గజ్జెల పాపమ్మ గుడిలో అమ్మవారి కిరీటం చోరీ | Goddess crown stolen at Gajjela papamma temple | Sakshi
Sakshi News home page

గజ్జెల పాపమ్మ గుడిలో అమ్మవారి కిరీటం చోరీ

Published Mon, Feb 2 2015 11:48 AM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM

గజ్జెల పాపమ్మ గుడిలో అమ్మవారి కిరీటం చోరీ

గజ్జెల పాపమ్మ గుడిలో అమ్మవారి కిరీటం చోరీ

హైదరాబాద్: నగరంలోని దేవాలయాలపై దొంగలు కన్నెశారు.  భద్రత వైఫల్యం కారణంగా దేవాలయాల్లో దొంగలు చోరీలకు పాల్పడానికి అనువుగా మారుతోంది. దీన్ని అసరాగా చేసుకుని దేవాలయాల్లో  బంగారు అభరణాలు, నగలు, వెండి అభరణాలను దొంగలు దోచుకెళుతున్నారు. తాజాగా ఆలయంలో దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తి గుళ్లో పూజారీకి టోకరా వేసి గర్భగుడిలోని అమ్మవారి కిరీటాన్ని మాయం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్లోని మాదన్నపేట గజ్జెల పాపమ్మ గుడిలో సోమవారం ఉదయం వెలుగుచూసింది.  నగరంలోని పలు దేవాలయాల్లో జరిగిన వరుస చోరీ ఘటనలతో పోలీసులు అప్రమత్తమైయ్యారు.
 

దాంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా నిందితుడి అనవాళ్లు స్పష్టంగా రికార్డ్ అయినట్టు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు దేవాలయాల్లో సరైన భద్రత ఏర్పాటు చేయకపోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement