విజయవాడ: తనపై రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోనియాగాంధీని విబేధించగానే కాంగ్రెస్‌లో చంద్రబాబు కుమ్మక్కై తనపై కేసులు వేశారన‍్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే చంద్రబాబు మద్దతు ఇచ్చి కాపాడారని గుర్తు చేశారు.
తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అక్రమ కేసులు బనాయించడమే కాకుండా, మూడు నెలలకు బెయిల్ వచ్చే కేసును 16 నెలలు బెయిల్ రాకుండా చేశారని ఆయన అన్నారు. కావాలని ఎవరూ జైలుకు వెళ్లరని, తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన వైఖరి తెలియ చేస్తున్నాయని వైఎస్ జగన్ తెలిపారు.