మరో వివాదంలో రాంగోపాల్ వర్మ | RGV gets in trouble over Sunny Leone | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో రాంగోపాల్ వర్మ

Published Thu, Mar 9 2017 8:45 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM

మరో వివాదంలో రాంగోపాల్ వర్మ - Sakshi

మరో వివాదంలో రాంగోపాల్ వర్మ

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నాడు.

పనాజి: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నాడు. బుధవారం (మార్చి 8) మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను ఉద్దేశిస్తూ వర్మ చేసిన ట్వీట్ దుమారం రేపింది. మహిళలకు శుభాకాంక్షలు చెబుతూ.. శృంగారతార సన్నీ లియోన్‌తో పోలుస్తూ వర్మ చేసిన అనుచిత ట్వీట్‌పై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలను కించపరిచేలా వర్మ వ్యాఖ్యలు చేశారని సామాజిక ఉద్యమకర్త విశాఖ మాంబ్రె గోవాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాంబ్రె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చీప్ పబ్లిసిటీ కోసం ఆయన అభ్యంతరకమైన కామెంట్లు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ ట్విట్టర్ ఎకౌంట్‌ను శాశ్వతంగా బ్లాక్ చేయాలని పోలీసులను కోరారు. వర్మ ట్వీట్స్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. గతంలో ప్రముఖులను ఉద్దేశిస్తూ ఆయన చేసిన ట్వీట్స్‌పై కొందరు బహిరంగంగా విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement