ఇద్దరు కవలలు.. ఇద్దరు తండ్రులు | Paternity Case for a New Jersey Mother of Twins Bears Unexpected Results: Two Fathers | Sakshi
Sakshi News home page

ఇద్దరు కవలలు.. ఇద్దరు తండ్రులు

Published Sat, May 9 2015 12:15 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM

ఇద్దరు కవలలు.. ఇద్దరు తండ్రులు - Sakshi

ఇద్దరు కవలలు.. ఇద్దరు తండ్రులు

న్యూయార్క్: ఓ తల్లి గర్భం నుంచి కొన్ని సెకన్ల తేడాతో జన్మించిన కవల పిల్లలకు తండ్రి మాత్రం ఒక్కరు కాదు. ఇద్దరు పిల్లలకు ఇద్దరు తండ్రులు. ఈ అసాధారణమైన సంఘటన అమెరికాలోని న్యూజెర్సీలో జరిగింది.

రెండేళ్ల క్రితం తన భార్య ద్వారా జన్మించిన కవలల్లలో ఒకరికే తాను తండ్రిని, ఆ పిల్లాడి సంరక్షణ బాధ్యత మాత్రమే చూస్తానని తండ్రి స్పష్టం చేశాడు. తల్లి మాత్రం ఇద్దరి సంరక్షణ చూడాలని పట్టుబట్టింది. పితృత్వ గొడవ కోర్టు దాకా వెళ్లింది. కోర్టు రికార్డుల్లో భర్త పేరును 'ఏ ఎస్'గా, భార్య పేరును 'టీ ఎమ్'గా నమోదు చేశారు. కోర్టులో భార్యభర్తలు తమ వాదనే నిజమని చెప్పారు. అయితే భార్య జరిగిన విషయాన్ని వెల్లడించింది. ఒకే వారంలో భర్తతో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తితో శృంగారంలో పాల్గొన్నట్టు చెప్పింది.  డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా, ఇద్దరు కవలలకు తండ్రి ఒకరు కాదని, వేర్వేరని తేలింది. రుతుస్రావ సమయంలో ఆమె వారం వ్యవధిలో ఇద్దరితో శృంగారంలో పాల్గొనడం వల్ల ఇద్దరి ద్వారా తల్లి అయినట్టు వైద్యులు పేర్కొన్నారు. వైద్య శాస్త్రంలో ఇది అరుదైన సంఘటన అని  చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement