ప్రొఫెసర్ కోదండరాం అరెస్ట్ విషయంలో పోలీసుల తీరుపట్ల టీజేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ప్రొఫెసర్ కోదండరాం అరెస్ట్ విషయంలో పోలీసుల తీరుపట్ల టీజేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామటిపురా పోలీస్‌స్టేషన్‌లో కోదండరాం ఉన్నారన్న సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న జేఏసీ నేతలను పోలీసులు అనుమతించలేదు. కోదండరాం, ఇతర జేఏసీ నేతల నుంచి పోలీసులు ఫోన్‌లు లాక్కున్నారని జేఏసీ అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి అన్నారు. కోదండరాంకు ఏమైందని ఆయన భార్య ఆందోళన చెందుతున్నారని.. భార్యతో మాట్లాడేందుకు ఆయనకు ఫోన్ ఇవ్వాలన్నారు.
కోదండరాంతో మాట్లాడేందుకు పోలీసులు ఎందుకు అనుమతించడం లేదో హోం మంత్రి సమాధానం చెప్పాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు కోదండరాంకు క్షమాపణ చెప్పి.. విడుదల చేయాలన్నారు. కాగా.. కోదండరాంను కలిసేందుకు వచ్చిన వెంకటరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.