బీజేపీకి ఓటేశానంటూ.. దొరికిపోయిన బాబు
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. కుటుంబ సభ్యులతో కలసి ఓటేసిన చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి ఓటేశానని చెప్పారు. ఎన్నికల నియమావళి ప్రకారం బహిరంగం ఫలానా గుర్తుకు ఓటేశానని చెప్పరాదు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
కాగా పొత్తులో భాగంగా ఖైరతాబాద్ అసెంబ్లీ, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాలు రెండూ బీజేపీకి కేటాయించారు. దీంతో చంద్రబాబు సొంత పార్టీ గుర్తు సైకిల్కు ఓటు వేయలేకపోయారు. చంద్రబాబు నివాసం ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉంది.