
'150 అసెంబ్లీ, 25 లోక్‌సభ సీట్లు మావే'
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకోవటం ఎవరి తరం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.
నెల్లూరు : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకోవటం ఎవరి తరం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. కేంద్రంలో కూడా జగన్ మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించబోతున్నారని ఆయన బుధవారమిక్కడ అన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మేకపాటి విలేకర్లతో మాట్లాడారు. సీమాంధ్రలో 150 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలు తమవేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ కుట్రలను ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తిప్పి కొడతారని మేకపాటి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్లీ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు అమలు అవుతాయని ఆయన తెలిపారు.