
తొలిసారి క్లాస్ తీసుకుంటున్న చంద్రబాబు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులకు నేటి నుంచి రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు జరగనున్నాయి. చట్టసభల్లో ఎలా నడుచుకోవాలి...సభా సంప్రదాయాలు సభ్యుడు ఎలా పాటించాలనే అంశాలపై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గ్రాండ్ కాకతీయ హోటల్లో ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. శాసన సభ స్పీకర్- కోడెల శివప్రసాదరావు స్వాగత ఉపన్యాసంతో తరగతులు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రం ఆర్థిక మంత్రి అరుణ్ -జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)