
పుట్టిన రోజున అభిమానులకు మహేష్ గిఫ్ట్
బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ షాక్ నుంచి అభిమానులను బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా.., ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మహేష్, షూటింగ్ ప్రారంభం కావటానికి ముందే ఓ పోస్టర్ను రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట.
ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ లుక్ కోసం ఫోటో షూట్ నిర్వహించారు. ఈ ఫోటో షూట్ ఫోటోలతో ఓ ప్రీ లుక్ను ఆగస్టు 9న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ రోజు మహేష్ పుట్టిన రోజు కావటంతో అభిమానులకు తన నెక్ట్స్ సినిమా ప్రీ లుక్ను గిఫ్ట్ గా ఇవ్వాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ ప్రీ లుక్కు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.