
పురుగుల సెలైన్: చిన్నారి మృతి
హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. జనగాం జిల్లాకు చెందిన సాయి ప్రవళిక అనే చిన్నారి రెండు నెలల క్రిందట అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో వైద్యులు చిన్నారికి పురుగులున్న సెలైన్ ఎక్కించారు.
దీంతో 62 రోజులుగా చికిత్స పొందుతున్న ప్రవళిక పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. నిర్లక్ష్యంగా వ్యవహారించిన వైద్యులపై చర్యలపై తీసుకోవాలని చిన్నారి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రవళిక న్యుమోనియాతో చనిపోయిందని వైద్యులు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు చదవండి