పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా హైదరాబాద్ లో బుధవారం భారీ వర్షం కురిసింది. మరో రెండుగంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 11 గంటల వరకూ నగరంలో వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్ష పాతం వివరాలను అధికారులు వెల్లడించారు. అంబర్ పేట లో అత్యధికంగా.. 11.8 సెంటీ మీటర్ల వాన కురవగా.. మేరేడ్ పల్లిలో అత్యల్పంగా0.75 మిల్లీ మీటర్ల వాన కురిసింది.
వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా.. (మిల్లీ మీటర్లలో)
అంబర్ పేట 118,
మల్కాజ్ గిరి 91.25,
సైదాబాద్ 87,
కుద్భుల్లా పూర్ 79.75,
ఖైరతాబాద్ 76.75,
అమీర్ పేట్ 69.5,
బహదూర్ పురా 65,
కీసర 62.75,
హిమయత్ నగర్ 61,
చార్మినార్ 58.5,
రాజేంద్రనగర్ 53,
తిరుమల్ గిరి 50,
నాంపల్లి 47.5,
బాలానగర్ 44,
గోల్కొండ 35.75,
శేరిలింగంపల్లి 35,
మల్కాజ్ గిరి 31.75,
ఉప్పల్ 19.75,
రామచంద్రాపురం13.75,
షేక్ పేట్ 4.25 ,
మేరేడ్ పల్లి 0.75,
ఎంత వాన కురిసింది..?
Published Wed, Aug 31 2016 2:37 PM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM
Advertisement
Advertisement