విద్యలో భారత్ మనల్ని అధిగమిస్తోంది: బరాక్ ఒబామా
న్యూయార్క్: గణితం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్, చైనా అత్యుత్తమ విద్యను అందిస్తూ.. అమెరికాను దాటిపోతున్నాయని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. బెంగళూరు నుంచి బీజింగ్ వరకు వందల కోట్ల మందికి ఉత్తమ విద్య అందించేందుకు ఆ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయన్నారు. బ్రూక్లిన్‌లో ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఒబామా ప్రసంగిస్తూ భారత్, చైనాల పోటీని తట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు.