అవుటాఫ్ కవరేజ్ ఏరియా
‘‘గ్రామం అన్నీ అమరిన వారికి తీపి జ్ఞాపకం కావచ్చు. బయటికొచ్చి బతికితే నోస్టాల్జియా కావచ్చు. కాని గ్రామీణ సమాజాన్ని ఏలేది మనువాదమే. అందుకే అంబేద్కర్ దళితులను గ్రామాలు వదిలి పట్టణాలకు తరలి వెళ్లమని చెప్పాడు. అయితే పట్టణాల్లో కూడా ఇప్పుడు కులవివక్ష భూతం మోడరన్ మేకప్ వేసుకుని దర్జాగా మురికివాడల నుంచి పెద్ద పెద్ద కాలనీల దాకా అనేక రూపాలలో తిరుగుతూనే ఉంది. పట్టణాల్లో నయా అగ్రహారాల నిర్మాణం జరుగుతోంది. కుల సమస్య రూపుమాసిపోయిందని చెప్పే పెద్దమనుషులు, సినీ ప్రముఖులు ఆయా అగ్రహారాలకు ప్రచారం చేస్తూ నగరీకరించిన కొత్తరకం వివక్షకు తలుపులు తెరుస్తున్నారు.
నాగరిక సమాజంలో మాటు వేసి దళితుల మీద దాడి చేస్తున్న అగ్రకుల ‘ట్రోజన్ హార్స్’ల ఎత్తుగడలను పసిగట్టి పసునూరి రవీందర్ తన కథల ద్వారా బాధిత దళిత సమాజాన్ని అలర్ట్ చేస్తున్నాడు. తెలంగాణ విజయోత్సవ సంతోష సందర్భంలో పసునూరి రవీందర్ తన తెలంగాణ దళిత కథల సంపుటి ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ ప్రచురించడం ఆనందకరమైన విషయం’’
- వినోదిని
(పుస్తకంలోని ముందుమాట నుంచి) అక్టోబర్ 16 ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో పసునూరి రవీందర్ ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ ఆవిష్కరణ. కొలకలూరి ఇనాక్, కె.శ్రీనివాస్, ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, సీతారామ్, కోయి కోటేశ్వరరావు, సంగిశెట్టి శ్రీనివాస్, కనీజ్ ఫాతిమా పాల్గొంటారు.