సైనికుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్ముకశ్మీర్: భారత భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ముకశ్మీర్ సతోరా అటవీ ప్రాంతం త్రాల్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. సైనిక దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో అప్రమత్తమైన బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, ప్రస్తుతం మిలెటెంట్లకు, భద్రతా దళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు.
హిజ్బుల్ ముజాహిద్దిన్ కమాండర్ బుర్హాన్ వనీకి సంతాపంగా ఉగ్రవాదులు భారత్‌పై పెద్ద ఎత్తున దాడులు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో అమర్‌నాథ్ వెళుతున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడటంతో ఏడుగురు భక్తులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం సైనిక దళాలతో భద్రతను కట్టుదిట్టం చేసింది.