ఇది సూసైడ్ కాదు | Actor Varun Sandesh's wife Vithika clarifies suicide rumours | Sakshi
Sakshi News home page

ఇది సూసైడ్ కాదు

Published Wed, Jul 12 2017 11:07 PM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

ఇది సూసైడ్ కాదు

ఇది సూసైడ్ కాదు

‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమాలో నటిస్తున్నప్పుడు వరుణ్‌ సందేశ్‌–వితికా శేరు ప్రేమలో పడ్డారు. గతేడాది పెళ్లి చేసుకున్నారు.వచ్చే నెల 19తో వీళ్ల పెళ్లై ఏడాది అవుతుంది. ఈలోపు ‘వైవాహిక జీవితం బాగా లేకపోవడంతో వితిక సూసైడ్‌ అటెంప్ట్ట్‌’ అనే వార్త. అసలేం జరిగింది? బుధవారం సాయంత్రం దుబాయ్‌కి ప్రయాణమవుతున్న వితిక, అమెరికాలో ఉన్న వరుణ్‌తో ‘సాక్షి’ స్పెషల్‌ టాక్‌.

హాయ్‌ వితికా.. ఎలా ఉన్నారు?
సూపర్‌ అండీ. ఇక్కడ అంతా క్షేమం (నవ్వేస్తూ).

సూసైడ్‌ అటెంప్ట్‌ చేశారని సెన్సేషన్‌ క్రియేట్‌ చేశారు...
నిద్రపట్టకపోతే స్లీపింగ్‌ టాబ్లెట్స్‌ తీసుకున్నా. ఆ టాబ్లెట్స్‌ వల్ల ఓ పదీ పన్నెండు గంటలు నిద్రపడుతుంది. అంతసేపు నిద్రపోతానని తెలియక మా అమ్మగారు కంగారు పడిపోయారు. ఆ కంగారు ఇంత సెన్సేషన్‌ అవుతుందనుకోలేదు.

అంతకుముందు టాబ్లెట్స్‌ వాడేవారా... పైగా ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లున్నారు..
స్లీపింగ్‌ టాబ్లెట్స్‌ తీసుకోవడం ఇదే ఫస్ట్‌ టైమ్‌. నేను, వరుణ్‌ అమెరికాలో ఉంటున్నాం. మా చెల్లెలు (పిన్ని కూతురు) ఓణీల ఫంక్షన్‌ ఉంటే, హైదరాబాద్‌ వచ్చాను. మా ఇంటి (వరుణ్‌–వితిక ఉంటున్న ఇల్లు)కీ, మా అమ్మగారింటికీ పెద్ద దూరం లేదు. జస్ట్‌ పది నిమిషాల్లో వెళ్లొచ్చు. అందుకే ఒంటరిగా ఉన్నాను. మన టైమింగ్స్, అమెరికా టైమింగ్స్‌ డిఫరెంట్‌ అని తెలిసిందే. ఇక్కడి టైమ్‌కి తగ్గట్టు అడ్జస్ట్‌ కావడానికి ఐదారు రోజులైనా పడుతుంది. నాకు నిద్ర పట్టకపోవడానికి కారణం అదే. గురువారం దుబాయ్‌లో షూట్‌ ఉంది. నిద్ర సరిగ్గా లేకపోతే ఫేస్‌ బాగుండదు. దాంతో పాటు మెంటల్లీ కొంచెం స్ట్రెస్‌ అయ్యాను. అందుకని మా ఫ్యామిలీ డాక్టర్‌కి ఫోన్‌ చేస్తే, ఆమె టాబ్లెట్‌ సజెస్ట్‌ చేసింది. మెడికల్‌ షాప్‌ నుంచి తెప్పించుకుని, వేసుకున్నాను. అది కూడా 0.5 మిల్లీగ్రామ్‌ టాబ్లెట్‌. అది పెద్ద డోస్‌ కూడా కాదు. కాకపోతే నేను నాలుగు వేసుకున్నాను. అందుకే ఎక్కువసేపు నిద్రపోయాను.

హాస్పిటల్‌కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?
నిద్రమాత్రలు వేసుకుని పడుకుంటున్నానని అటు వరుణ్‌కీ, ఇటు మా అమ్మగారికీ ఫోన్‌ చేసి, చెప్పాను. ఆదివారం రాత్రి పదకొండు పన్నెండు గంటలకు మాత్రలు వేసుకున్నాను. మా అమ్మగారు సోమవారం ఉదయం ఏడు గంటలకు ఫోన్‌ చేసింది. నేను మాంచి నిద్రలో ఉండటంతో తీయలేదు. దాంతో టెన్షన్‌ పడి, మా ఇంటికి వచ్చింది. ఎంత లేపినా నేను లేవకపోవడంతో బేగంపేటలో ఉన్న నా కజిన్‌కి ఫోన్‌ చేసింది. నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఎన్ని టాబ్లెట్స్‌ వేసుకున్నానో డాక్టర్స్‌కి కూడా తెలియదు కాబట్టి, ‘స్ట్టమక్‌ వాష్‌’ చేస్తామన్నారు. అమ్మ సరేనంది. జరిగింది ఇదే. ఆ రోజంతా హాస్పిటల్‌లో ఉండి, మంగళవారం డిశ్చార్జ్‌ అయ్యి, ఇంటికొచ్చాను.

మీరు హాస్పిటల్‌లో ఉన్న ఫొటో ఎలా బయటికొచ్చింది?
హాస్పిటల్‌కి వచ్చిన నా ఫ్రెండ్స్‌తో ‘వితిక హైపర్‌ గర్ల్‌ కదా.. ఎలా రిలాక్డ్స్‌గా పడుకుని ఉందో చూడండి’ అంటూ నా ఫొటో తీసి, మా ‘వాట్సాప్‌ గ్రూప్‌’లో పెట్టమన్నాను. మా యూఎస్‌ ఫ్రెండ్స్‌ అందరం కలిసి క్రియేట్‌ చేసుకున్న గ్రూప్‌ అది. మా గ్రూప్‌లో నా ఫొటో వచ్చే ముందే బయటికి వచ్చేసింది. వేరేవాళ్లేమైనా తీసి, పెట్టారేమో. ఆ ఫొటో చూసి, ‘ఇంకేముంది? మ్యారీడ్‌ లైఫ్‌ బాగాలేదట. అందుకే సూసైడ్‌ అటెంప్ట్‌ చేసింది’ అని వార్తలు మొదలయ్యాయి. మా లైఫ్‌ బాగుందని చెప్పడానికి చానల్స్‌ చుట్టూ తిరిగి, ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వచ్చింది.

వన్‌ ఇయర్‌ కూడా దాటని మీ మ్యారీడ్‌ లైఫ్‌ ముచ్చట్లు?
యాక్చువల్‌గా మాది మూడేళ్ల అనుబంధం. పెళ్లికి ముందు రెండేళ్లు ప్రేమించుకున్నాం. ఒకర్నొకరు అర్థం చేసుకున్నాకే, పెళ్లి చేసుకున్నాం. మా మధ్య ఎలాంటి ఇష్యూస్‌ లేవు. నరేశ్‌ అన్న (‘అల్లరి’ నరేశ్‌), ఇంకా ఇండస్ట్రీలో క్లోజ్‌ ఫ్రెండ్స్‌ చాలామంది ఉన్నారు. మా మ్యారీడ్‌ లైఫ్‌ ఎంత బాగుందో వాళ్లందరికీ తెలుసు.

ఇంతకు ముందు ‘మెంటల్‌ స్ట్రెస్‌’ అన్నారు.  అంత స్ట్రెస్‌ ఎందుకు?
అమెరికా నుంచి వచ్చాక చెల్లెలి ఫంక్షన్‌ కోసం షాపింగ్‌ చేశాం. అలాగే, యూఎస్‌ నుంచి ఓ ఫ్రెండ్‌ వస్తే, తనకు ‘వెల్‌కమ్‌ బ్యాక్‌ పార్టీ’ ఎరేంజ్‌ చేశాం. ఫంక్షన్, పార్టీ ఎరేంజ్‌మెంట్స్‌తో స్ట్రెస్‌ అయ్యాను. ఓన్లీ మెంటల్‌ స్ట్రెస్‌ కాదు.. ఫిజికల్‌ స్ట్రెస్‌ కూడా. దాంతో పాటు నిద్ర పట్టకపోవడంతో అలసిపోయాను.

ఎలాగూ సినిమాలు చేయడం లేదు... లైమ్‌లైట్‌ కోసమే ఈ హంగామా అంతా అని కొందరి ఊహ...
అవునండీ. ఇలా అనుకుంటున్నారని నాతో కొంతమంది అన్నారు. లైమ్‌లైట్‌ కోసం ఎవరైనా లైఫ్‌ని రిస్కుల్లో పెడతారా? లైమ్‌లైట్‌నే కోరుకుంటే నేను పెళ్లెందుకు చేసుకుంటాను? నాకిప్పుడు 23 ఏళ్లు. అర్జెంటుగా పెళ్లి చేసేసుకుని సెటిలవ్వాల్సిన వయసు కూడా కాదు. వరుణ్‌ నాకు బెస్ట్‌ ‘సోల్‌మేట్‌’ అనిపించింది. అందుకని కెరీర్‌ ఏమవుతుందో అని ఆలోచించలేదు. పెళ్లి చేసుకున్నాను.
     
పెళ్లి తర్వాత సినిమాలు చేసినట్లనిపించలేదు.. కెరీర్‌ని సాక్రిఫైస్‌ చేశారా?

లేదండీ. పెళ్లయిన హీరోయిన్లకు అవకాశాలివ్వడానికి పెద్దగా ఇష్టపడరు. నేను ఇంట్లో కూర్చుని వరుణ్‌కి వండి పెడుతూ ఉండిపోవాలనుకోవడంలేదు. అందుకే యాడ్‌ ఫిల్మ్స్‌ చేస్తున్నాను.
     
అంటే.. వంట చేయరా?

బ్రహ్మాండంగా చేస్తా. వరుణ్‌ ఏది ఇష్టపడితే అది నేర్చుకుని మరీ వండి పెడతాను. తన కోసం కుక్‌ చేయడం అంటే నాకు చాలా ఇష్టం.
     
పర్సనల్లీ హ్యాపీ.. కానీ, కెరీర్‌ వైజ్‌గా వరుణ్‌ వెనకపడిపోయారేమో...?
ఇప్పటివరకూ తను 20 సినిమాలకు పైగా చేసినా, చెప్పుకోదగ్గవి నాలుగైదు సినిమాలు మాత్రమే ఉన్నాయి. అందుకే ఇకనుంచి ఏ సినిమా పడితే అది చేయకుండా, ఎగై్జటింగ్‌ ప్రాజెక్ట్‌ వస్తేనే చేయాలని వరుణ్‌ ఫిక్సయ్యాడు. మాకు ఫైనాన్షియల్‌ స్ట్రెస్‌ లేదు. సినిమా ప్రొడ్యూస్‌ చేయాలనే ఆలోచన ఉంది. బిజినెస్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నాం.

మరి మమ్మీ–డాడీ ప్లాన్‌ ఎప్పుడు?
(నవ్వుతూ). వచ్చే నెల 20న మా ఫస్ట్‌ వెడ్డింగ్‌ యానివర్శరీ. ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటే బాగుంటుంది? అని ప్లాన్‌ చేసుకుంటున్నాం. పేరెంట్స్‌ అవ్వాలనే ప్లాన్‌ కూడా ఉంది. అది కూడా రెండేళ్ల లోపే మమ్మీ–డాడీ అవ్వాలనుకుంటున్నాం.

వితిక లేకుండా నేను లేను – వరుణ్‌ సందేశ్‌http://img.sakshi.net/images/cms/2017-07/81499881615_Unknown.jpg
వితిక సూసైడ్‌ అటెంప్ట్ట్‌ చేశారంటే నమ్మారా? ఎప్పుడైనా మీరు చిరాకుగా మాట్లా డిన మాటలు, అలిగిన సందర్భాల వల్ల అలా చేసుకుందేమోనని భయపడ్డారా?
ఏ కపుల్‌ మధ్య అయినా అలకలు, చిన్ని చిన్ని గొడవలు కామన్‌. కానీ మా మధ్య అవి కూడా తక్కువే. అందుకని భయపడాల్సిన అవసరం నాకు లేదు. పైగా, నిద్రపట్టడంలేదు.. ‘స్లీపింగ్‌ టాబ్లెట్‌ వేసుకుంటున్నా నానా’ (వరుణ్‌ని వితిక నానా అని పిలుస్తారు) అని నాకు చెప్పింది. నేను కూడా ఓకే అన్నా. వితిక నిద్ర పట్టక గింజుకుంటుంది. అది నాకు తెలుసు కాబట్టే, నిద్రమాత్రలు వేసుకుంటానంటే ఓకే అన్నాను. పైగా అదేం తనకు హ్యాబిట్‌ కాదు.

వితికకి సూసైడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని మీకు తెలుసు... కానీ, ఇలాంటి న్యూస్‌ విన్న తర్వాత తను లేని జీవితం ఎలా ఉంటుందనే ఊహ కలిగిందా?
అమ్మో.. వితిక లేని జీవితమా? ఊహించలేనండీ. తను లేకుండా నేను లేను. నా బిగ్గెస్ట్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ తను. వితిక సూసైడ్‌ చేసుకునేంత పిరికమ్మాయి కాదు. వెరీ స్ట్రాంగ్‌ అండ్‌ ఇండిపెండెంట్‌. మా బంధం చాలా బలంగా ఉంది. ముందు ముందు మరింత బలపడుతుందనే నమ్మకం ఉంది.

మ్యారీడ్‌ లైఫ్‌ హ్యాపీగా ఉందని వితిక అన్నారు..
నేనూ అదే అంటున్నా. మా అమ్మవాళ్లింటికి వెళ్లొస్తానంటే సరే అన్నాను. అందుకే ఇండియా వచ్చింది. ఓ సిల్క్‌ హౌస్‌ యాడ్‌లో యాక్ట్‌ చేయడానికి దుబాయ్‌ వెళ్తోంది. షిర్డీ వెళ్లాలనుకుంటోంది. ఆ తర్వాత ఫ్రెండ్స్‌తో లదక్‌ వెళ్లి, అట్నుంచి అటు అమెరికా వచ్చేస్తుంది. నా సిస్టర్‌కి కొడుకు పుట్టాడు. ఆ బుజ్జిగాణ్ణి చూడటానికి హ్యూస్టన్‌ వెళ్లాను. మా లైఫ్‌ మీద మాకు ఫుల్‌ క్లారిటీ ఉందండీ. వియ్‌ ఆర్‌ హ్యాపీ.
– డి.జి. భవాని

చదవండి (ఇది సూసైడే)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement