సల్మాన్ రష్దీ- రైటర్స్ బ్లాక్...
1980లలో ఒకసారి నాకు రైటర్స్ బ్లాక్ వచ్చింది. ఇది అందరు రచయితలకూ వచ్చేదే. ఏమనుకున్నా రాయలేకపోవడం. అప్పుడే నికరాగ్వా మంచి వేడి మీద ఉంది. పొలిటికల్ రివల్యూషన్... ఎలాగూ ఏమీ రాయట్లేదు కదా అని దాని సంగతి చూసొద్దామని వెళ్లా. ఏముంది. అడుగడుగునా మందుపాతరలే. చావుతో దాదాపు దగ్గరి పరిచయమైంది. ఆ దెబ్బకు రైటర్స్ బ్లాక్ వదిలిపోయింది. వెంటనే లండన్‌కు తిరిగి వచ్చి ఆ సంవత్సరమే ‘శాటానిక్ వర్సెస్’ మొదటి డ్రాఫ్ట్ పూర్తి చేశా. (నవ్వుతూ) ల్యాండ్‌మైన్స్ వల్ల పెద్ద పెద్ద విధ్వంసాలే సృష్టించవచ్చని అనుకోవద్దు. నవలలు కూడా సృష్టించవచ్చు.
- సల్మాన్ రష్దీ
తన కొత్త వెబ్‌సైట్ జ్ట్టిఞ://ఠీఠీఠీ. ట్చఝ్చటఠటజిఛీజ్ఛీ.ఛిౌఝ/ మొదలైన సందర్భంగా గతంలో చేసిన వ్యాఖ్యలను పాఠకులకు అందుబాటులో ఉంచుతూ...
(అయితే ‘శాటానిక్ వర్సెస్’ (1986) కూడా ల్యాండ్‌మైన్‌లానే పేలిందన్న సంగతి ఎవరూ మర్చిపోలేదు. దాని వల్ల రష్దీ ఫత్వా ఎదుర్కొన్నాడు. దేశాలు పట్టాడు. అవస్థల పాలయ్యాడు. ఇవాళ్టికీ భారతదేశంలో ఆ నవల మీద నిషేధం ఉంది)