హీరోయిన్‌ను కారులో బందీగా చేసి.. | Kidnapping attempt on Malayalam actress Bhavana, driver arrested | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ను కారులో బందీగా చేసి..

Published Sat, Feb 18 2017 11:05 AM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

హీరోయిన్‌ను కారులో బందీగా చేసి.. - Sakshi

హీరోయిన్‌ను కారులో బందీగా చేసి..

కోచి: దక్షిణాది హీరోయిన్ భావనను కొందరు దుండగులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. శుక్రవారం రాత్రి కేరళలోని కోచిలో ఈ ఘటన జరిగింది. చివరకు ఆమె సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఈ కేసులో పోలీసులు భావన కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

నిన్న కేరళలోని త్రిస్సూర్ నుంచి కోచికి భావన కారులో బయల్దేరింది. కొంతమంది ఓ టెంపులో భావన కారును ఫాలో అయ్యారు. కోచిలోని నెడుంబస్సెరీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు రాగానే భావన కారును టెంపుతో ఢీకొట్టారు. ఆ తర్వాత టెంపులో ఉన్నవారు కారు డ్రైవర్ మార్టిన్‌ను బయటకు లాగి కారులో కూర్చున్నారు. దుండగులు భావనను బందీగా చేసుకుని కారును నగరంలో గంటన్నర పాటు తిప్పారు. ఆ సమయంలో దుండగులు భావన పట్ల అనుచితంగా ప్రవర్తించి ఆమెతో ఫొటోలు, వీడియోలు దిగారు. ఆ తర్వాత పలరివట్లోమ్ జంక్షన్ వద్ద కారును, ఆమెను వదిలి పారిపోయారు. భావన కారును నడుపుకొంటూ దగ్గరలో ఉన్న ఓ నిర్మాత ఇంటికి వెళ్లి విషయం చెప్పింది.

భావన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో ఆమె కారు డ్రైవర్ మార్టిన్ పాత్ర ఉండొచ్చని భావిస్తున్నారు. భావన వద్ద గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన సునీల్ కుమార్ ఆమెను కిడ్నాప్ పథకం వేసినట్టు పోలీసులు చెప్పారు. అతనిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడనే కారణంతో భావన అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. మార్టిన్‌కు తెలిసే సునీల్ భావనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్టు పోలీసులు చెప్పారు.

భావన తెలుగులో ఒంటరి, హీరో, మహాత్మా, నిప్పు సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మొత్తం 70 సినిమాల్లో నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement