సాక్షి, కాకినాడ: తనను నమ్మి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కాకినాడ ప్రజలకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం నగరంలోని డెయిరీఫామ్ సెంటర్‌లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. మూడున్నరేళ్ల చంద్రబాబు పాలన అవినీతి, అక్రమాలమయమని ధ్వజమెత్తారు. కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. చంద్రబాబు మూడున్నరేళ్ల పాలన చూసి ఓటు వేయాలని సూచించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, చంద్రబాబు మోసాలకు గుణపాఠం చెప్పాలన్నారు.
నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికలకు నాంది అవుతాయని జగన్ అన్నారు. కాకినాడ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనకు వదిలేయాలని, వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రజలందరికీ తాను తోడుగా ఉంటానని భరోసాయిచ్చారు. తాము అధికారంలోకి రాగానే 'నవరత్నాల' హమీలతో పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడతామని హామీయిచ్చారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
- ఈ ప్రభుత్వం మనకు వద్దు అనేలా చంద్రబాబు పాలన సాగుతోంది
- కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలవాలి
- ఏడాది తర్వాత మన ప్రభుత్వమే వస్తుంది కాబట్టి నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం
- మూడున్నరేళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశారు, ఎన్నికల ముందు ఏం మాటలు చెప్పారు?
- ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేయడం ధర్మమేనా?
- ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఆ మనిషిని నిలదీయకూడదట
- నంద్యాల ఉప ఎన్నిక ముగిసిన తర్వాత టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు
- నంద్యాలలో నడిరోడ్డు మీద టీడీపీ వాళ్లు తుపాకీతో కాల్పులు జరిపారు
- కాల్చినవాళ్ల మీదగానీ, కత్తులతో వీరంగం సృష్టించిన వాళ్లపై గానీ కేసులు పెట్టలేదు
- ఇలాంటి పాలనకు మనకు కావాలా అని అడుగుతున్నా
-
కాపులు రిజర్వేషన్ల కోసం కంచాలు మోగిస్తే కేసులు పెట్టారు
- ఓటుకు కోట్లు కేసులో ఆడియో టేపులతో అడ్డంగా దొరికిపోయినా చంద్రబాబుపై కేసులు ఉండవు
- తాను హీరోగా చూపించుకునేందుకు పుష్కరాల్లో 29 మందిని చంపేసినా కేసులు ఉండవు
- విశాఖ జిల్లాలో వేల కోట్ల రూపాయల విలువైన భూములు మాయమైపోతున్నాయి
- ఎన్నికలప్పుడు మాటలు చెప్పి మోసం చేసిన పాలన ఇది
- అధికారంలోకి వచ్చాక అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న పాలన ఇది
- ప్రజలు ఇలాంటి పాలన వద్దే వద్దు అంటున్నారు
- చంద్రబాబు ఎన్నిలకప్పుడు ఏం చెప్పారు, ఎన్నిలయ్యాక ఏంచేశారు అనేది నంద్యాలలోనే చెప్పా
- సీఎం కావడం కోసం చంద్రబాబు ఎన్నో అబద్ధపు హామీలిచ్చారు
- ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి ఇస్తానన్నారు
- అర్హులకు ఒక్క పెన్షన్ అయినా ఇచ్చారా?
- బాబు అధికారంలోకి వచ్చాక ఎంతమందికి జాబులొచ్చాయి?
- ప్రతి కుటుంబానికి చంద్రబాబు రూ. 78 వేల నిరుద్యోగ భృతి బాకీ పడ్డారు
- బాబు హైటెక్ పాలన వల్ల షాపుకు వెళ్లకుండానే ఇంటికే మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు
- చంద్రబాబు పాలనతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది
-
రూ.14 వేల కోట్ల డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానన్నారా, లేదా?
- ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు
- బేషరతుగా వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని మాట తప్పారు
- ఏ పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి
- 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు.. ఏమైంది?
- ఎన్నికలకు ముందు రూ.200 ఉన్న కరెంట్ బిల్లు ఇప్పుడు రూ.500 అయింది
- ఇంటిపన్ను రూ.500 నుంచి రూ. 1000కి పెరిగింది
- కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ ఏమైంది?
- ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ,108 పథకాలను నీరుగార్చారు
-
మీకు తోడుగా నేను నిలబడతాను, ఫీజు రీయింబర్స్‌మెంట్ నేను ఇస్తాను
- దోమలపై దండయాత్ర అని ప్రకటించి కాకినాడలో కనీసం డంపింగ్ యార్డు ఏర్పాటు చేయలేదు
- డంపింగ్, డ్రైనేజీ లేకుంటే దోమలు రావా?
- కాకినాడలో బైపాస్ రోడ్డు నిర్మిస్తామన్నారు.. ఏమైంది?
- వర్షం పడితో ఎన్ని ప్రాంతాలు మునుగుతాయో చంద్రబాబుకు తెలుసా?
- వస్తే కాకినాడలో 17 ప్రాంతాలు మునుగుతాయి
- అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు మొదలు పెట్టారా?
-
చాలా కాలనీలకు మంచినీరు కూడా రావడం లేదు
- సిటీ ఎమ్మెల్యే కొండ బాబు కబ్జాల బాబుగా మారారు
- శ్మశానాలు కూడా వదలకుండా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు కబ్జాలు చేస్తున్నారు
- తూర్పుగోదావరి జిల్లాకు చేస్తానన్న ఏ ఒక్క వాగ్దానాన్ని చంద్రబాబు అమలు చేయలేదు
- చంద్రబాబు లంచాలు తీసుకుంటే పేదవాళ్లు డబ్బులు కట్టాలట
- జీవితంలో అబద్ధాలు చెప్పని వ్యక్తి సత్యహరిశ్చంద్రుడు అయితే ఒక్క నిజం చెప్పని వ్యక్తి చంద్రబాబు
- రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట మీద నిలబడాలి
- హామీలు అమలు చేయకుంటే నిలదీస్తారనే భయం నేతలకు రావాలి
- అందుకు కాకినాడ నాంది కావాలి, అప్పుడే వ్యవస్థ బాగు పడుతుంది
- కాకినాడ, నంద్యాల అభివృద్ధిని నాకు వదిలేయండి
-
ఈ రెండింటినీ అన్నిరకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది
- అధికారంలోకి వస్తే మత్స్యకారులకు సెలవు దినాల్లో రూ.5 వేలు ఇస్తాం
- ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యం ఇస్తాం
- మత్స్యకారుల పిల్లలను బడికి పంపాలి
- ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు పిల్లలకు ఒక్కొక్కరికీ రూ.500 ఇస్తాం
- 6 నుంచి 10వ తరగతి పిల్లలకు ఒక్కొక్కరికీ 750 ఇస్తాం
- ఇంటర్ విద్యార్థులకు ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు ఇస్తాం
-
ప్రతి కుటుంబంలో ఇద్దరికి డబ్బులు చెల్లించే బాధ్యత నాదే