కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో?
న్యూయార్క్: శ్వేతజాతి దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కూచిబొట్ల వ్యవహారం అమెరికాలో తెలుగువారిని గట్టిగానే మేల్కొలిపింది. వరుసగా తెలుగువారిపై, భారతీయులపై జాతి వివక్ష పూరితమైన దాడులు జరుగుతుండటం పట్ల ఇప్పటికే బాహాటంగా తమ నిరసన వాణిని సోషల్ మీడియా, పత్రికల ద్వారా వెలిబుచ్చిన భారతీయ ముఖ్యంగా తెలుగు సమాజం ఇప్పుడు నేరుగా అమెరికా అధ్యక్ష భవనం నుంచి హామీ ప్రకటనకోసం ప్రయత్నం ప్రారంభించింది.
ఇందుకోసం నేరుగా అధ్యక్ష భవనానికి తమ మొర వినిపించేందుకు ఇప్పటికే ఉన్న ఆన్‌లైన్ పోర్టల్ ‘వి ది పీపుల్’ ద్వారా ప్రస్తుతం జరిగిన ఘటనపై స్పందనగానీ, ఇక ముందు అలాంటివి జరగకుండా అనుసరించనున్న విధానాలపై వివరణ ఇవ్వాలంటూ కోరింది. ఇందు కోసం సంతకాల సేకరణ ప్రారంభించింది. ఫిబ్రవరి 24న జాతి వివక్షతో భారతీయ ఇంజనీర్లపై దాడులు జరుగుతున్నాయి అనే శీర్షిక పెట్టి ఎస్వీ అనే వ్యక్తి ఆన్‌లైన్ పిటిషన్ వేసి సంతకాల సేకరణ ప్రారంభించారు. శ్వేత సౌదం స్పందించాలంటే నెల రోజుల్లో దీనిపై కనీసం లక్ష సంతకాలు ఉండాలి. ప్రస్తుతం ఈ అంశంపై 3,023మంది సంతకాలు చేశారు. ఇంకా కొనసాగుతోంది. మార్చి 26నాటికి ఈ సంతకాల సంఖ్య లక్షకు చేరాల్సి ఉంటుంది.
ఈ నెల (ఫిబ్రవరి) 22, కాన్సాస్‌లోని ఆస్టిన్ బార్‌లో ఓ అమెరికన్ దురహంకారి కాల్పులు జరపడంతో తెలుగువాడైన శ్రీనివాస్ కూచిబొట్ల చనిపోయాడు. మరో తెలుగు వ్యక్తి అలోక్ మాదసాని గాయపడ్డాడు. ఈ ఘటనపై మొత్తం తెలుగువారికే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో కాల్పులు జరిపే వ్యక్తి మా దేశం నుంచి వెళ్లిపోండి అని అడిగి మరీ కాల్పులు జరపడం ముమ్మాటికి జాతి వివక్ష దాడిగానే పరిణించాలని, ఆ కోణంలోనే దర్యాప్తు చేయాలని అక్కడి తెలుగువారు డిమాండ్ చేస్తున్నారు. అలాకాకుండా దీనిని ఒక మాములు అంశంగా అమెరికా ప్రభుత్వం తీసుకుంటే బాధితుల కుటుంబాలకు న్యాయం జరగనట్లేనని వారు అంటున్నారు. మరోపక్క, ఈ ఘటనను ట్రంప్ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న కారణంగా ఆన్‌లైన్ పిటిషన్ వైట్ హౌస్‌కు చేశారు.
(చదవండి: విద్వేషపు తూటా!)
నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి