పదేళ్లుగా ఆ అలవాటు ఉంది!
ప్రైవేట్ కౌన్సెలింగ్
నాకు 32 సంవత్సరాలు. ఈమధ్య నేను సెక్స్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా పురుషాంగంలో నొప్పి వచ్చి, కలుక్కుమనే శబ్దం వచ్చింది. ఆ తర్వాత పురుషాంగం విపరీతంగా వాచింది. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాను. నాకు మత్తు ఇచ్చి వెంటనే ఆపరేషన్ చేశారు. విషయం ఏమిటని అడిగితే ‘పెనిస్ ఫ్రాక్చర్ అయ్యింది, సరిచేసి కుట్లువేశామ’ని డాక్టర్ చెప్పారు. నా సందేహంమేమిటంటే... పురుషాంగంలో ఎముక ఉండదంటారు కదా. మరి ఫ్రాక్చర్ ఎలా అయ్యింది? నాకు పురుషాంగానికి వచ్చిన వాపు ఇప్పుడు తగ్గింది. అంగస్తంభన కూడా మామూలుగానే అవుతోంది. అయితే నాకు మునుపటిలా సెక్స్ చేయాలంటే భయంగా ఉంది. మళ్లీ ఇలా అయ్యే అవకాశం ఉందా?
- వి.ఎస్.వి.ఆర్., హైదరాబాద్
సాధారణంగా సెక్స్‌లో పాల్గొన్నప్పుడు అంగస్తంభన సమయంలో పురుషాంగంలోకి రక్తం ప్రవేశించి బయటకు పోయే ద్వారాలు మూసుకుపోవడం వల్ల గట్టిగా మారుతుంది. పురుషాంగం లోపల కుడివైపు, ఎడమవైపు రెండు రబ్బరు షీట్లలాంటివి ఉంటాయి. వీటిలో రక్తం నిండటం వల్ల పురుషాంగం గట్టిగా అవుతుంది. కొన్ని సందర్భాల్లో చాలా అరుదైన భంగిమల్లో సెక్స్ చేసేటప్పుడుగాని, అకస్మాత్తుగా యోని నుంచి పురుషాంగం స్లిప్ అయి, దానిపై ఒకేసారి విపరీతమైన బరువు, ఒత్తిడి పడటం వల్ల ఈ రబ్బర్ షీట్ల వంటి నిర్మాణంలో ఒక పగులు (క్రాక్) ఏర్పడుతుంది. అప్పుడు రక్తనాళాల నుంచి రక్తం బయటకు రావడం వల్ల పురుషాంగానికి వాపు వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మీ డాక్టర్ చెప్పినట్లుగా శస్త్రచికిత్స చేసి, పగులు (క్రాక్)ను రిపేర్ చేస్తారు. ఇంతే జరుగుతుంది తప్ప... నిజానికి పురుషాంగంలో ఎముక ఏదీ ఉండదు. అది విరగదు. అయితే ఒకసారి ఇలా వచ్చిన సమస్యకు ఆపరేషన్ చేశాక... ఆ తర్వాత మళ్లీ మునుపటిలాగే అంగస్తంభనలు వస్తుంటాయి.
సెక్స్ కూడా మునుపటిలాగే మామూలుగానే చేయవచ్చు. కాకపోతే కాస్తంత వేర్వేరు భంగిమల్లో సెక్స్‌ను ఎంజాయ్ చేయాలనుకునేవారు అకస్మాత్తుగా పురుషాంగం యోని నుంచి జారిపోకుండా, అలా జరిగినప్పుడు దానిపై ఒకేసారి విపరీతమైన ఒత్తిడి, బరువు పడకుండా చూసుకుంటే చాలు. ఆపరేషన్ అయిన మూడు నెలల తర్వాత మీరు మళ్లీ మునుపటిలాగే సెక్స్‌లో నిరభ్యంతరంగా పాల్గొనవచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు ఆందోళన చెందడం అనవసరం.
నాకు 65 ఏళ్లు. ముక్కుతూ మూత్రం పోయాల్సి వస్తోంది. ధార కూడా సన్నగా వస్తోంది, మంటగా ఉంది. యూరాలజిస్ట్‌ను సంప్రదించాను. ఆయన స్కానింగ్ చేయించారు. దాంట్లో ప్రోస్టేట్ గ్రంథి పెరిగినట్లుగా ఉంది. దాంతోపాటు పీఎస్‌ఏ అనే రక్తపరీక్ష చేశారు. పీఎస్‌ఏ 13 వచ్చిందని చెప్పి, ప్రోస్టేట్ బయాప్సీ చేయించుకోవాలంటున్నారు. నాకు సమస్య తీవ్రత అంత ఎక్కువగా లేదు. ఈ బయాప్సీ నిజంగా అవసరమా? పీఎస్‌ఏ అంటే ఏమిటి? - ఆర్.వి.ఎస్., ఒంగోలు
పీఎస్‌ఏ అంటే... ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే ఒక పరీక్ష. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్‌ను కనుగొనడానికి ఒక స్క్రీనింగ్ పరీక్ష. సాధారణంగా 65 ఏళ్లు పైబడిన వారిలో పీఎస్‌ఏ రిజల్ట్స్ 4-6 నానోగ్రామ్ పర్ ఎంఎల్ కంటే ఎక్కువగా ఉంటే ప్రోస్టేట్ బయాప్సీ పరీక్షను చేయించమని డాక్టర్లు సూచిస్తారు. మీకు 13 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బయాప్సీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా సులభమైన పరీక్ష. ఔట్‌పేషెంట్‌గా చేసే పరీక్ష మాత్రమే. కాబట్టి మీ డాక్టర్ సూచించినట్లుగా బయాప్సీ చేయించుకోండి.
నా వయసు 42. నాకు గజ్జల వద్ద చర్మం కమిలిపోయినట్లుగా ఉంది. నల్లగా మారి దురద వస్తోంది. చేతికి కాస్త గరుకుగా తగులుతోంది. డాక్టర్‌కు చూపించుకోవాలంటే సిగ్గుగా అనిపించి సంప్రదించలేదు. నేను నా ప్రైవేట్ పార్ట్స్ శుభ్రంగా ఉంచుకుంటాను. కాకపోతే ఈ వర్షాల సమయంలో టూ వీలర్‌పై వెళ్తుంటే రెండు మూడు సార్లు డ్రస్ అంతా తడిసిపోయింది. ఆఫీస్ నుంచి తిరిగి వెళ్లాక అండర్‌వేర్‌తో సహా డ్రస్ మార్చాను. అయినా ఈ సమస్య తగ్గడం లేదు. పరిష్కారం సూచించండి. - పి. రమేశ్, రాజమండ్రి
మీరు చెబుతున్న సమస్య అక్కడ తగినంతగా గాలి ఆడకపోవడం వల్ల వచ్చినట్లుగా అనిపిస్తోంది. మీరు చెబుతున్నచోట రెండు శరీరభాగాలు ఒరుసుకుంటూ ఉండటం ఫలితంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. మీరు చర్మవ్యాధి నిపుణుడికి చూపిస్తే, వారు పరీక్షించి మీకు యాంటీఫంగల్ క్రీమ్‌గానీ, పౌడర్‌గానీ ఇస్తారు. మీ సమస్య నయమవుతుంది.
నాకు 25 ఏళ్లు. చాలా మంది అమ్మాయిలతో సెక్స్ చేసేవాణ్ణి. నాకు మూత్రంలో మంట, అప్పుడప్పుడు చీము వచ్చేది. ఈమధ్య మూత్రధార సరిగ్గా రావడం లేదు. జ్వరం వస్తోంది. బరువు తగ్గిపోతున్నాను. నాకు హెచ్‌ఐవీ వచ్చిందేమో అని భయంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - ఆర్.ఎన్., హైదరాబాద్
మీరు మొట్టమొదట చేయాల్సింది మీ వివాహేతర సంబంధాలను నిలిపివేయడం. ఆ తర్వాత సెక్స్ వల్ల వ్యాపించే అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించాలి. అంటే హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, హెపటైటిస్-సి, వీడీఆర్‌ఎల్ వంటి పరీక్షలన్నీ మీరు చేయించుకోవాలి. ఇది కాకుండా మూత్ర ధార సరిగ్గా రావడం లేదు కాబట్టి మూత్రం కల్చర్ పరీక్ష, ఆర్‌జీయూ అనే ఎక్స్-రే చేయించుకోవాలి. మీకు మూత్రనాళంలో ఏదైనా అడ్డంకి ఉందేమో చూడాలి. ఇలా ఉంటే దాన్ని స్ట్రిక్చర్ అంటారు. ఈ పరీక్షలన్నీ చేయించుకుని, ఆ ఫలితాల ఆధారంగా సరైన చికిత్స పొందండి. మీరు వెంటనే యూరాలజిస్ట్‌ను కలవండి.
నా వయుస్సు 24 ఏళ్లు. గత పదేళ్లుగా హస్తప్రయోగం చేస్తున్నాను. గతంలో వీర్యస్ఖలనం అయ్యేందుకు చాలా సవుయుం పట్టేది. కానీ ఈమధ్య హస్తప్రయోగం మొదలుపెట్టగానే వీర్యం పడిపోతోంది. అదీగాక నా అంగం చిన్నగా ఉంది. సైజ్ పెరగడానికి వూర్గం చెప్పండి. - ఎం.కె.ఆర్., తుని
మీరు గత పదేళ్ల నుంచి హస్తప్రయోగం చేస్తుండటంతో ఈ ప్రక్రియు కాస్తా మెకానికల్‌గా వూరింది. అందుకే మొదట్లో ఉన్న ఎక్సరుుట్‌మెంట్, థ్రిల్ తగ్గి ఇలా త్వరగా వీర్యస్ఖలనం అరుుపోతోంది. మీరు పెళ్లి చేసుకుని భార్యతో సెక్స్‌లో పాల్గొంటే వుళ్లీ వూవుూలుగా మొదట్లోని థ్రిల్‌ను, ఎక్సరుుట్‌మెంట్‌ను, వుంచి తృప్తిని పొందగలుగుతారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కువసార్లు హస్తప్రయోగం చేసినందువల్ల అంగం సైజ్ తగ్గడం అంటూ ఉండదు. సెక్స్‌లో తృప్తి చెందేందుకు లేదా భార్యను తృప్తిపరచేందుకు అంగస్తంభనలు చక్కగా ఉంటే చాలు. సైజ్‌కూ తృప్తికీ ఎలాంటి సంబంధం లేదు. మీకున్న అపోహే చాలా వుందిలో ఉంటుంది. కానీ అది తప్పు. హస్తప్రయోగానికీ ఎత్తుపెరగకపోవడానికీ ఎలాంటి సంబంధం లేదు.
నాకు 26 ఏళ్లు. నా పురుషాంగంపై పులిపిరి కాయల్లా వస్తున్నాయి. నాకు చాలా ఆందోళనగా ఉంది. దీనికి పరిష్కారం చెప్పండి.- కె.ఎమ్.ఆర్., నందిగామ
మీరు చెప్పిన అంశాలను బట్టి మీకు హెచ్‌పీవీ సోకిందని తెలుస్తోంది. హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది సెక్స్ వల్ల వ్యాపించే వ్యాధి. దీనికి కాటరీ చికిత్స (కొన్ని చోట్ల పెరిగే అవాంఛిత కండను తొలగించే చికిత్సను కాటరైజేషన్ అంటారు). కొన్ని రకాల రసాయనాలను వాడటం లేదా శస్త్రచికిత్స ద్వారా తగ్గించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు దగ్గర్లోని యూరోసర్జన్/యాండ్రాలజిస్ట్‌ను కలవండి.
డాక్టర్ వి. చంద్రమోహన్
యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్,
ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్