ఆ ఛానల్లో చేస్తున్నారా.. జాగ్రత్త!
నిన్న మొన్నటి వరకు 'ముఖ్య'నేతగా వ్యవహరించి, కొత్త దుకాణం పెట్టుకున్న ఓ నాయకుడికి అభ్యర్థులు దొరక్కపోవడంతో సరికొత్త ఆలోచనలు వస్తున్నాయి. తన సంస్థలో పనిచేసే కొంతమంది ఉద్యోగులను పిలిచి, వాళ్లకు 'పార్టీఫండ్' కూడా కొంత ఇచ్చి.. వాళ్ల వాళ్ల సొంత జిల్లాల్లో ఎక్కడో ఒక చోట టికెట్ ఇచ్చేస్తున్నారట. తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇలాగే జరిగింది. ఆ నాయకుడి సొంత జిల్లాలో సదరు ఛానల్లో పనిచేస్తున్న ఓ పాత్రికేయుడిని పిలిచి మరీ టికెట్ ఇచ్చేశారట.
పెద్దాయన ఆదేశించారు కాబట్టి.. ఎటూ తప్పదని అతగాడు సరేననాల్సి వచ్చిందని సమాచారం. అతడికి తెలిసినవాళ్లు మూడో వ్యక్తి దగ్గర 'మనోడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడట.. ఏంది మందల' అని అడిగితే, ఆ ఛానల్లో పనిచేసేవాళ్లకు అది పనిష్మెంటు అని వ్యాఖ్యానించారట. ఈ విషయం తెలిసి, సీమాంధ్ర జిల్లాల్లో సదరు పార్టీ అభ్యర్థులు లేని జిల్లాల్లో సదరు ఛానల్లో పనిచేసే సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతున్నారట.