మోహన్
సందర్భం
ఆర్.కె. లక్ష్మణ్ కామన్ మేన్ ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడడు. అతన్తో మాట్లాడిస్తే పోలా అనిపించింది. ‘చిన్నవాడు సూపర్ మేన్‌ని పలకరించమంటున్నాడు మీ వాణ్ణి సమాధానం చెప్పమనండి’ అని పెన్ చేతికిచ్చాను. ‘ద సూపర్ మేన్ ఈజ్ ఎ మేన్ ఆఫ్ యాక్షన్ హి నెవర్ స్పీక్స్’ అని రాసి సంతకం పెట్టాడు. మర్నాడు ‘ఉదయం’లో ఇంటర్వ్యూతో సహా ఆ కార్టూన్ హిట్.
1960వ దశకం మధ్యలో ఈ సంతకం న్యూస్‌ప్రింట్ వాసనతో సహా చేతివేళ్లని తడిమింది. పైన కార్టూన్ గీతలకి గుడ్లప్పగించి కేప్షన్ చదవ్వాయ్ అంది. చిన్నగా నవ్వవాయ్ అని చెప్పలేదు. కానీ పెద్దగానే నవ్వించింది. మెల్లగా ఆ ఇండియన్ ఇంక్ గీతల నల్ల మందు మరిగాం. ఆ మత్తు ఈ రోజుకీ దిగలేదు.
అప్పుడు ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో క్లాసులు అవగానే కాళ్లని క్యాంటీన్ వేపు కాకుండా లైబ్రరీకి నడి పించినవి ఈ నల్ల మత్తు గీతలే. ఇంటికొచ్చే ‘శంకర్స్ వీక్లీ’లో శంకర్, అబూ అబ్రహాం, బి.వి. విజయన్, కుట్టీ, ప్రకాష్ ఉన్ని ఇంకా ఎంతో మందివి రకరకాల స్టైల్స్ చూసినా ఆర్.కె.లక్ష్మణ్ గీత మరోరకంగా ఉండేది. అప్పుడు తెలుగులో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, జ్యోతి మంత్లీలో బాపూ కార్టూన్‌లు, ఇలస్ట్రేషన్‌లూ రాజ్యమే లేవి. బొమ్మలేసే సరదావల్ల ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లన్నీ అదే పనిగా చూడ్డం దారి వెతుక్కోవడం మామూలే.
ఇప్పుడు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో పెద్ద పొలిటి కల్ కార్టూన్, ‘యు సెడ్ ఇట్’ పేరుతో ప్యాకెట్ కార్టూన్ వచ్చేవి. ఇందులో బట్టతలా, కళ్లజోడూ, గళ్లకోటూ పంచే, చేతిలో గొడుగుతో ‘కామన్ మేన్’ ఉండేవాడు. ఇం ట్లో భార్యతో వాదనల దగ్గర్నుంచి సంచితో కూరగా యల బజారుకు పోవడం, మర్నాడు అమాంతంగా మం త్రివర్గ సమావేశంలోకి తొంగిచూడ్డం, అంతలోనే ఊరే గింపులు చెదరగొట్టే పోలీసుల లాఠీచార్జీలూ ప్రత్యక్షం కావడం, ఇలా సర్వాంతర్యామిగా ఉండేవాడు. ఈ సామాన్యుడు తన ఇంటి గొడవల కిటికీలోంచి దేశ రాజ కీయాల్ని చూసి, రకరకాలుగా విస్తుపోడం షాక్ తినడం, బెంగపడ్డం చూపించాడాయన. నాలుగు దశాబ్దాలపైనే ప్రపంచాన్ని చూసి, మనకు చూపించిన ఈ సామాన్యుడి విగ్రహాన్ని మన దేశంలో రాష్ట్రపతి ఆవిష్కరించడం అపురూపమైన గౌరవమే. అలాగే మెగసెసె అవార్డు అందుకున్న ఏకైక భారతీయ కార్టూనిస్టూ ఈయనే.
60వ దశకంలో కుష్వంత్‌సింగ్ ఎడిటర్‌గా ఉన్నప్పుడు ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ’లో ఈయన కలర్ క్యారికేచర్లు వచ్చేవి. ‘నేనెన్నడూ కలవని స్టార్స్’ లాంటి పేరుతో సినీ తారలు, అశోక్ కుమార్, దేవానంద్, ఎస్‌డీ బర్మన్, మధుబాల ఇంకా ఎంతో మంది బొ మ్మలు వింతగా ఉండేవి. మ్యాగ జైన్ కవర్ మీద కూడా గొడ్డలి పట్టు కున్న జియావుల్ హక్ బొమ్మ మిలి టరీ యూనిఫామ్‌లో, మెడల్స్‌తో సహా పంచరంగుల్లో భయపెట్టేది. లోపల మేరియో మిరాండా తన సొంత స్టైల్‌తో గోవా, బొంబాయి, వీధులూ, భవంతులూ, పిల్ల లూ, పిల్లులూ, కుక్కలూ, ఆడామగా అందాల విచ్ క్రాఫ్ట్ అదరగొట్టేది. 70వ దశకంలో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ వాళ్లే ‘సైన్స్ టుడే’ మ్యాగజైన్ తెచ్చారు. అందులో ఓ పేజీనిండా లక్ష్మణ్ కార్టూన్‌లుండేవి. సైంటిస్టులూ, వాళ్ల లేబొరేటరీ, గినీ పిగ్స్ అన్నిటినీ అమాయకంగా చూస్తున్నట్టే వెటకారాలుండేవి. ఒక సైంటిస్టు జుట్టంతా పీక్కుంటూ బావురుమంటుంటాడు. కిటికీలోని తెల్ల ఎలుక, తోటి ఎలుకతో చెప్తుంటుంది. ‘పదేళ్లుగా నా మీద ప్రయోగాలు చేస్తున్నాడు. చివర్లో నేను కుడి నుండి ఎడ మకు నడిస్తే ఎక్స్‌పరిమెంట్ సక్సెస్. ఆ సంగతి తెలిసే నేను ఎడమ నుండి కుడికి నడిచా’ ఇలాటివి ఎన్నో.
70వ దశకంలో జర్నలిజంలో చేరా. కొన్ని కార్టూన్లు కూడా గీసీ 80ల్లో హైదరాబాద్ వచ్చాక ఆయన్ని మొద టిసారి కలవడమైంది. హిమాయత్‌నగర్లో ఆయన బం ధువులో ఫ్రెండ్సో ఉన్నారు. ఎప్పుడూ వచ్చిపోయే వాడు. నేనో కార్టూన్ రిడిల్ పట్టుకెళ్లా. ఆయన కామన్ మేన్ ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడడు. అతన్తో మాట్లా డిస్తే పోలా అనిపించింది. నా బొమ్మలూ లక్ష్మణ్ కామన్ మేన్ సూపర్ మేన్ లాగా అరవై అడుగుల పొడుగున్నట్టు పాదాలూ, గొడుగు మాత్రమే కనిపిస్తుంటా యి. ‘ఉదయం’ పత్రికలో నా కామ న్ మేన్ ఆ గొడుగు చువ్వ చివర లాగుతూ పలకరించమని అరుస్తుం టాడు. లక్ష్మణ్ దాన్ని చూసి ‘గుడ్ ఏం చేయాలని’ అడిగాడు. ‘చిన్నవా డు సూపర్ మేన్‌ని పలకరించమంటున్నాడు మీ వాణ్ణి సమాధానం చెప్పమనండి’ అని పెన్ చేతికిచ్చా ను. ఒక్కక్షణం ఆలోచించి ‘ద సూప ర్ మేన్ ఈజ్ ఎ మేన్ ఆఫ్ యాక్షన్ హి నెవర్ స్పీక్స్’ అని రాసి సంతకం పెట్టాడు. మర్నాడు ‘ఉదయం’లో ఇంటర్వ్యూతో సహా ఆ కార్టూన్ హిట్. అలా ఆయన్ని హైదరాబాద్‌లో, బెంగళూరులో చాలాసా ర్లు కలిశాం. లక్ష్మణ్ కార్టూన్‌ల గురించీ, ఆయనతో మా గుంపు అనుభవాల గురించీ ఎంతేనా ఎన్నైనా చెప్పుకో వచ్చు. శంకర్స్ వీక్లీ, తర్వాత ఈయనా, మరెంత మందో 70వ దశకం వరకూ తెచ్చిన సాంప్రదాయం ఎందుకో ముందుకు పోవడం లేదు. వెనక్కిపోతోంది కూడా. ఫలా నా బ్రాండ్ హ్యూమర్ కోసం పొద్దుటే ఆత్రంగా పేపర్ లాక్కుని చూసే పరిస్థితే లేదు. రాజకీయ పార్టీలూ, కార్పొరేట్ కంపెనీలూ ఎడ్వర్‌టైజింగ్ అన్నీ కలిసి జర్నలి జంలో కాళ్లూ, వేళ్లూ, ఒళ్లూ మొత్తం దూర్చేస్తున్నాయి. సొంత అభిప్రాయం, సొంత వ్యాఖ్యానం అంటే కత్తులు దూసే అసహనం కట్టలు తెంచుకుంటోంది. లక్ష్మణ్ తరం వెళ్లిపోయింది. ఈ తరానికి ఆ సంగతి తెలియా ల్సిన అవసరం లేదు. ఇదే జర్నలిజమనీ, ఇదే కార్టూనిం గ్ అనీ, మనమేం చేస్తే అది ఘనకార్యమనీ జబ్బలు చరు చుకుందాం. కన్వీనియంట్‌గా లక్ష్మణ్‌ని మరిచిపోదాం. లేకపోతే చాలా ఇన్‌కన్వీనియన్స్.
(వ్యాసకర్త ప్రముఖ కార్టూనిస్టు)
మొబైల్: 7702841384