కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలలోని ఉన్నత విద్యాసంస్థలకు అంతంత మాత్రంగానే కేటాయింపులు లభించాయి. ఇంకా ఏర్పాటు కావల్సిన వాటికి కూడా ఎంగిలి మెతుకులు మాత్రమే విదిల్చారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఒక ప్రైవేటు కళాశాల వారు ఉచితంగా ఇచ్చిన భవనంలో కొనసాగుతున్న ఎన్ఐటీకి ఇంకా శాశ్వత భవనం ఏర్పాటుచేయాల్సి ఉండగా.. దానికి వచ్చే ఆర్థిక సంవత్సరం మొత్తానికి కలిపి కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. వాస్తవానికి ఈ పది కోట్లు ప్రహరీ నిర్మాణానికి కూడా సరిపోవు. ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి అక్కడ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంకా శాశ్వత భవన నిర్మాణం ఎప్పుడు చేస్తారో, అప్పటివరకు ఎన్ని సంవత్సరాలలో ఈ నిధులు ఇస్తారో తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ విద్యా సంస్థలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఇలా ఉన్నాయి..
సెంట్రల్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ -10 కోట్లు
ఏపీ, తెలంగాణ ట్రైబల్ యూనివర్సిటీలు - 20 కోట్లు
ఐఐటీ, ఆంధ్రప్రదేశ్ - 50 కోట్లు
ఐఐటీ హైదరాబాద్ - 75 కోట్లు
ఐఐఎం, ఆంధ్రప్రదేశ్ - 40 కోట్లు
ఎన్ఐటీ, ఆంధ్రప్రదేశ్ - 10 కోట్లు
ఐఐఎస్ఈఆర్, ఆంధ్రప్రదేశ్ - 50 కోట్లు