మైక్రోసాఫ్ట్ భారీగా ఉద్యోగాల కోతకు ప్లాన్
మైక్రోసాఫ్ట్ భారీగా ఉద్యోగాల కోతకు ప్లాన్
Published Mon, Jul 3 2017 7:59 PM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM
ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉద్యోగాల కోత ప్లాన్ చేస్తోంది. సేల్స్‌ఫోర్స్‌ను పునర్వ్యస్థీకరణ చేసే ప్రక్రియలో భాగంగా వేల మంది ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ గుడ్ బై చెప్పబోతున్నట్టు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో ఈ కోత ప్రభావం పడనుందని టెక్ క్రంచ్ రిపోర్టు చేసింది. వచ్చే వారాల్లోనే కంపెనీ దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్టు తెలిపింది. ఈ పునర్వ్యవస్థీకరణ మైక్రోసాఫ్ట్ సంస్థ కస్టమర్ యూనిట్, దాని ఎస్‌ఎంఈ కేంద్రీకృత విభాగాలు విలీనమవుతున్న సందర్భంగా ఉండబోతుందని టెక్ క్రంచ్ రిపోర్టు చేసింది.
ఈ మార్పులు గురించి కంపెనీ వచ్చే వారాల్లోనే ప్రకటించనుంది. అయితే ఈ లేఆఫ్స్ ప్రక్రియపై వెంటనే స్పందించడానికి మైక్రోసాఫ్ట్ నిరాకరించింది. 2016లో 7,400 ఉద్యోగాలకు కోత పెట్టబోతున్నట్టు 2015 జూన్‌లోనే మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ముఖ్యంగా అవి కంపెనీ ఫోన్ హార్డ్‌వేర్ బిజినెస్‌లో ఉండబోతున్నాయయని తెలిపింది. 2016లో కొన్ని పొజిషన్లను తొలగించిన మైక్రోసాఫ్ట్, 2017 ఆర్థిక సంవత్సరం వరకు ఈ తొలగింపు ప్రక్రియను పూర్తిచేయనున్నట్టు 2016 జూన్28న ఫైల్ చేసిన రిపోర్టులో పేర్కొంది.
Advertisement
Advertisement