
ఈ నిజాలు తెలిస్తే అమెరికా ఊసే ఎత్తరు..
న్యూయార్క్: అమెరికా అనగానే వావ్ అమెరికానా అంటూ.. అక్కడికి వెళ్లడం ఎంత అదృష్టమో అంటూ తామేదో చూసినట్లుగా ఏం తెలియకపోయినా చెప్పేవాళ్లు ఎంతోమంది. చాలా లగ్జరీ జీవితం ఉంటుందని, డాలర్లు మూటకట్టుకోవచ్చని, ఒక్క ఏడాది అక్కడ ఉద్యోగం చేస్తే ఇండియాలో వందేళ్ల తాపీగా బతికేయొచ్చని ఆలోచించేవాళ్లు ఎంతోమంది. అందుకే ఒక్క యువకులే కాకుండా వివిధ వయస్సుల్లో ఉన్నవారు కూడా అమెరికా పయనం అయ్యేందుకు సిద్ధమైపోతుంటారు.
ముఖ్యంగా కాస్తంత కలిగి ఉండి బీటెక్ అయిపోయిన వాళ్లయితే 'ఛలో అమెరికా' అంటూ తమ ఆశలకు రెక్కలు తొడిగేస్తారు. కానీ, అక్కడికి వెళ్లాక భారతదేశంలో ఎలాంటి చీకుచింత లేకుండా హాయిగా బతికేవాళ్లు కాస్త.. హలో లచ్చనా అంటూ తమ పరిస్థితులు ఎందులోకి తోసేస్తే అందులో బతికేయాల్సిందే. ఒక్కమాట చెప్పాలంటే ఆత్మగౌరవం తాకట్టుపెట్టుకొని జీవితం వెళ్లబుచ్చాల్సిందే.. ఇదేదో కావాలని చెబుతున్న మాటలు కాదు.. బీటెక్ అయిపోయి ఏదో చేద్దామని చెప్పి అక్కడి వెళ్లిన ఓ తెలుగమ్మాయి స్వయంగా చెప్పింది. ఎంతో ఊహించిన అక్కడి పరిస్థితుల్లో ఏం చేసేది లేక ప్రస్తుతం పాకీ పనిచేస్తున్న ఆమె తీవ్ర మనస్థాపంతో ఓ వీడియోను రికార్డు చేసింది.
అందులో ఏ భారతీయుడు అమెరికా రావాలనే ఆశపెట్టుకోవద్దని, హాయిగా ఇండియాలో బతికేయాలని, అక్కడికొస్తే బతుకంతా చిందర వందర ఉంటుందని చెప్పింది. ఆమె ప్రస్టేషన్‌లో కొన్ని మాటలు పరిశీలిస్తే..'పొద్దున్నే లేవగానే అందరూ స్టైలిష్‌గా బ్యాగులు వేసుకుంటారు. కానీ వారు చేసేది పాకీ పని. ఇళ్లు కడగడం, బేబి సిట్టింగ్, అన్నం వడ్డించడం ఇదే వారు చేసేది. నీళ్లు ఇచ్చే దిక్కు కూడా ఉండదు' అంటూ ఇలా చాలా మాటలు ఆమె ఆ వీడియోలో చెప్పింది.. ఇంక ఏం చెప్పిందో వినాలంటే ఈ వీడియో చూడాల్సిందే..