ప్రతిభే కొలమానం..!
ప్రతిభే కొలమానం..!
Published Sun, Feb 16 2014 11:17 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
వయసు అనేది తన దృష్టిలో ఓ సంఖ్య మాత్రమేనని. అయితే 10 లేదా 20 లేదా 100 అయినా ప్రతిభ అలాగే ఉంటుందని బాలీవుడ్ నటి మాధురీదీక్షిత్ పేర్కొంది. నగరంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తన మనోభావాలను మీడియాతో పంచుకుంది. ‘వయసుతోపాటు ప్రతిభ కూడా పెరుగుతూ ఉంటుంది. పెళ్లి చేసుకున్న నటి అనే పురాణంపై నాకు నమ్మకం లేదు. రాఖీ కూడా వివాహం తర్వాత సినిమాల్లో నటించింది. అలాగే కొంతమంది ఈ రంగాన్ని విడిచిపెట్టిపోయారు. అది వారి వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ రంగంలోకి వచ్చినవారిలో అనేకమంది కష్టపడ్డారు. అదేవిధంగా ఆటుపోట్లను సైతం ఎదుర్కొన్నారు.’ అని అంది. 1980, 90లలో బాలీవుడ్ రంగాన్ని మాధురి ఏలింది. టాప్ స్టార్ స్థాయికి ఎదిగింది.
శ్రీరాంతో వివాహం తర్వాత అమెరికా వెళ్లిపోయింది. ఆ తర్వాత అప్పుడప్పుడూ ఇండియాకు వచ్చిపోతూ ‘దేవదాస్’ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత అమెరికా నుంచి భారత్‌కు వచ్చింది. టీవీ షోలు, ప్రకటనల ఒప్పందాలు, సినిమాలతో మళ్లీ మెల్లమెల్లగా బిజీబిజీ అయిపోయింది. ప్రస్తుతం మాధురి నటించిన ‘గులాబ్ గ్యాంగ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అంతకుముందు విడుదలైన దేడ్ ఇష్కియా సినిమా విజయవంతమైంది. ‘గతంతో పోలిస్తే ప్రస్తుతం మహిళలకు ఈ రంగంలో భారీ అవకాశాలు వస్తున్నాయి. గతంలో మహిళా సహాయ దర్శకురాలు, కెమెరా ఉమెన్ లను నేనసలు చూడనేలేదు. మహిళా దర్శకులు ఉన్నప్పటికీ వారిని వేళ్లపైనే లెక్కించొచ్చు. జోయా అఖ్తర్, రీమా కగ్టి వంటి ప్రతిభాశాలులైన మహిళా దర్శకులు ఇప్పుడు ఈ రంగంలో ఉన్నారు’ అని అంది.
Advertisement
Advertisement