జీహాదీ జాన్..ఫేస్ చూపించాడు.. | 'Jihadi John' reveals his face for the first time | Sakshi
Sakshi News home page

జీహాదీ జాన్..ఫేస్ చూపించాడు..

Published Mon, Aug 24 2015 11:42 AM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM

జీహాదీ జాన్..ఫేస్ చూపించాడు..

జీహాదీ జాన్..ఫేస్ చూపించాడు..

ఎడారి కంటే కఠినాత్ముడు.. కోడిని కోసిన దానికంటే సులువుగా మనుషుల పీకలు తెగ్గోస్తాడు. ఇస్లామిక్ తీవ్రవాదం పేరుతో ప్రపంచాన్ని వణికించడంలో ఇరానియన్లు, సిరియన్ల కంటే ముందుంటాడు. బ్రిటన్ జాతీయుడైన వాడి అసలు పేరు మహమ్మద్ ఎమ్వాజీ. కానీ సహచరులు, మీడియా పిలిచే ముద్దు పేరు.. జీహాదీ జాన్.

అమెరికన్ జర్నలిస్టులు జేమ్స్ ఫోలే, స్టీవెన్ సోల్టో.. బ్రిటిష్ స్వచ్ఛంద సేవకులు డేవిడ్ హెయినెస్, అలెన్ హెన్నింగ్.. జపనీస్ జర్నలిస్ట్ కెంజీ గోటో.. ఇలా లెక్కకు మించి ఐఎస్ఐఎస్కు బందీలుగా చిక్కిన విదేశీయులను అత్యంత కర్కశంగా పీకలు కోసి చంపిన ఆ నల్ల ముసుగు ఉగ్రవాది జీహాదీ జాన్ ముఖం ప్రపంచానికి తెలిసిపోయింది.  

ఐఎస్ఐఎస్ ఆదివారం విడుదల చేసిన తాజా వీడియోలో జీహాదీ జాన్ ముఖం స్పష్టంగా కనిపించింది. మొత్తం 1.17 నిమిషాల నిడివిగల వీడియోలో ట్రక్కును పేల్చుతున్న దృశ్యాలతోపాటు జీహాదీ జాన్ మాటలు కూడా రికార్డయ్యాయి.

'నేను.. మహమ్మద్ ఎమ్వాజీని. త్వరలోనే లండన్ తిరిగొస్తా.. అక్కడ కూడా తలల నరికివేతను కొనసాగిస్తా' అంటూ తనదైన బ్రిటిష్ యాసలో జీహాదీ జాన్ హెచ్చరికలు పంపాడు. కెమెరా లెన్స్ను తదేకంగా చూస్తూ అతను ఈ మాటలు చెప్పాడు.

జీహాదీ జాన్ ముఖం ప్రపంచానికి తెలియడంతో అతడి మూలాలను వెలికితీసే పనిలో పడ్డారు లండన్ పోలీసులు. బ్రిటన్ జాతీయుడిని అత్యంత కర్కశంగా హత్య చేసిన తర్వాత జీహాదీ జాన్ను ఎలాగైనా సరే మట్టుబెట్టాలని బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement