ప్రియాంక చోప్రా ఇండియాకు రావద్దు..! | Priyanka Chopra Trolled For Sporting A Tricolour Scarf On Independence Day | Sakshi
Sakshi News home page

ప్రియాంక చోప్రా ఇండియాకు రావద్దు..!

Published Thu, Aug 17 2017 4:20 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

ప్రియాంక చోప్రా ఇండియాకు రావద్దు..! - Sakshi

ప్రియాంక చోప్రా ఇండియాకు రావద్దు..!

సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు సోషల్‌మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ప్రియాంక వస్త్రధారణపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భారత్‌కు తిరిగి రావద్దంటూ.. అమెరికాలోనే ఉండిపోమ్మని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం రోజున జీన్స్, టీషర్ట్  ధరించిన ప్రియాంక.. జాతీయ జెండా రంగులతో ఉన్న ఒక దుప్పట్టాన్ని మెడపై వేసుకొని దానిని చేతితో పట్టుకొని ఫొటో దిగింది. దానిని ఇన్ స్ట్రాగ్రామ్ లో మై హార్ట్ బిలాంగ్స్ టూ ఇండియా హ్యష్ ట్యాగ్ తో పోస్టు చేసింది. అయితే ఆమె పెట్టిన పోస్టుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజైనా, చీర, సల్వార్‌ కమీజ్‌ వేసుకోకుండా ఇలాంటి డ్రస్‌లు ఏంటని కామెంట్‌ చేశారు. తనను తిరిగి ఇండియాలోకి రావద్దంటూ మండిపడ్డారు. జాతీయ జెండాను అవమానించే విధంగా దుపట్టాలా కప్పుకుంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రియాంక దుస్తులపై నెటిజన్లు విరుచుకుపడటం కొత్తేంకాదు. భారత ప్రధాని నరేంద్రమోదీ బెర్లిన్‌ పర్యటనలో ఉన్నప్పుడు మోకాళ్ల వరకూ ఉన్న డ్రస్‌ ధరించి కాలుపై కాలు వేసుకొని ఉన్న ఫొటోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ సినిమా షూటింగ్ లో భాగంగా అమెరికాలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement