
సాక్షి, హైదరాబాద్ : కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారని, వారిని ఎంటర్‌టైన్ చేసేందుకు టీవీ షూటింగులకు అనుమతులు ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పలు చానళ్ల ప్రతినిధులు కోరారు. శనివారం స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్, ఈ టీవీ సీఈఓ బాపినీడు, జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్, జెమిని టీవీ బిజినెస్ హెడ్ కే,సుబ్రహ్మణ్యం, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛైర్మన్ ప్రసాద్‌లు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. టీవీ షూటింగులకు తక్కువ సంఖ్యలో సిబ్బంది అవసరం ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తూ షూటింగ్‌లను నిర్వహిస్తామని వారు మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ అంశంపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
చదవండి : ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment