బాహుబలి వీడియో సాంగ్ ప్రోమో విడుదల | saahore baahubali vodeo song promo released | Sakshi
Sakshi News home page

బాహుబలి వీడియో సాంగ్ ప్రోమో విడుదల

Published Sat, Apr 22 2017 5:30 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM

బాహుబలి వీడియో సాంగ్ ప్రోమో విడుదల

బాహుబలి వీడియో సాంగ్ ప్రోమో విడుదల

భళి భళిరా భళి.. సాహోరే బాహుబలి అంటూ సాగే పాట వీడియో సాంగ్ ప్రోమోను బాహుబలి టీమ్ విడుదల చేసింది. లహరి మ్యూజిక్, టీ సిరీస్ సంయుక్తంగా ఈ వీడియోను విడుదల చేశాయి. ముందుగా నల్లగుర్రం మీద దూసుకొస్తున్న ప్రభాస్, ఆ తర్వాత సింహాసనం మీద అధిష్టించడం.. ఆ సమయంలో వేలాది మంది మాహిష్మతీ ప్రజలు పూలతో స్వాగతం పలకడం... ఆపై ఏనుగు మీద సవారీ చేస్తూ ప్రభాస్ వస్తుంటే ముందు కట్టప్ప, శివగామి ఉండటం, ప్రజల జయజయ ధ్వానాల మధ్య ఇద్దరు చిన్న పిల్లలను చెరో భుజం మీద ఎక్కించుకుని తీసుకురావడం లాంటి సన్నివేశాలన్నీ ఈ పాటలో ఉన్నాయి.

మాహిష్మతిలో మోహరించిన సైన్యం, యుద్ధానికి సన్నద్ధమవుతున్న బాహుబలి, ఏనుగు తొండానికి ఓ అతిపెద్ద విల్లు అమర్చి, దాని నుంచి ఒక్క చేత్తో నిప్పులు చిమ్మే అతిపెద్ద బాణాన్ని సంధించడం లాంటి దృశ్యాలు గగుర్పొడిచేలా ఉంటాయి. గొడ్డలి చేతపట్టడం, గాల్లోకి ఎగిరి ఒకేసారి మూడు బాణాలు సంధించడం, ముగ్గురు శత్రుసైనికుల మీదకు బల్లెం దించి ముగ్గురినీ ఒకేసారి కాలితో పడగొట్టడం, బ్యాక్‌గ్రౌండ్‌లో సూర్యుడు ఉండగా చేసే కత్తిసాము.. ఇలా ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. పూర్తి పాట కాకుండా పాట ప్రోమోతోనే రాజమౌళి మరోసారి బాహుబలి -2 సినిమా మీద ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేశారనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ వీడియో పోస్ట్ చేసిన మొదటి అరగంటలోనే యూట్యూబ్‌లో దాదాపు 60 వేల వరకు వ్యూస్ వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement