వన్‌ప్లస్‌ 6 ఫీచర్లు లీక్‌: మే 21నుంచి ప్రీ సేల్‌ | OnePlus 6 release date, specs and price: OnePlus confirms pre-sale will begin on 21 May | Sakshi
Sakshi News home page

వన్‌ప్లస్‌ 6 ఫీచర్లు లీక్‌: మే 21నుంచి ప్రీ సేల్‌

Published Thu, May 3 2018 4:39 PM | Last Updated on Thu, May 3 2018 4:41 PM

OnePlus 6 release date, specs and price: OnePlus confirms pre-sale will begin on 21 May - Sakshi

వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌

సాక్షి, న్యూఢిల్లీ:  చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్  తాజా ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 6కి సంబంధించిన ఫీచర్లు మరోసారి ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్నాయి.  తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన స్మార్ట్ బై ఆఫర్స్ వెబ్ పేజీలో వన్‌ప్లస్ 6 స్పెసిఫికేషన్లు దర్శనమిచ్చాయి.  దీని ప్రకారం వన్ ప్లస్ 6 లో కింది ఫీచర్లు ఉండనున్నాయి.

5.7 ఇంచ్ డిస్‌ప్లే
1800 x 3200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,
23ఎంపీ రియర్‌ కెమెరా
16 ఎంపీ  డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
3500 ఎంఏహెచ్ బ్యాటరీ

వన్‌ప్లస్ 6 ను ఈ నెల16న లండన్‌లోనూ  17వ తేదీన చైనాతోపాటు ఒకేసారి భారత్‌లోనూ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రి బుకింగ్స్‌ మే 21 నుంచి ప్రారంభం కానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement