మహిళ దూకుతుంటే.. చేతులు చాచాడు! | Man tries to save a woman falling from the 11th floor of a building with his bare hands | Sakshi
Sakshi News home page

మహిళ దూకుతుంటే.. చేతులు చాచాడు!

Published Mon, Dec 28 2015 6:09 PM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

మహిళ దూకుతుంటే.. చేతులు చాచాడు!

ఓ యువతి పదకొండు అంతస్తుల భవనంపై నుంచి దూకుతుండగా..  రిటైర్డ్‌ సైనికుడు ఆమెను కాపాడాలని ప్రయత్నించాడు. దూకుతున్న మహిళను పట్టుకోవడానికి రెండు చేతులు చాచాడు. ఆమె అంత ఎత్తు నుంచి దభేలున ఆయనపై పడింది. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసినవారిలో వణుకు పుట్టిస్తోంది. సెంట్రల్‌ చైనా హుబీ ఫ్రావిన్స్‌లోని ఎన్షి నగరంలో ఈ నెల 23న ఈ ఘటన జరిగింది.

నివాస ప్రాంతంలోని ఓ 11 అంతస్తుల భవనం నుంచి మహిళ దూకుతుండటంతో కొంతమంది అక్కడ మూగారు. ఇంతలో ఆమె దూకుతుండటం చూసిన విశ్రాంత సైనికుడైన ఫెంగ్‌ నింగ్‌ పరిగెత్తుకుంటూ ముందుకొచ్చారు. మహిళను కాపాడాలని రెండు చేతులు చాచి నిలబడ్డారు. దురదృష్టశాత్తు ఆమె అతనిపై పడటంతో ఇద్దరు పడిపోయారు. వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా భవనంపై నుంచి దూకిన మహిళ ప్రాణాలు విడిచినట్టు తెలిసింది. విశ్రాంత సైనికుడికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చైనా సెంట్రల్‌ టెలివిజన్‌ న్యూస్ తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేసింది.

 

 
Footage: Man catches woman who jumped off a building with his ...

A retired soldier caught a woman jumping off a building with his bare hands in Enshi city, Hubei Province. The force with which the woman fell resulted in both of them collapsing to the ground. They were immediately rushed to a hospital, where the man underwent a surgery for a torn ligament. It is still unclear why the woman jumped off the building.

Posted by CCTVNews on Sunday, December 27, 2015

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement