
పైసా వసూల్ సినిమాతో పరవాలేదనిపించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయిన తన తనయుడు ఆకాష్ ను రీలాంచ్ చేసేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగాడు. పూరి మార్క్ ప్రేమ కథగా ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూరి జగన్నాథ్ కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పూరి జగన్నాథ్, ఆకాష్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఛార్మీ నిర్మించనుందట. ఈ సినిమాతో బెంగళూరుకు చెందిన మోడల్ నేహాశెట్టిని హీరోయిన్ గా పరిచయం చేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.