బ్రెగ్జిట్ వైపే బ్రిటన్ ప్రజల మొగ్గు!
లండన్: బ్రిగ్జిట్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఐరోపా సమాఖ్య(ఈయూ)లో బ్రిటన్ కొనసాగాలా వద్ద అనే దానిపై నిర్వహించిన రెఫరెండం కౌంటింగ్ కొనసాగుతోంది. బ్రిటన్ వాసులు ఎటువైపు మొగ్గు చూపారో మరికాసేపట్లో తేలనుంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో సండర్లాండ్, కోవెంట్రి, కోల్బస్టర్ ఓటర్లు ఈయూ నుంచి విడిపోవడానికి మొగ్గు చూపారు. ఇక గ్తాస్గో, లివర్ పూల్, లండన్ ఓటర్లు మాత్రం ఈయూలో కలిసే ఉండాలని తేల్చారు. పూర్తి ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి.
మొత్తం 382 కౌంటింగ్ ఏరియాలలో ఇప్పటివరకూ 171 చోట్ల ఫలితాలు వెలువడగా.. 51.3 శాతం మంది ప్రజలు విడిపోవాలని, 48.7 శాతం ప్రజలు కలిసుండాలని తీర్పు ఇచ్చినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. కలిసుండాలి, విడిపోవాలనే ఓటర్ల మధ్య కేవలం రెండు శాతం మాత్రమే తేడా ఉండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎర్లీ ట్రెండ్స్ బ్రెగ్జిట్కు అనుకూలంగా ఉండటంతో పౌండ్ విలువ భారీగా పతనమైంది.