సల్మాన్ ఖాన్ షాకింగ్ స్టేట్ మెంట్ | Salman Khan says he felt like a ‘raped woman’, stirs controversy | Sakshi
Sakshi News home page

సల్మాన్ ఖాన్ షాకింగ్ స్టేట్ మెంట్

Published Tue, Jun 21 2016 8:47 AM | Last Updated on Sat, Jul 28 2018 8:35 PM

సల్మాన్ ఖాన్ షాకింగ్ స్టేట్ మెంట్ - Sakshi

సల్మాన్ ఖాన్ షాకింగ్ స్టేట్ మెంట్

ముంబై: బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. అతడు ఇచ్చిన షాకింగ్ స్టేట్ మెంట్ పై సోషల్ మీడియాలో పెద్దెత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. 'సుల్తాన్' సినిమాలో మల్లయోధుడిగా నటించడం ఎలా ఉందని అడగ్గా... అత్యాచారానికి గురైన మహిళలా తన పరిస్థితి ఉందని సల్మాన్ బదులిచ్చాడు.

'షూటింగ్ లో రోజుకు ఆరు గంటలు బరువులు ఎత్తడం, కుస్తీ పట్టడం చేశాను. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. బరువులు ఎత్తడం నాకు పెద్ద సమస్య కాదు. 120 కిలోల మనిషిని 10 భంగిమల్లో 10 సార్లు పైకి ఎత్తగలను. కానీ రింగ్ లో తోసుకుంటూ కింద పడడం, నిజంగా ఫైటింగ్ చేయాల్సి రావడం చాలా కష్టంగా అనిపించింది. షాట్ ముగించుకుని రింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రేప్ కు గురైన మహిళలా భావించేవాణ్ని. సరిగా నడవలేకపోయేవాడిన'ని సల్మాన్ చెప్పాడు.

ఈ వ్యాఖ్యలపై ట్విటర్ లో నెటిజన్లు మండిపడ్డారు. తనను అత్యాచార బాధితురాలితో పోల్చుకోవడంతో సల్మాన్ అన్ని కోల్పోయాడని ట్విటర్ యూజర్ బీనా వ్యాఖ్యానించారు. సల్మాన్ వాడిన పదాలు చాలా భయంకరంగా ఉన్నాయని మరొకరు కామెంట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement