets, shootouts, and a mission that rewrites the rules.#Agent is now streaming on SonyLIV.#AgentOnSonyLIV #Agent @mammootty @akkineniakhil @_vaidyasakshi#SurenderReddy #DinoMorea @varusarath5@UrvashiRautela #Varalakshmi pic.twitter.com/iAONMsxtZn— Sony LIV (@SonyLIV) March 13, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

CT 2025: కేఎల్ రాహుల్, శ్రేయస్‌లకు దక్కని చోటు.. కెప్టెన్‌గా అతడు!
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ ఆథర్టన్ తన.. ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ప్రకటించాడు. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురికి మాత్రమే స్థానమిచ్చిన అతడు.. కేఎల్ రాహుల్‌ను విస్మరించాడు. అంతేకాదు శ్రేయస్ అయ్యర్‌ను కూడా పక్కనపెట్టాడు.ఇక ఓపెనింగ్ జోడీగా అఫ్గనిస్తాన్ యువ స్టార్ ఇబ్రహీం జద్రాన్(Ibrahim Zadran), న్యూజిలాండ్ యంగ్‌స్టర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra)లను మైఖేల్ ఆథర్టన్ ఎంచుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ ఇంగ్లిస్‌ను ఎంపిక చేసుకున్న ఈ మాజీ సారథి.. కెప్టెన్‌గా కివీస్ నాయకుడు మిచెల్ సాంట్నర్‌కు స్థానమిచ్చాడు.అత్యుత్తమ ఇన్నింగ్స్ అతడిదేఇక గ్రూప్ దశలోనే తమ జట్టు నిష్క్రమించినప్పటికీ జో రూట్‌కు ఈ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో ఆథర్టన్ చోటు కట్టబెట్టాడు. ఇంగ్లండ్ నుంచి ఒకే ఒక్క ఆటగాడిగా రూట్‌కు ఈ మాజీ బ్యాటర్ స్థానం ఇచ్చాడు. తన జట్టు ఎంపిక గురించి మైఖేల్ ఆథర్టన్ స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీలో నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ జద్రాన్ బ్యాటింగ్ నుంచి వచ్చింది.అందుకే రచిన్ రవీంద్రతో పాటు ఓపెనింగ్ జోడీగా జద్రాన్‌ను ఎంచుకున్నా. ఇక వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి, రూట్ నాలుగో స్థానంలో ఉండాలి. వికెట్ కీపర్ బ్యాటర్‌గా నా ఓటు జోష్ ఇంగ్లిస్కే. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతడు అద్భుత నైపుణ్యాలు కనబరిచాడు.సారథి అతడేఇక ఆరోస్థానంలో ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్కు నేను స్థానం ఇస్తాను. అతడు బ్యాట్‌తో బాల్‌తో రాణించగలడు. అతడు జట్టులో ఉంటే సమతూకంగా ఉంటుంది. ఇక నా ఏడో ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్. మిచెల్ సాంట్నర్‌ను నా జట్టుకు కెప్టెన్‌గా ఎంచుకుంటాను. ఇద్దరు సీమర్లు మహ్మద్ షమీ, మ్యాట్ హెన్రీలకు చోటిస్తా. సాంట్నర్‌తో పాటు మరో స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తిని ఎంచుకుంటా’’ అని మైఖేల్ ఆథర్టన్ వెల్లడించాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ మార్చి 9న దుబాయ్‌లో ముగిసింది. ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించి విజేతగా అవతరించింది. ఈ వన్డే టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ ఆడగా.. వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ ఆడాయి.రాహుల్,శ్రేయస్ అదరగొట్టారుఇక ఈ మెగా టోర్నీలో అఫ్గన్ ఓపెనర్ జద్రాన్ ఇంగ్లండ్‌పై వీరోచిత శతకం బాదాడు. 117 పరుగులు సాధించి టోర్నీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. మరోవైపు.. రచిన్ రెండు శతకాల సాయంతో 263 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. కోహ్లి పాకిస్తాన్‌పై అజేయ శతకం చేయగా.. షమీ బంగ్లాదేశ్‌పై, వరుణ్ న్యూజిలాండ్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు. అయితే, టీమిండియా మిడిలార్డర్లో దిగి కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్(243 రన్స్), కేఎల్ రాహుల్(140 రన్స్)లకు మాత్రం ఆథర్టన్ చోటివ్వకపోవడం గమనార్హం. కాగా ఇంగ్లండ్ తరఫున ఆథర్టన్ 115 టెస్టులు, 54 వన్డేలు ఆడాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.మైఖేల్ ఆథర్టన్ ఎంచుకున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ -2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్:ఇబ్రహీం జద్రాన్, రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లి, జో రూట్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.చదవండి: BGT: ‘నేను జట్టులో ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ’

భారత్‌తో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్‌కు భారీ షాక్
స్వదేశంలో టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు గట్టిఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ గాయం కారణంగా భారత్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. వుడ్ ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వుడ్ ఎడమ మోకాలికి గాయమైంది. దీంతో మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి వుడ్ వైదొలిగాడు. అయితే అతడు కోలుకోవడానికి కనీసం నాలుగు నెలల సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే టీమిండియాతో సిరీస్‌కు వుడ్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సైతం ధ్రువీకరించాడు. అతడు త్వరలోనే తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. ఈ ఏడాది జూలై ఆఖరిలో తిరిగి అతడు జట్టులోకి వచ్చే అవకాశముంది.కాగా మార్క్ వుడ్ కూడా తన గాయంపై అప్డేట్ ఇచ్చాడు. "గత ఏడాది ఆరంభం నుంచి ఎటువంటి విరామం లేకుండా అన్నిఫార్మాట్లలో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాను. కానీ దురదృష్టవశాత్తూ మళ్లీ గాయ పడటం నిజంగా నాకు చాలా బాధగా ఉంది.అయితే వీలైనంత త్వరగా గాయం నుంచి కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను. నాకు మద్దతుగా నిలిచిన వైద్యులు, కోచింగ్ స్టాప్, ఇంగ్లండ్ క్రికెట్, నా సహచరులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని వుడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.ఇదేమి తొలిసారి కాదు..కాగా మార్క్ వుడ్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉండడం ఇదేమి తొలిసారి కాదు. అతడు తన కెరీర్ ఆరంభం నుంచి గాయాలతో సావాసం చేస్తున్నాడు. గతేడాది ఆరంభంలో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు కూడా వుడ్ గాయం కారణంగా దూరమయ్యాడు.2019లో కూడా అతడు తన మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడు అతడు గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో మరోసారి తన గాయానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఈ టెస్టు సిరీస్ జరగనుంది. జూన్‌లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: హార్దిక్ పాండ్యా కంటే అతడు ఎంతో బెటర్: పాక్ మాజీ కెప్టెన్

KKR SWOT: అతడిపై భారం!.. బలాలు, బలహీనతలు ఇవే
గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) విజేతగా నిలిచింది కోల్‌కతా నైట్ రైడర్స్(KKR). తద్వారా మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇక ఈసారి లీగ్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర(RCB)తో కేకేఆర్ తలపడనుంది. సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్‌లో మార్చి 22న ఈ మ్యాచ్ జరుగనుంది.అయితే, గత సంవత్సరం జట్టుని ముందుండి నడిపించిన శ్రేయస్ అయ్యర్ ఈసారి తప్పుకోవడంతో అతని స్థానంలో అనుభవజ్ఞుడైన అజింక్య రహానే బాధ్యతలు స్వీకరించాడు. దీనితో నైట్ రైడర్స్ కొత్త తరహా జట్టుతో ఈ సారి రంగ ప్రవేశం చేయబోతోంది. నైట్ రైడర్స్‌పై ఒత్తిడి ఈ నేపథ్యంలో మళ్ళీ టైటిల్ నిలబెట్టుకోవాలన్న ఆశాభావంతో ఉన్న నైట్ రైడర్స్‌పై సహజంగానే ఒత్తిడి ఉంటుంది. మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు బ్యాటింగ్ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్‌ను రూ.23.75 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. ఫ్రాంఛైజీ అతనికి వైస్ కెప్టెన్‌గా అదనపు బాధ్యతను కూడా అప్పగించింది.ఇక బంగ్లాదేశ్‌లో ఫాస్ట్ బౌలింగ్ విప్లవానికి బీజాలు నాటడంలో విజయం సాధించిన వెస్టిండీస్ మాజీ పేసర్ ఒట్టిస్ గిబ్సన్‌ను నైట్ రైడర్స్ ఇటీవల తమ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. అతడు రావడం ప్లస్ పాయింట్తాజాగా దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ అన్రిచ్ నోర్జే జట్టులో చేరుతున్నట్టు జట్టు అధినేత, నటుడు షారుఖ్ ఖాన్ రెండ్రోజుల క్రితం ప్రకటించాడు. 2025 వేలంలో నైట్ రైడర్స్ రూ. 6.50 కోట్లకు నోర్జేను తిరిగి కొనుగోలు చేసింది.ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫ్రాంచైజీలోకి వచ్చిన నోర్జే అనుభవం, అపార వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉంది. ఇంకా జట్టులో సునీల్ నరైన్, ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ విజయంలో కీలక భూమిక వహించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వంటి సీనియర్లు ఉన్నారు. వీరితో పాటు వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, ఉమ్రాన్ మాలిక్ వంటి వర్ధమాన బౌలర్లతో బలీయంగానే కనిపిస్తోంది. రహానేకు కెప్టెన్‌గా బాధ్యతలు.. గొ ప్ప రికార్డు లేదుఐపీఎల్లో కెప్టెన్‌గా అత్యుత్తమ రికార్డులు లేనందున రహానేపై పెద్ద భారమే కనిపిస్తోంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కు 24 మ్యాచ్‌లలో నాయకత్వం వహించిన రహానే వాటిలో తొమ్మిది మ్యాచ్‌లలో మాత్రమే విజయాన్ని రుచిచూశాడు. 15 మ్యాచ్‌లలో ఓడిపోయాడు. ఐపీఎల్లో కెప్టెన్‌గా రహానే రికార్డు ఏ విధంగానూ ఆశాజనకంగా లేదు.ఇక వ్యక్తిగతంగా చూస్తే రహానే 25 మ్యాచ్‌ల్లో ఆడి 25.34 సగటుతో 583 పరుగులు మాత్రమే చేశాడు. అతను హైదరాబాద్ వేదికపై 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో తన అత్యధిక స్కోరు 70 ని నమోదు చేసుకున్నాడు. కానీ రహానెకి నైట్ రైడర్స్ కొత్త ఫ్రాంచైజీ ఏమీ కాదు. 2022లో నైట్ రైడర్స్ కి ప్రాతినిధ్యం వహించిన రహానే ఏడు మ్యాచ్‌ల్లో 103.90 స్ట్రైక్ రేట్‌తో 133 పరుగులు చేశాడు. కాబట్టి గొప్ప రికార్డులేమీ లేని కెప్టెన్ ఉండటం ఒక బలహీనతగా పరిణమించింది అనడంలో సందేహం లేదు.వేలంలో నైట్ రైడర్స్ ఎలా రాణించింది?వేలానికి ముందు వెంకటేష్ అయ్యర్‌ను విడుదల చేసిన తర్వాత, నైట్ రైడర్స్ అతన్ని అధిక ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్లో అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకరైన ఇంగ్లాండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్‌ను తిరిగి కొనుగోలు చేయడానికి కూడా ప్రయత్నించింది. సాల్ట్ లేకపోయినా, నైట్ రైడర్స్ వద్ద క్వింటన్ డి కాక్, రహ్మానుల్లా గుర్బాజ్ల రూపంలో ఇద్దరు మంచి వికెట్టుకీపర్లు ఉన్నారు. సన్‌రైజర్స్ జట్టు నుంచి తప్పుకున్న తర్వాత తన కెరీర్‌ను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఉమ్రాన్ మాలిక్‌ను కూడా నైట్ రైడర్స్ కనుగోలుచేసింది.ఐపీఎల్ 2025 వేలంలో కొన్న ఆటగాళ్లు:వెంకటేష్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (రూ. 2 కోట్లు), క్వింటన్ డి కాక్ (రూ. 3.60 కోట్లు), ఆంగ్క్రిష్ రఘువంశీ (రూ. 3 కోట్లు), అన్రిచ్ నార్ట్జే (రూ. 6.50 కోట్లు), వైబ్హవ్ 8 కోట్లు. మయాంక్ మార్కండే (రూ. 30 లక్షలు), రోవ్‌మన్ పావెల్ (రూ. 1.50 కోట్లు), మనీష్ పాండే (రూ. 75 లక్షలు), స్పెన్సర్ జాన్సన్ (రూ. 2.80 కోట్లు), లువ్నిత్ సిసోడియా (రూ. 30 లక్షలు), అజింక్యా రహానె (రూ. 30 లక్షలు), అనీక్లీ ఎ. 4 లక్షలు (రూ. 1.50 లక్షలు), అనూక్లీ రోయ్ లక్షలు (రూ. 1.50 లక్షలు), 2 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 75 లక్షలు).ప్రధాన ఆటగాళ్లు:వరుణ్ చక్రవర్తి: ఛాంపియన్స్ ట్రోఫీలో తొమ్మిది వికెట్లతో రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నైట్ రైడర్స్ తరఫున 82 వికెట్లు తీసిన వరుణ్ ఈ సీజన్లో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.సునీల్ నరైన్: వెస్టిండీస్ ఆల్ రౌండర్ గత సీజన్లో అత్యంత విలువైన ఆటగాడిగా అవార్డు గెలుచుకున్న నరైన్ 17 వికెట్లు పడగొట్టడమే కాకుండా, 34.85 సగటుతో 488 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.ఆండ్రీ రస్సెల్: ఆండ్రీ రస్సెల్ దశాబ్ద కాలంగా నైట్స్ తరఫున కీలక ఆటగాడిగా ఉన్నాడు. అందువల్ల యాజమాన్యం అతనిపై విశ్వాసం చూపించింది. గత సంవత్సరం రస్సెల్ 222 పరుగులు చేసి 19 వికెట్లు పడగొట్టి, నైట్ రైడర్స్ టైటిల్ సాధనలో కీలక పాత్ర పోషించాడు.అజింక్య రహానే: అజింక్య రహానేకు చాలా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ లో అపార అనుభవం ఉంది.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా?

హార్దిక్ పాండ్యా కంటే అతడు ఎంతో బెటర్: పాక్ మాజీ కెప్టెన్
హార్దిక్ పాండ్యా(Hardhik Pandya).. భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. వైట్‌బాల్ ఫార్మాట్లో తన ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో టీమిండియాకు అద్బుతమైన విజయాలను అందిస్తున్నాడు. బంతితో మ్యాజిక్, బ్యాట్‌తో విధ్వంసం చేయగల సత్తా అతడిది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను భారత్ సొంతం చేసుకోవడంలోనూ హార్ధిక్‌ది కీలక పాత్ర.బౌలింగ్, బ్యాటింగ్‌లో పాండ్యా అదరగొట్టాడు. అంతకుముందు టీ20 వరల్డ్‌కప్-2024లోనూ ఈ బరోడా ఆల్‌రౌండర్ సత్తాచాటాడు. ఈ క్రమంలో పాండ్యాను పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ హఫీజ్ ప్రశంసించారు. పాండ్యా తను ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ అద్బుతాలు చేస్తున్నాడని వారిద్దరూ కొనియాడారు."హార్దిక్ పాండ్యా ఏమి.. మాల్కం మార్షల్, వాకార్ యూనిస్, జవగల్ శ్రీనాథ్, బ్రెట్ లీ కాదు. ఈ లెజెండ్స్ లాంటి స్కిల్స్ పాండ్యాకు లేవు. కానీ బంతితో మాత్రం అద్బుతాలు సృష్టిస్తున్నాడు. కొత్త బంతితో చాలా మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో కూడా తన సత్తాచూపిస్తున్నాడు. హార్దిక్ అంత పెద్ద హిట్టర్ కూడా కాదు. కానీ తన టెక్నిక్‌తో భారీ షాట్లు ఆడుతున్నాడు. నిజంగా అతడిని మెచ్చుకోవాల్సిందే. 2000లో పాకిస్తాన్ జట్టులో హార్దిక్ లాంటి ఆటగాళ్లు చాలా మంది ఉండేవారు అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు. కాగా అక్తర్ చేసిన వ్యాఖ్యలను మరో మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ ఏకీభవించాడు."అక్తర్ భాయ్ చెప్పింది అక్షరాల నిజం. అబ్దుల్ రజాక్ వంటి ఆల్‌రౌండర్ ప్రదర్శనలను చూస్తే మనకు ఆర్దమవుతోంది. అతడు హార్దిక్ పాండ్యా కంటే చాలా బెటర్. అతడొక మ్యాచ్ విన్నర్. కానీ పాకిస్తాన్ క్రికెట్లో అతడికి సరైన గౌరవం దక్కలేదు. రజాక్లో కూడా స్కిల్స్ తక్కువగా ఉన్నప్పటికి.. అద్బుతమైన ప్రదర్శన చేసే వాడని" హాఫీజ్ చెప్పుకొచ్చాడు.కాగా రజాక్.. తన కెరీర్లో పాకిస్తాన్ తరపున 46 టెస్టులు, 265 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లో వరుసగా 1946, 5080, 393 పరుగులు చేశాడు. వన్డేల్లో అతడి పేరిట 269 వికెట్లు ఉన్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలవగా.. పాకిస్తాన్ మాత్రం దారుణ ప్రదర్శనతో గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది.చదవండి: WC 2027: రోహిత్ శర్మ ప్లానింగ్ ఇదే!.. అతడి మార్గదర్శనంలో సన్నద్ధం!
బిజినెస్

‘జీతాల తేడాలొద్దు.. ఉద్యోగులను మనుషుల్లా చూడండి’
ఉద్యోగుల మధ్య జీతాల ( salaries ) తేడాల్లేకుండా వారిని మనుషుల్లాగా చూడాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి (Infosys founder Narayana Murthy) వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలకు ఉద్బోధించారు. కారుణ్య పెట్టుబడిదారీ విధానాన్ని అవలంబించడం ద్వారా తక్కువ, ఎక్కువ అనే వేతన వ్యత్యాసాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ‘టై కాన్ ముంబై 2025’ కార్యక్రమంలో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు.ప్రతి కార్పొరేట్ ఉద్యోగి గౌరవాన్ని, హుందాతనాన్ని నిలబెట్టాల్సి ఉందని, ఇందుకోసం ‘ఉద్యోగులను ప్రశంసించేటప్పుడు బహిరంగంగా, వారి లోపాలను చెప్పాల్సినప్పుడు ఏకాంతంగా చెప్పాలి. సాధ్యమైనంత వరకు సంస్థ ఫలాలను కంపెనీ ఉద్యోగులందరికీ న్యాయంగా పంచాలి’ అని నారాయణమూర్తి సూచించారు.దేశంలోని వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారీ విధానాన్ని కరుణతో స్వీకరించినప్పుడే భవిష్యత్ భారత అభివృద్ధి, పేదరిక నిర్మూలన జరుగుతుందని ఆయన అన్నారు. దేశాన్ని గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దేందుకు భారత్ లోని యువత కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన మూర్తి గతంలో వారానికి 70 గంటల పనిపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొన్నారు.టై కాన్ ముంబై 2025లో టై ముంబై మాజీ వ్యవస్థాపక అధ్యక్షుడు హరీష్ మెహతాతో మాట్లాడిన మూర్తి, ప్రస్తుత సోషలిస్టు మనస్తత్వంలో దేశం అభివృద్ధి చెందదని అభిప్రాయపడ్డారు. "పెట్టుబడిదారీ విధానం అంటే సంపదను సృష్టించడానికి ప్రజలు కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చేలా అవకాశం కల్పించడం. ప్రజలకు ఉద్యోగాలు కల్పించి తద్వారా పేదరికాన్ని తగ్గించడం. పన్నుల ద్వారా దేశ అభివృద్ధికి దోహదం చేయడం" అని మూర్తి వివరించారు.

ఇన్ఫీలో శ్రుతి శిబూలాల్ పెట్టుబడి
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ఎస్డీ శిబూలాల్ కుమార్తె శ్రుతి కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా 29.84 లక్షల షేర్లను సొంతం చేసుకున్నారు. ఇందుకు శ్రుతి శిబూలాల్ దాదాపు రూ. 470 కోట్లు వెచ్చించారు.షేరుకి రూ. 1,574 సగటు ధరలో వీటిని కొనుగోలు చేశారు. ఎస్డీ శిబూలాల్ కుటుంబ సభ్యులలో ఒకరైన గౌరవ్ మన్‌చందా ఈ షేర్లను విక్రయించారు. కాగా.. మంగళవారం సైతం శ్రుతి శిబూలాల్ రూ. 494 కోట్ల విలువైన ఇన్ఫోసిస్ వాటాను కొనుగోలు చేయడం గమనార్హం!

ఫ్రెషర్లకు డిమాండ్: ఐటీలో నియామకాలు డబుల్
గతకొన్ని నెలలుగా దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం.. కొత్త ఉద్యోగులను నియమించుకోకపోవడం మాత్రమే కాకుండా, ఉన్న వారిని కూడా ఉద్యోగాల్లో నుంచి తీసేస్తోంది. అయితే త్వరలోనే ఐటీ రంగం పుంజుకుంటుందని.. ఉద్యోగ నియామకాలు కూడా భారీగా ఉంటాయని రిక్రూటింగ్ సంస్థ టీమ్‌లీజ్ తన నివేదికలో వెల్లడించింది.2026 ఆర్థిక సంవత్సరంలో టెక్నాలజీ సేవల రంగంలో ఫ్రెషర్ల నియామకం దాదాపు రెట్టింపు అవుతుందని, గత సంవత్సరంతో పోలిస్తే నియామకాలు 1,50,000 కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. టీమ్‌లీజ్ డేటా ప్రకారం, మార్చి 2025 నాటికి దాదాపు 85,000 - 95,000 మంది ఫ్రెషర్ల నియమాలకు జరుగుతాయి.అన్ఎర్త్ఇన్సైట్ పరిశోధన ప్రకారం.. యాక్సెంచర్, క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ ఐటీ సేవల సంస్థలు కొత్తగా 1.6 లక్షల నుంచి 1.8 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొత్త ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతుంది.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు.. టెక్ కంపెనీ కొత్త రూల్! 2024 ప్రారంభం నుంచి కూడా చాలా కంపెనీలు.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చాయి. కాబట్టి కొత్త నియమాల విషయం కొంత ఆలోచించి, ప్రస్తుత టెక్నాలజీకు అవసరమైన నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగావకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇండియన్, మల్టి నేషనల్ కంపెనీలు రెండూ కూడా కొత్తవారి నియామకాలను చేపట్టనున్నాయి. అయితే కొత్త నైపుణ్యాలను నేర్చుకున్న.. ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని టీమ్‌లీజ్ సర్వేలో వెల్లడైంది.

నష్టాల్లో మార్కెట్లు.. మళ్లీ ముంచిన ‘ఇండస్ఇండ్ బ్యాంక్’
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. లాంగ్ వీకెండ్ కు ముందు ఇన్వెస్టర్లు కొత్త పొజిషన్లకు దూరంగా ఉండటంతో బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలపై అనిశ్చితి నెలకొనడంతో ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకోవడానికే మొగ్గుచూపారు. కాగా హోలీ పండుగ కారణంగా శుక్రవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ట్రేడింగ్‌కు క్లోజ్ కానున్నాయి.బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ప్రారంభ ట్రేడింగ్ లో 74,401 వద్ద గరిష్టానికి చేరుకున్నప్పటికీ, కొద్దిసేపటికే లాభాలను ఆర్జించింది. ఆటో, ఐటీ, ఎంపిక చేసిన బ్యాంకింగ్ షేర్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ బెంచ్ మార్క్ రెడ్‌లోకి జారి 630 పాయింట్ల నష్టంతో 73,771 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 201 పాయింట్ల నష్టంతో 73,829 వద్ద ముగిసింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 504 పాయింట్ల నష్టంతో వారాన్ని ముగించింది.ఇక నిఫ్టీ 22,558 వద్ద గరిష్ట స్థాయి నుంచి 22,377 వద్ద కనిష్టానికి పడిపోయి, చివరకు 73 పాయింట్ల నష్టంతో 22,397 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఈ వారంలో 156 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 30 షేర్లలో టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ దాదాపు 2 శాతం చొప్పున నష్టపోయాయి. జొమాటో, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా నష్టపోయాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు 0.5 శాతానికి పైగా లాభాలను చూశాయి.మరోవైపు విస్తృత సూచీలు కూడా ఈరోజు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో ట్రేడైన 4,105 షేర్లలో 60 శాతం లేదా 2,449 షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ రియాల్టీ సూచీ 1.8 శాతం నష్టపోయింది. గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియల్టీ, లోధా, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, ఫీనిక్స్ షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి.
ఫ్యామిలీ

మధుమేహం లేకపోయినా కిడ్నీ వ్యాధి వస్తుందా..?
కిడ్నీ.. మానవ శరీరంలో అతిముఖ్యమైన అవయవం. తినేతిండి, తాగే నీటిని వడకట్టి వడబోసి.. శరీరానికి అవసరమైన శక్తిని రక్తంలోకి, మలినాలను, వ్యర్థాలను మలమూత్రవిసర్జన ద్వారా బయటికి పంపించే ప్రక్రియను కిడ్నీ నిర్వహిస్తుంది. ఇటీవలకాలంలో తెలంగాణ కరీంనగర్ జిల్లాలో కిడ్నీవ్యాధి బాధితులు పెరుగుతున్నారు. పిల్లలు, యువతను సైతం సమస్య వెంటాడుతోంది. అనేక మందికి ముందస్తు లక్షణాలు లేకపోవడం, మధుమేహం లేకపోయినా మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోవడం కనిపిస్తోంది. దశాబ్దకాలంలో వేలాదిమంది మరణాలకు కారణమైన వ్యాధికి ప్రధాన కారణాలు మధుమేహం, అధిక రక్తపోటు కాగా పెయిన్ కిల్లర్స్ అధిక వినియోగం, డీహైడ్రేషన్ మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయి. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కథనం.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన పబ్బతి విజయేందర్‌రెడ్డి(55) వ్యవసాయం చేస్తుంటాడు. ఒకరోజు అనూహ్యంగా వాంతులయ్యాయి. కాళ్లు వాపులు వచ్చాయి. వెంటనే కరీంనగర్ వెళ్లగా రక్త పరీక్షలు చేసిన డాక్టర్లు కిడ్నీలు ఫెయిలయ్యాయని నిర్ధారించారు. విజయేందర్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, వారానికి రెండుసార్లు డయాలసిస్ చేశారు. ప్రతిసారీ రూ.5000 చొప్పున నెలకు రూ.40వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అయ్యాయి. విజ యేందర్‌రెడ్డిని ఆస్పత్రిలో అచేతన స్థితిలో చూసిన తమ్ముడు జితేందర్‌రెడ్డి(51) తన రెండు కిడ్నీల్లోని ఒక్కటి ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది. విజయేందర్‌రెడ్డికి జితేందర్‌రెడ్డి కిడ్నీ మ్యాచ్ అయింది. అదిపని చేయడం ప్రారంభించింది. మృత్యుముంగిట అసహాయంగా చేతులు కట్టుకుని నిల్చున్న సోదరుడికి ఆత్మీయ రక్తబంధం పునర్జన్మనిచ్చింది.కిడ్నీలు ప్రతిరోజు దేహంలో 200 లీటర్ల రక్తాన్ని శుభ్రం చేస్తూ, యూరియా, క్రియాటినిన్ లాంటి జీవరసాయనాలను వడపోస్తాయి. కిడ్నీల పనితీరు దాదాపు 70 నుండి 80 శాతానికి పడిపోయే వరకు బాధితులకు ఆ విషయమే తెలియదు. ఒకసారి కిడ్నీలు గనక చెడిపోతే, జీవక్రియల్లో వెలువడే ఎన్నో విషరసాయనాలు దేహంలోనే పేరుకుపోవడం మొదలవుతుంది. దీంతో ప్రాణాలకే ముప్పు తెచ్చి పెడుతుంది. అవగాహన లేమి, నిర్లక్ష్యం, విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్ మందులు వాడకంతో ఉమ్మడి జిల్లాలో జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. మూత్రపిండాలు ఒకసారి దెబ్బతింటే తిరిగి బాగు చేయటం సాధ్యం కాదు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే పాడవకుండా చూసుకోవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. గురువారం ‘ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం’ సందర్భంగా కథనం.ఇదీ నేపథ్యం2006లో తొలిసారిగా మార్చి 14న ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఏటా ప్రత్యేక థీమ్‌ని ప్రకటించి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల ఆరోగ్యం, డయాలసిస్ అవగాహన కోసం ఏటా మార్చి రెండవ గురువారం “ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.థీమ్: “మీ మూత్రపిండాలు బాగున్నాయా? ముందుగానే గుర్తించండి.., మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడండి..’' అనేది ఈ ఏడాది నినాదం. కిడ్నీ వ్యాధికి సంబంధించిన ప్రమాద కారకాలు మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ) కుటుంబంలో మూత్రపిండాల వ్యాధి చరిత్ర ఉండడమని వైద్యులు పేర్కొంటున్నారు.కిడ్నీల పనితీరు కీలకంమూత్రపిండాలు మూత్రం తయారీతోపాటు రక్తం వడపోతలో కీలకంగా పనిచేస్తాయి. కణాలు ఉత్పత్తి చేసే ఆమ్లాలను (యాసిడ్)ను బయటకు పంపిస్తాయి. రక్తంలో నీరు, లవణాలు, సోడియం, కాల్షియం, భాస్వరం, పోటాషియం వంటివి సమతుల్యంగా ఉండేలా చేస్తాయి. కిడ్నీలు దెబ్బతింటే ప్రాణాలు కోల్పేయే ప్రమాదం ఉంది. సీరం క్రియాటిన్ పరీక్ష ద్వారా కిడ్నీ పనితీరును తెలుసుకునే వీలుంది. ఏడాదికోసారైనా ఈ పరీక్ష చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలుమూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రక్తపోటు, మధుమేహం, అధిక బరువు వంటివి తలెత్తకుండా చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం మానుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి, వ్యాయామం చేయాలి. ఉప్పు తక్కువ తీసుకోవాలి. అధికంగా మాంసం తీసుకోవద్దు. ఆహారంలో సగభాగం పీచు పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి. నొప్పి గోళీలు, అనవసరంగా స్టెరాయిడ్స్ వాడకూడదు.ఉమ్మడి జిల్లాలో మూత్రపిండ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యరంగంలో కిడ్నీ బాధితులకు నామమాత్రపు వైద్య సేవలు అందుతున్నాయి. స్థానికంగా ప్రైవేటు రంగంలో నెఫ్రాలజిస్టులు ఉన్నప్పటికీ సదుపాయాల కొరతతో రోగులు పెద్ద నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ వైద్యశాలల్లో నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలు లేవు. చికిత్స మాత్రమే అందిస్తున్నారు.గోదావరిఖని జీజీహెచ్‌తోపాటు పెద్దపల్లి జిల్లా ఆస్పత్రి, మంథని ప్రభుత్వాస్పత్రుల్లో ఐదు మిషన్లు చొప్పున మూడు డయాలసిస్ కేంద్రాలున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద జీజీహెచ్‌లో రోజుకు 16 మందికి నాలుగు షిప్టుల ద్వారా నెలలో 40మందికి, పెద్దపల్లిలో రోజుకు 15 మందికి మూడు షిఫ్టుల చొప్పున నెలకు 33 మంది పేషెంట్లకు, మంథనిలో రోజుకు తొమ్మిది మందికి ఒక షిఫ్టులో నెలలో 9మంది పేషెంట్లకు డయాలసిస్ చేస్తున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా 95మంది కిడ్నీలు (మూత్రపిండాలు) ఫెయిల్ అయి డయాలసిస్‌పై జీవిస్తున్నారు. వందలాది మంది సకాలంలో వైద్యం అందక, కిడ్నీ అందించే రక్తసంబంధీకులు ఎవరూ ముందుకు రాక.. ప్రాణాలు కోల్పోయారు.కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. జిల్లా ఆస్పత్రితో పాటు నగర శివా రులో ఉన్న రెండు వైద్యకళాశాలల్లో సైతం డయాలసిస్ సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నారు.పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దుఈ మధ్య చాలా మంది పేయిన్ కిల్లర్స్, ఇతర హానికరమైన మందులను విచ్ఛలవిడిగా మింగుతున్నారు. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులను వాడకూడదు. నాటు వైద్యం జోలికి వెళ్ల కూడదు. జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, వంశపారంపర్య రుగ్మతలు కిడ్నీ వ్యాధులకు కారణం. సంపూర్ణ ఆరోగ్యం కోసం మన జీవనశైలిని మార్చుకోవాలి. – కుందరాపు గోపికాంత్, యూరాలజిస్టు, గోదావరిఖనిలక్షణాలు తెలియడం లేదుచాలా మంది వ్యాధి ముదిరే వరకు లక్షణాలు తెలియపోవడం వల్ల పరిస్థితి విషమించిన తర్వాత వైద్యం కోసం వస్తున్నారు. తగ్గని జ్వరం, కాళ్లు, ముఖం వాపులు, యూరిన్‌లో ప్రొటీన్లు పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అశ్రద్ధ చేయడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు.– రాంచందర్ తొర్రెం, నెఫ్రాలజిస్టు (చదవండి: డీహైడ్రేషన్‌కు రీహైడ్రేషన్‌తో చెక్..! ఎండాకాలం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..)

సుర్రుమంటున్న సూర్యుడు.. డీహైడ్రేషన్ బారినపడకూడదంటే..!
ఎండాకాలం మొదలైంది. మార్చి రెండోవారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గతేడాది 47 నుంచి 49 డిగ్రీల సెల్సీయస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా అదేస్థాయిలో మండే ఎండలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఎలాంటి వైద్య సేవలు పొందాలి? తదితర అంశాలను గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీంనగర్ జిల్లా వైద్య అధికారి(డీఎంహెచ్‌వో) వెంకటరమణ వివరించారు.వేసవిలో ఎలాంటి రక్షణ పొందాలి?డీఎంహెచ్‌వో: ఎండ ఎక్కువగా ఉండే 11 నుంచి 3 గంటల మధ్య సమయంలో బయటికి వెళ్లకుండా ఉండడం మంచింది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా రుమాలు పెట్టుకుని, తెల్లని దుస్తులు ధరించాలి. రేకులషెడ్లలో నివాసముండే వారు కూడా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. రేకులపై గడ్డి, గోనె సంచులను వేసుకొని నీళ్లు చల్లాలి.రోజూ ఎన్ని నీళ్లు తాగాలి? డీఎంహెచ్‌వో: ఎండాకాలంలో నీటిశాతం లోపంవల్ల శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. శరీరంలో శక్తి తగ్గి అలసట కలుగుతుంది. ప్రతీ రోజు 8నుంచి 10గ్లాసుల నీరు తాగాలి. ముఖ్యంగా ప్రయాణం లేదా బయట పనులున్నప్పుడు నీరు తాగడం మరిచిపోవద్దు. అది కూడా సురక్షితమైన నీటిని తీసుకోవాలి.ఆహారం విషయంలో జాగ్రత్తలు?డీఎంహెచ్‌వో: ఎండాకాలంలో మిగిలిన ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి. ప్రతీరోజూ తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్, బిర్యానీలు, మసాలాలతో తయారు చేసే ఆహారాన్ని పూర్తిగా తగ్గించాలి. మజ్జిగ, ఓఆర్ఎస్, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలి.శరీరంలో టెంపరేచర్ పెరిగినప్పుడు ఏం చేయాలి? డీఎంహెచ్‌వో: శరీరంలో టెంపరేచర్ పెరిగినప్పుడు, బట్టలు తీసేసి చల్లటి నీటితో ముఖం, చేతులు, కాళ్లు తుడవాలి. గాలి ఆడే స్థలంలో విశ్రాంతి తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.ఆస్పత్రుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? డీఎంహెచ్‌వో: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. డీహైడ్రేషన్ జరగకుండా ఉండేందుకు 2 లక్షల ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాం. అంగన్వాడీ కేంద్రాల్లో, ఉపాధిహామీ కూలీలకు పనిస్థలాల్లోనూ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరైనా వాడుకోవచ్చు.గతేడాది వడదెబ్బ మరణాలు సంభవించాయా? డీఎంహెచ్‌వో: గతేడాది జిల్లాలో ఇద్దరు వడదెబ్బ కారణంగా మరణించారు. వడదెబ్బతో మరణించినట్లు నిర్ధారించేందుకు త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేశాం. ఇందులో మెడికల్ ఆఫీసర్, తహసీల్దార్, పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ సభ్యులుగా ఉంటారు. వీరి ద్వారా వడదెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారణ జరిగితే ప్రభుత్వం నుంచి కలెక్టర్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.గర్భిణులు, పిల్లలు, వృద్ధులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? డీఎంహెచ్‌వో: గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలికవ్యాధులతో బాధపడే వారు హైరిస్క్ గ్రూపులో ఉంటారు. వీరు ఎండలో ఎక్కువ సమయం ఉండొద్దు. ముఖ్యంగా గర్భిణులు డెలివరీకి ముందే ప్లాన్ చేసుకొని ఆసుపత్రికి చేరుకోవాలి. పిల్లలు, వృద్ధులు, బీపీ, షుగర్, కేన్సర్ తదితర వ్యాధులతో బాధపడేవారు ఎండలో తిరిగే సాహసం చేయవద్దు.డీహైడ్రేషన్ అయితే ఏం చేయాలి?డీఎంహెచ్‌వో: డీహైడ్రేషన్ అయితే రీహైడ్రేషన్‌తో చెక్ పెట్టాలి. ఎవరైనా డీహైడ్రేషన్‌కు గురైన వెంటనే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఉప్పునిమ్మకాయ కలిపిన నీరు తాగించాలి. ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. (చదవండి: ఆ చెఫ్ చేతులు అద్భుతం చేశాయి..! వావ్ బంగాళదుంపతో ఇలా కూడా..)

Holi 2025 : ఎపుడూ వైట్ డ్రెస్సేనా? కలర్ ఫుల్‌గా, ట్రెండీగా.. ఇలా!
హోలీ (Holi) అంటే.. రంగుల రాజ్యం. ఆద్యంతం హుషారుగా సాగే ఏకైక పండుగ ఇదేనేమో.. డ్యాన్స్, మ్యూజిక్, విందు వినోదాల కలయికగా సాగే ఈ పండుగ సందర్భంగా అనుసరించే ఫ్యాషన్ కూడా కలర్ఫుల్గా ఉండాలి కదా.. కాబట్టి కలర్ ఫెస్ట్‌లో ప్రత్యేకంగా కనబడేందుకు తాను చెప్పే స్టైల్స్‌తో లుక్‌ని కొత్త లెవల్‌కి తీసుకెళ్లండి అని సూచిస్తున్నారు నగరానికి చెందిన ఫ్యాషన్ కన్సెల్టెంట్ సుమన్ కృష్ణ. ఈ ఏడాది ఆరంభం నుంచి ట్రెండింగ్‌లో ఉన్న కలర్.. బ్లాక్‌ని సెంటరాఫ్ ఫ్యాషన్‌గా చేసి హోలీ వేడుకలో త‘లుక్’మనవచ్చని అంటున్నారామె. ఆమె అందిస్తున్న విశేషాలు, సూచనలివీ.. – సాక్షి, సిటీబ్యూరో కలర్ బ్లాకింగ్ అంటే..? ఇది విభిన్న, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ స్టైల్. మామూలు వైట్ కుర్తా బోరింగ్‌గా ఉంటుంది. సో.. ట్రెండీ కలర్ కాంబినేషన్లతో లుక్‌కి ఎక్స్ట్రా గ్లామర్ వస్తుంది.. ఒకే షేడ్‌లో ఉండే డ్రెస్సింగ్ కంటే, రెండు లేదా మూడింటికి పైగా బ్రైట్ కలర్స్ మిక్స్ చేసి ధరించడం ద్వారా మరింత స్టైలిష్‌గా కనిపిస్తారు. కొన్ని కలర్ కాంబినేషన్స్.. ధరించే దుస్తుల మధ్య సరైన కలర్ కాంబినేషన్ చాలా కీలకం. పింక్–ఆరేంజ్ హోలీకి చాలా ఎనర్జిటిక్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అలాగే..ఎల్లో–పర్పుల్ వంటి బ్రైట్ షేడ్స్ ట్రెడిషనల్ హోలీ లుక్‌కి సరైన ఎంపిక. అంతేకాకుండా బ్లూ–రెడ్ కూడా ట్రెండీ లుక్ అందిస్తాయి. వైట్–రేసింగ్ గ్రీన్‌లు క్లాసిక్‌గా కనపడాలంటే బెస్ట్. పీచ్‌లను సున్నితమైన, పండుగ కళ తెచ్చే కలర్స్‌గా పేర్కొనవచ్చు.స్టైల్–కంఫర్ట్ రెండింటి మేళవింపులా ఇంపుగా అనిపించాలంటే, కాటన్ లేదా లినెన్ ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవడం మంచిది. బ్రైట్ టాప్ + లైట్ బాటమ్ – లేదా ఆపోజిట్ కలర్ బ్లాక్ డ్రెస్సింగ్ ట్రై చేయవచ్చు. బాగీ/లూజ్ కుర్తాస్, ఫ్యూజన్ ధోతి ప్యాంట్స్ హోలీ మూడ్‌కి సరిగ్గా సరిపోతాయి. హోలీ డాన్స్‌లో ఫుల్ ఫన్ కోసం బెస్ట్ ఆప్షన్‌గా పాదాలకు స్నీకర్స్ బెస్ట్. సన్‌గ్లాసెస్, వాటర్ ప్రూఫ్ మేకప్ – హోలీ ఎఫెక్ట్స్ స్టైలిష్‌గా హ్యాండిల్ చేయండి. ఇలా చేయొద్దు.. పూర్తిగా వైట్ డ్రెస్సింగ్ వద్దు. దీనివల్ల రంగుల మిక్స్ తక్కువగా కనిపిస్తుంది. హెవీ మెటీరియల్స్, సిల్క్ ధరిస్తే అన్ ఈజీగా అసౌకర్యంగా ఉంటుంది. అలాగే కాళ్లకు హీల్స్ ధరిస్తే జారిపడే చాన్స్ ఎక్కువ. మేకప్, హెయిర్ ప్రొటెక్షన్ లేకుండా వెళ్లడం పెద్ద పొరపాటు అవుతుంది.ఫైనల్ టచ్.. ఈ హోలీలో బ్లాక్ కలర్‌తో మ్యాజిక్ ట్రై చేయవచ్చు. ఫొటోలు మరింత ట్రెండీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఈ హోలీ జ్ఞాపకాలతో ఆనందాన్ని ఏడాది పాటు కొనసాగించవచ్చు.

ప్రతి పురుషుని విజయం వెనుక ఓ స్త్రీ శక్తి..!
మన పురాణాలలో స్త్రీని శక్తి స్వరూపిణిగా వర్ణిస్తారు. ఒక స్త్రీ శక్తి స్వరూపిణిగా ఉంటూ చుట్టూ అందరి చేత గౌరవింప బడితే అక్కడ దేవతలు నివసిస్తారు అంటారు. అయితే ఆమె శక్తి ఏమిటి? ఆ శక్తికి ఏమైనా కొలమానం ఉందా? అది ఏ విధమైన శక్తి? ఎలా పని చేస్తుంది? ఇటువంటి ప్రశ్నలన్నింటికీ మాతాజీ నిర్మలా దేవి బోధనలలో మనకు సరైన సమాధానం లభిస్తుంది.మన ఇతిహాసాలలో శ్రీ రాముని శక్తి సీత. శివుని శక్తి పార్వతి. శ్రీ కృష్ణుడి శక్తి రాధ. ఈ శక్తులు రాక్షస సంహారం కోసం కానీ యుద్ధం చేయడానికి కానీ రణరంగానికి వెళ్ళలేదు. శ్రీ కృష్ణుడు లేదా శ్రీ రాముడే యుద్ధం చేశారు. కానీ వారి శక్తి ప్రభావం వారి చేత యుద్ధం చేయించింది. దీని గురించి మాతాజీ నిర్మలా దేవి ఎలా వివరిస్తారు అంటే పురుషులది గతి శక్తి... స్త్రీలది స్థితి శక్తి. ఉదాహరణకు స్విచ్ వేసినప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది. మనకు బయటకు చూడడానికి ఫ్యాన్ తిరుగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ నిజానికి దానిని తిప్పుతున్నది దాని లోపల ప్రవహిస్తున్న విద్యుచ్ఛక్తి. అదే విధంగా పురుషులు బయటకు పనులు చేస్తున్నట్లు కనిపించినా వారి చేత ఆ పనులు చేయించే శక్తి మాత్రం స్త్రీల శక్తియే. అందుకే స్త్రీని శక్తి స్వరూపిణి అంటారు.ఆసక్తికరమైన విషయమేమిటంటే జీవశాస్త్రం ప్రకారం కణంలో ఉండే శక్తి కేంద్రాన్ని మైటోకాండ్రియా అంటారు. ఈ మైటోకాండ్రియా మానవులలో ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించేటప్పుడు తల్లి నుండే లభిస్తుంది. అంటే ప్రతీ మానవునికి శక్తి తల్లి నుండే లభిస్తుంది. కావున సైన్సు ప్రకారం కూడా శక్తికి మూలం స్త్రీ యే. ఈ తల్లులందరికీ మూలమైన తల్లిని హిందూ ధర్మంలో ఆదిశక్తి అని పిలుస్తారు. ఆమెనే గ్రీకులు అథెనా అనే దేవతగా కొలుస్తారు.శక్తి అంటే మొత్తం అన్ని శక్తులు అని, ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి అని కాదు. ఈ శక్తులన్నీ మన సూక్ష్మ శరీరంలో షట్చక్రాలన్నింటిపై ఉంటాయి. ఈ శక్తులు లేకుండా దేవతల ఏ పనీ జరగదు. ఉదాహరణకు శ్రీ కృష్ణుడి శక్తి శ్రీ రాధ, శ్రీ రాముడి శక్తి శ్రీ సీత; శ్రీ మహా విష్ణువు శక్తి శ్రీ లక్ష్మి. అదేవిధంగా శక్తులన్నింటి నివాసం దేవతలతో ఉంటుంది. శక్తి లేకుండా దేవతలు ఏమీ చేయలేరు. ఆ మొత్తం శక్తి అంతా శ్రీ జగదాంబగా మన మధ్య హృదయ చక్రంలో ఉంటుంది. ఈ జగదాంబ శక్తి చాలా ప్రబలమైనది. శక్తి ఆరాధన అంటే అందరు దేవతల అన్ని శక్తులకు పూజ జరుగుతుంది. ఈ శక్తులు చెడి΄ోవడం వలన మన చక్రాలు దెబ్బతింటాయి. అందువల్ల మనకు శారీరక, మానసిక, భావోద్వేగ పరమైన సమస్యలన్నీ వస్తాయి. అందుకే ఈ శక్తులను ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉంచుకోవడం ముఖ్యం. అందుకే దేవిని ప్రసన్నం చేసుకోవాలని అంటుంటారు. సహజ యోగ సాధన ద్వారా మన సూక్ష్మ శరీరంలో కుండలినీ శక్తి ని మేల్కొలపడం వలన ఈ శక్తి మరొక శక్తిని పొందుతుంది. ఈ శక్తులలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అవి ఆది శక్తి యొక్క సర్వవ్యాప్త శక్తి అయిన పరమ చైతన్యంతో ఏకమవుతాయి. ఆ విధంగా ఏకమవ్వడం వలన ఆ శక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. ఈ చిన్న చిన్న శక్తులన్నీ ఆ శక్తితో కలిసిపోతాయి. ఉదాహరణకు, మీ హృదయ శక్తి బలహీనంగా ఉంటే, అది పరమ చైతన్యంతో అనుసంధానించబడినప్పుడు, ఈ బలహీనమైన శక్తి తిరిగి బలాన్ని పొందుతుంది. ఆ సందేశం అన్ని శక్తులకు చేరుతుంది, ఇప్పుడు ఈ శక్తి బలాన్ని పొందింది కాబట్టి చింతించాల్సిన పనిలేదు అని. శక్తి స్వభావం స్త్రీ స్వభావం కాబట్టి స్త్రీని గౌరవించడం, గృహిణిని గృహలక్ష్మిగా చూడడమనేది పురుషులు నేర్చుకోవలసిన చాలా ముఖ్యమైన విషయం.స్త్రీలు తమ భర్తను, పిల్లలను గృహ సంబంధ కార్యాలను చూసుకోవాలి. కానీ భర్తకు బయటి కార్యాలకు సంబంధించి, సంపాదన, ఆర్థిక వ్యవహారాలు లాంటి అనేక పనులు ఉంటాయి కాబట్టి. అదే విధంగా పురుషులు కూడా భార్యను బాగా చూసుకోవడం చాలా ముఖ్యం. భార్యను ఒక దేవిలా, తన గృహశక్తిలా చూడడం భర్త బాధ్యత. భార్యతో అతని అనుబంధం ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడే ఆ గృహం స్వర్గసీమ అవుతుంది.– డా. పి. రాకేష్(పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవిప్రవచనాల ఆధారంగా)
ఫొటోలు
National View all

నేను రాలేను.. డీకేను రిక్వెస్ట్ చేశా: సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: డీలిమిటేషన్ అంశంపై చర్చించేందుకు రావాలంటూ పల

మరో షాక్.. ఆప్ నేతలపై కేసు నమోదుకు రాష్ట్రపతి అనుమతి?
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది.

రంగులు వేయకండని బ్రతిమాలాడు.. అయినా చంపేశారు..!
జైపూర్: రాజస్తాన్ లో దారుణం చోటు చేసుకుంది.

అసెంబ్లీలో స్టార్ హీరోయిన్‌పై నోరు పారేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
జైపూర్ : అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నోరు పారేసుకున్నార

బీజాపూర్: 17 మంది మావోయిస్టులు లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో 17 మంది మావోయిస్టులు పోలీసులు
International View all

కెనడా పౌరులపై ట్రంప్ ఆంక్షలు.. ఉల్లంఘిస్తే భారీ ఫైన్, జైలు జీవితం ఖాయం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై ఆ

దానివల్ల ఏమీ ఉపయోగం లేదు: అమెరికాకు తేల్చి చెప్పిన రష్యా
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ ల మధ్య అమెరికా జరుపుతున్న శాంతి చర్చలు ఇప్పట్లో సఫలీకృత

ఎవరూ సురక్షితంగా లేరు.. జీ7 దేశాలకు కెనడా హెచ్చరిక..
వాణిజ్య యుద్ధ భయాలు జి-7 దేశాలను వెంటాడుతున్నాయి.

Holi 2025: ఈ దేశాల్లోనూ అంబరాన్నంటే హోలీ వేడుకలు
రంగుల పండుగ హోలీని దేశవ్యాప్తంగా మార్చి 14న జరుపుకోనున్నారు.

Brazil: పర్యావరణ సదస్సు కోసం చెట్ల నరికివేత!!
బ్రెజిల్లో ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే ప్రపంచ వాతావరణ సదస్సు(2025 United Nat
NRI View all

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!
ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

సుదీక్ష మిస్సింగ్.. కిడ్నాపైందా?
న్యూఢిల్లీ: కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్లో తెలుగు వి

టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస
క్రైమ్

నా బర్త్‌డే కదా.. అమ్మానాన్నలేరీ?
రోజూ ఒడిలో కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపించే అమ్మ ఎక్కడికెళ్లిందోనని ఆ చిన్నారి ఇంట్లోకి, బయటికి తిరుగుతోంది.. బయటకు వెళ్లిన నాన్న ఏదో ఒకటి తీసుకొచ్చి తినిపిస్తాడని ఆశగా అందరినీ అడుగుతోంది.. ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుంటారు కానీ, ఇప్పుడు అమ్మానాన్న ఇద్దరూ కనిపించకపోయే సరికి ఆ పసికందు బేలచూపులు చూస్తోంది.. అయ్యే పాపం అన్నా అర్థం కాదు.. అందరూ ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకోలేదు.. నా పుట్టిన రోజు అన్నారు కానీ, ఇంట్లో సందడే లేదన్నట్లుగా అందరి ముఖాల్లోకి చూస్తోంది.. అవ్వాతాతలు కొత్త డ్రెస్సు చూపిస్తూ నెత్తీనోరు కొట్టుకుంటుంటే వాళ్ల చుట్టూనే తిరుగుతూ వచీ్చరాని మాటలు చెబుతోంది.. వచ్చిపోయే వారు ఎత్తుకుని లాలిస్తున్నారే కానీ, అమ్మానాన్నలను తీసుకురాలేకపోతున్నారు.. .. ఆదోని మండలం కుప్పగల్‌కు చెందిన పూజారి ఈరన్న, ఆదిలక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కుమార్తె సుస్మిత పుట్టిన రోజు నేడు. దంపతులు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ చిన్నారి తల్లిదండ్రుల ప్రేమను బస్సు కబళించింది.కంటికి రెప్పలా చూసుకునే అమ్మానాన్నలు.. జీవితాంతం రక్షణగా నిలిచే సోదరుడు.. నాన్నకు ఆసుపత్రిలో చూపించుకునేందుకని వెళ్లారు.. త్వరగా వస్తామని చెప్పారు, ఎంతకీ ఇంటికి రాలేదు.. ఒక్క ఫోన్ లేదు, ఎక్కడున్నారో తెలియదు.. ముగ్గురు ఆడ పిల్లలు, ఇంటి వద్ద ఎదురుచూస్తున్నారు.. ఇంకా ఎప్పుడు వస్తారో, తమ కోసం ఏమి తెస్తారోనని! ఇంతలో వచ్చిన ఓ ఫోన్ కాల్‌తో గుండె ఆగినంత పనైంది.. ఆసుపత్రికి వెళ్లిన అమ్మానాన్న ఇక తిరిగిరారని, ఆటపట్టించే అన్న, తోడూనీడగా నిలిచే తోబుట్టువు మరి లేడని.. తెలిసిన క్షణాన ఆ ఇల్లు కన్నీటి సంద్రమైంది.. ముగ్గురినీ పోగొట్టుకున్న ఆ ఇంట్లో నలుగురు ఆడపిల్లలు సంతానం.. ఒకరికి పెళ్లి కాగా, మరో ముగ్గురు దిక్కులేని వాళ్లయ్యారు... కర్ణాటక రాష్ట్రం మాన్విక చెందిన హేమాద్రి, నాగరత్నమ్మ దంపతులు తమ కుమారుడు దేవ రాజ్‌తో కలిసి ఆసుపత్రికి వెళ్తూ మృత్యుఒడి చేరారు.ఐదుగురిని బలిగొన్న బస్సు – ఆదోని టౌన్ కర్ణాటక రాష్ట్రం గంగావతి డిపోకు చెందిన బస్సు మంత్రాలయానికి మంగళవారం 14 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఆదోని మండలం పాండవగల్ సమీపంలో కల్వర్టు వద్ద వేగాన్ని నియంత్రించుకోలేక రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. బస్సు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లి నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు కుటుంబాల్లో చీకటి కమ్ముకుంది.

Ameerpet: అరిష్టాలు తొలగిపోతాయని ఆలయంలో చోరీ
హైదరాబాద్: అరిష్టాలు తొలగిపోతాయని గుడిలో పంచలోహ విగ్రహాలు దొంగిలించిన ఇద్దరు మహిళలను ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దొంగతనం చేసిన 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ వెంకటరమణ, ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఎస్ఆర్నగర్ సమీపంలోని గురుమూర్తినగర్‌లో శ్రీ వినాయక ఆలయం గర్భగుడిలో శివపార్వతుల పంచలోహ విగ్రహాలు కనిపించడం లేదంటూ ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. శనివారం భక్తుల రూపంలో వచ్చిన మహిళలు తమ మాయమాటలతో అర్చకుడిని బోల్తా కొట్టించి విగ్రహాలు ఎత్తుకుళ్లినట్లు గుర్తించారు. బంజారాహిల్స్ ఎన్బీటీనగర్కు చెందిన స్వర్ణలత, పావని అనే మహిళలు ఆలయానికి వచ్చిన..అర్చకుడు నవీన్‌కుమార్ తీర్థ ప్రసాదాలు పంచి పెడుతుండగా అదును చూసి విగ్రహాలను ఓ సంచిలో వేసుకుని పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత అర్చకుడిని విగ్రహాలు కనిపించక పోవడంతో అధికారులకు సమాచారం అందించారు. గడిచిన రెండేళ్ల కాలంలో స్వర్ణలతో ఇంట్లో వరుసగా నలుగురు మరణించారు. తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులు చనిపోవడంతో అరిష్టం వల్లే మృతి చెందారని భావించింది. నిత్యం పూజలందుకునే మహిమాని్వతులైన దేవుళ్ల విగ్రహాలను ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందని, సకల శుభాలు జరుగుతాయని నమ్మింది. పావనికి విషయాన్ని చెప్పి పథకం ప్రకారం ఇద్దరు విగ్రహాలను దొంగిలించినట్లు విచారణలో అంగీకరించారు. వారిద్దరికి ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు తెలిపారు. విగ్రహాలను స్వా«దీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

సారీ మమ్మీ.. జీవితంలో ఇంకో స్టెప్ తీసుకోలేను..
మంచిర్యాల: ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల మేరకు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే 6 హట్స్ ఏరియాకు చెందిన మేరుగు సౌమ్య (22)కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. యువతి తండ్రి కొంతకాలం క్రితం మృతి చెందగా తల్లి కీర్తనతో కలిసి ఉంటుంది. సోమవారం సాయంత్రం కీర్తన సంతకు వెళ్లిన సమయంలో సూసైడ్ నోట్ రాసి ఇంటి పైకప్పుకు ఉరేసుకుంది. తనకు పెళ్లంటే ఇష్టం లేదని, జీవితంలో ఇంకో స్టెప్ తీసుకోలేనని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, సారీ మమ్మీ.. సారీ డాడి అని లేఖలో రాసి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి కీర్తన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపార

అమ్మా.. నీ తప్పుకు నన్ను చంపేశావా?
‘అమ్మా.. ఇంకో మూడు నెలలైతే లోకం చూసేవాడిని కదమ్మా.. ఎందుకమ్మ ఇంత పనిచేశావు. నీ కడుపులో నన్ము మోయలేకపోయావా.. ఆరు నెలలుగా నీ కడుపులో హాయిగా పెరుగుతున్నా.. నీవు మింగిన మాత్రలకు నాకు ఊపిరి ఆడడం లేదమ్మా.. లోకం చూపించి అనాథాశ్రమంలో పడేసినా బాగుండేది.. తెల్లవారేసరికే నా ఊపిరి తీశావేంటమ్మా.. నీవు చేసిన తప్పుకు నన్ను బలి ఇచ్చావా..’ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గురుజ వాగులో పడేసిన పిండానికి మాటలు వస్తే ఇలాగే ప్రశ్నించేదేమో. క్షణికావేశంలో చేసిన తప్పుకు గర్భం దాల్చిన ఓ యువతి.. బయటి ప్రపంచానికి ఆ విషయం తెలియకుండా ఉండేందుకు ఆరు నెలల గర్భంలోనే పిండాన్ని చంపేశారు. ఈ హృదయ విదారక సంఘటన గురుజ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... మంగళవారం ఉదయం గ్రామ శివారులోని వాగు ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లిన కొందరు గ్రామస్తులకు మృత శిశువు కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై మహేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని శిశువు మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. స్థానికులు అందించిన వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువతి, ఇద్దరు యువకులతోపాటు ఆర్ఎంపీని అదుపులోని తీసుకున్నట్లు తెలిసింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఓ యువతి.. ఆరు నెలల గర్భాన్ని తీయించుకునేందుకు ఆర్ఎంపీని ఆశ్రయించినట్లు సమాచారం. మంగళవారం రాత్రి గ్రామంలో తిరిగిన సదరు ఆర్ఎంపీ ప్రాణాపాయమని తెలిసినా.. ఆరు నెలల గర్భాన్ని తొలగించారు. ఆ పిండాన్ని ఇలా వాగులో పడేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు పూర్తి కానందున పూర్తి వివరాలు బుధవారం అందిస్తామని సీఐ భీమేష్ తెలిపారు. మృత శిశువును పరీక్షించిన వైద్యులు మగ శిశువుగా నిర్ధారించారు. పిండం వయస్సు సుమారు 6 నెలలు దాటి ఉండవచ్చని సమాచారం.