గూగుల్ మేనేజర్‌ను రేప్‌చేసి హత్య చేశారు | Google manager Vanessa Marcotte raped and murdered in Newyork | Sakshi
Sakshi News home page

గూగుల్ మేనేజర్‌ను రేప్‌చేసి హత్య చేశారు

Published Wed, Aug 10 2016 3:37 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

గూగుల్ మేనేజర్‌ను రేప్‌చేసి హత్య చేశారు

గూగుల్ మేనేజర్‌ను రేప్‌చేసి హత్య చేశారు

న్యూయార్క్: గూగుల్ న్యూయార్క్ కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్న వనెస్సా మార్కోటీ అనే 27 ఏళ్ల యువతిని గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం జరిపి హత్య చేశారు. అనంతరం శవాన్ని గుర్తుపట్టడానికి వీల్లేకుండా తగులబెట్టారు. మసాచుసెట్స్‌లోని ప్రిన్‌స్టన్ నగరంలోని తల్లి దగ్గరకు ఆదివారం వెళ్లిన వనెస్సా మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కనిపించకుండా పోయారు. సాయంత్రం వరకు కూతురు రాకకోసం నిరీక్షించిన వనెస్సా తల్లి ఆ సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు వనెస్సా తల్లి వద్దకు వచ్చి కూతురు ఎప్పుడు, ఎక్కడికి వెళ్లిందని వాకబు చేశారు. మధ్యాహ్నం వాకింగ్‌కని పక్కనున్న గ్రామీణ రోడ్డులోకి వెళ్లి అదృశ్యమైందన్న విషయాన్ని గ్రహించిన పోలీసులు, జాగిలాలను తీసుకొని వెళ్లి ఆ రోడ్డుపక్కనున్న పొదల్లో గాలించారు. సగానికిపైగా కాలిపోయిన మృతదేహం వారికి దొరికింది. ఒంటిపై దుస్తులు లేని ఆమె చేతులపై, కాళ్లపై గాయాలు ఉండడంతో అత్యాచారం జరిపి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు.

మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. రేప్‌చేసి, హత్య చేసినట్లు మంగళవారం నాడు వైద్య నివేదికలు వెల్లడించాయి. అయితే అత్యాచారం ఎంత మంది జరిపారన్న విషయం తెలియలేదు. ఇంతవరకు నేరస్తుల జాడను పోలీసులు కనుక్కోలేకపోయారు. చుట్టుపక్క ప్రాంతాల ప్రజలను వాకబు చేయడం ద్వారా దర్యాప్తును కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రజలెవరూ కూడా ఒంటరిగా జాగింగ్, వాకింగ్‌లకు వె ళ్లరాదని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వెళ్లరాదని వారు ప్రజలను హెచ్చరిస్తున్నారు.


 

Advertisement

పోల్

Advertisement