'నావి బెడ్ రూమ్ కళ్లు, అసలు అలసిపోవు' | so many Girls love my eyes, says Shah Rukh | Sakshi
Sakshi News home page

'నావి బెడ్ రూమ్ కళ్లు, అసలు అలసిపోవు'

Published Thu, Apr 28 2016 8:43 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

'నావి బెడ్ రూమ్ కళ్లు, అసలు అలసిపోవు' - Sakshi

'నావి బెడ్ రూమ్ కళ్లు, అసలు అలసిపోవు'

న్యూఢిల్లీ: తన కళ్లంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారని బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అన్నాడు. 'నా కళ్లు బెడ్ రూమ్ కళ్లు. అవి చాలా సెక్సీగా ఉంటాయి. నా కళ్లు ఎప్పుడు అలసిపోయినట్లు కనిపించవు. అందుకే అమ్మాయిలు నా కళ్లంటే చాలు పడిచచ్చిపోతారు' అని అభిమానులతో లైవ్ ఛాటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా షారుక్ అభిప్రాయపడ్డాడు. రాహుల్ ఢోలకియా దర్శకత్వం వహిస్తున్న 'రాయిస్' మూవీ షూటింగ్ లో ప్రస్తుతం బిజిబిజీగా ఉన్నాడు షారుక్.

ఆ మూవీ ప్రమోషన్లలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులతో ఛాటింగ్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మూవీలో తన పాత్ర ఎలా ఉండబోతుందన్న విషయాలు, ఆయన జీవిత సంఘటనలపై అభిమానుల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చాడు. తన కళ్లల్లో ఏదో మాయ ఉందని, అవే తనకు ప్లస్ పాయింట్ గా మారాయని వివరించాడు. తన చిన్న కుమారుడు అబ్ రామ్ తో కలిసి మూవీ చూడటమంటే చాలా ఇష్టమని, వారిద్దరూ కలిసి తన ఆల్ టైమ్ ఫెవరెట్ మూవీ 'మినియన్స్' (Minions)ని 200 సార్లకు పైగా చూశామని చెప్పాడు. రాయిస్ లో పాక్ నటి మహిరా ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement