హోండా ‘క్లిక్‌’ లాంచ్‌..సరసమైన ధరలో | Most affordable Honda scooter 'Cliq' launched at Rs 42,499 | Sakshi
Sakshi News home page

హోండా ‘క్లిక్‌’ లాంచ్‌..సరసమైన ధరలో

Published Wed, Jun 21 2017 11:56 AM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

హోండా ‘క్లిక్‌’ లాంచ్‌..సరసమైన ధరలో

హోండా ‘క్లిక్‌’ లాంచ్‌..సరసమైన ధరలో

న్యూఢిల్లీ:   దేశీయ  అతిపెద్ద స్కూటర్ తయారీదారు హోండా మరో గేర్‌ లెస్‌ స్కూటర్‌ను  అతి తక్కువ ధరలో మార్కెట్లోకి విడుదల చేసింది. రెండో అతిపెద్ద టూవీర్ల తయారీ కంపెనీ హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా’(హెచ్‌ఎంఎస్‌ఐ) తాజాగా 110 సీసీ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది .  2016 ఆటో ఎక్స్‌ పో లో ప్రదర్శించిన ఈ స్కూటర్‌ ను ‘హోండా క్లిక్‌’  పేరుతో  మంగళవారం  విడుదల  చేసింది. ధరను రూ.42,499 (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ)గా  హోండా నిర్ణయించింది.

ముఖ్యంగా  గ్రామీణ ప్రాంత అవసరాలకు అనుగుణంగా అధిక మైలేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ స్కూటర్‌ను రూపొందించామని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌ మార్కెటింగ్‌) యద్విందర్‌ సింగ్‌ గులెరియా తెలిపారు. ఇందులో ఆటోమేటిక్‌ స్కూటర్లకు డిమాండ్‌ పెరుగుతోందని తెలిపారు.  గ్రామీణ మార్కెటే ప్రధాన లక్ష్యంగా ఈ స్కూటర్‌ను ఆవిష్కరించామని హెచ్‌ఎంఎస్‌ఐ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మినోరు కటో తెలిపారు. దేశంలో ప్రస్తుతం విక్రయమౌతోన్న ప్రతి పది టూవీలర్లలో ఆరు వరకు 100-110 సీసీ విభాగానికి చెందినవని పేర్కొన్నారు.  రాజస్థాన్లోని టాపకరా ప్లాంట్‌లో రూపొందించిన అదే రాష్ట్రంలో మొదటి అమ్మకాలను ప్రారంభించనుంది. తరువాత దేశవ్యాప్తంగా దశల వారీగా  అందుబాటులోకి తీసుకురానుంది.
 
ఇక ఫీచర్ల విషయానికి వస్తే స్పేసియస్‌ ఫుట్‌బోర్డ్‌, లార్జ్‌ అండర్‌ సీట్‌ స్టోరేజ్‌ స్పేస్‌, హోండా ఎకో టెక్నాలజీతో కూడిన 110 సీసీ సింగిల్‌ సిలిండర్‌ బీఎస్‌-4 ఇంజిన్‌, సీబీఎస్‌ (కాంబీ బ్రేక్ సిస్టం) వంటి పలు ప్రత్యేకతలుగాఉన్నాయి. అలాగే మొబైల్ ఛార్జింగ్ సాకెట్, ట్యూబ్లెస్ టైర్లు ,  ఆటోమేటిక్ హెడ్‌ ల్యాంప్ ఆన్   ఫీచర్లు ప్రామాణికంగా ఉన్నాయి.   నాలుగు డిఫరెంట్‌ కలర్స్‌ లో ఇది లభ్యంకానుంది.  

కాగా హోండా యాక్టివా 4జీ  రూ. 51,172 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో  పోలిస్తే ఇది రూ .8,700 తక్కువ. మరోవైపు టీవీఎస్‌ స్కూటీ (రూ 40వేలు) గట్టి పోటీ ఇవ్వనుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement