‘ఖైదీ’ విడుదల తేదీ ప్రకటించిన చరణ్ | ram charan announce khaidi no 150 release date | Sakshi
Sakshi News home page

‘ఖైదీ’ విడుదల తేదీ ప్రకటించిన చరణ్

Published Tue, Jan 3 2017 8:03 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

‘ఖైదీ’ విడుదల తేదీ ప్రకటించిన చరణ్

‘ఖైదీ’ విడుదల తేదీ ప్రకటించిన చరణ్

హైదరాబాద్‌: చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నంబర్‌ 150’ను జనవరి 11న విడుదల చేస్తున్నట్టు హీరో రామ్‌చరణ్‌ ప్రకటించారు. బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’  కంటే ఒకరోజు ముందే తమ సినిమా విడుదల చేస్తున్నామని తెలిపారు. దీనికి గల కారణాలను వివరిస్తూ ఫేస్ బుక్ లో వీడియో పెట్టారు.

‘గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా 12న విడుదలవుతోంది, ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకేరోజు విడుదల కావడం మంచి పరిణామం కాదని నాతో నాన్న అన్నారు. అందుకే ఒకరోజు ముందుగానే జనవరి 11న మా సినిమా విడుదల చేస్తున్నాం. సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రావడమన్నది సహజమే’ అని రామ్‌చరణ్‌ పేర్కొన్నారు.

ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ కు పవన్‌ కళ్యాణ్ ను ఆహ్వానిస్తారా అని అడగ్గా... పిలవడానికి ఆయనేమీ పిల్లడు కాదని వ్యాఖ్యానించారు. పవన్‌ కు ఇన్విటేషన్‌ ఇస్తానని, అది తన బాధ్యత అని అన్నారు. రావడం, రాకపోవడం అన్నది ఆయన ఇష్టమని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement