
మహేష్ లుక్ ఇదేనా..?
బ్రహ్మోత్సవం సినిమా తరువాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈసినిమా ఇటీవలే ప్రారంభమైంది. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమా కోసం లుక్ విషయంలో ప్రయోగం చేస్తున్నాడన్న టాక్ జోరుగా వినిపించింది.
అయితే తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఫోటో ఒకటి ఈ గాసిప్స్ ఫుల్ స్టాప్ పెట్టేలా కనిపిస్తోంది. మురుగదాస్ మూవీలో మహేష్ లుక్ ఇదే నంటూ ఓ ఫోటో మీడియా సర్కిల్స్ లో సందడి చేస్తోంది. కేవలం కాస్ట్యూమ్స్ మాత్రమే కొత్తగా కనిపిస్తున్నాయి కానీ లుక్ విషయంలో మహేష్ ఎలాంటి ప్రయోగం చేయలేదు. చారల చొక్కా, ఇన్ షర్ట్ తో రాజకుమారుడు రాముడు మంచి బాలుడులా కనిపిస్తున్నాడు. ఇది నిజంగానే మహేష్ కొత్త సినిమా లుక్కేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు నటుడు అయిన ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్నాడు. దాదాపు 90 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.