విజువల్ వండర్గా 'ఏంజెల్' | High End Graphics For Angel Movie | Sakshi
Sakshi News home page

విజువల్ వండర్గా 'ఏంజెల్'

Published Tue, Feb 14 2017 11:15 AM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

విజువల్ వండర్గా 'ఏంజెల్'

విజువల్ వండర్గా 'ఏంజెల్'

ప్రముఖ నిర్మాత కృష్ణరెడ్డి తనయుడు భువన్ సాగర్ తొలిసారిగా నిర్మాతగా మారి, బాహుబలి పళని దర్శకత్వంలో

ప్రముఖ నిర్మాత కృష్ణరెడ్డి తనయుడు భువన్ సాగర్ తొలిసారిగా నిర్మాతగా మారి, బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ఏంజెల్. సింధూరపువ్వు కృష్ణారెడ్డి నిర్మాణ పర్వవేక్షణలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు. వినవయ్యా రామయ్య సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగ అన్వేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా అలరించనుంది.

ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే అయిన ఫిబ్రవరి 14న ఆఖరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. షియాజీ షిండే, ప్రదీప్ రావత్, సప్తగిరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న చిత్రం కావటంతో సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ముగించి విజువల్ ఎఫెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలు పెట్టేందుకు ఏంజిల్ టీమ్ ప్లాన్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement