వైఎస్ఆర్ సీపీ నేత వడ్డేపల్లి కన్నుమూత ysr congress party leaders vaddepalli Narsing rao dies of illness | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ నేత వడ్డేపల్లి కన్నుమూత

Published Fri, May 23 2014 8:20 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

వైఎస్ఆర్ సీపీ నేత వడ్డేపల్లి కన్నుమూత - Sakshi

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వడ్డేపల్లి నర్సింగరావు (64) అనారోగ్యంతో మృతి చెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడుగా మెలిగిన వడ్డేపల్లి నర్సింగరావు  2005లో  రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పని చేశారు. కాగా వడ్డేపల్లి మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ నేతలు సంతాపం తెలిపారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement