పన్నీర్కే 95 శాతం మద్దతు!
చెన్నై: దేశ వ్యాప్తంగా ప్రజలు తమిళనాడు రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీలో.. శశికళ, పన్నీర్ సెల్వంల మధ్య జరుగుతున్న పోరులో సీఎం పీఠం ఎవరిని వరిస్తుందా అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.
ఇదే అంశంపై ప్రజల మద్దతు ఎవరికి ఎక్కువగా ఉందో తెలుసుకోవడానికి నిర్వహించిన పలు సర్వేల్లో పన్నీర్ సెల్వంకే ఊహించని మద్దతు లభిస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో 95 శాతం మంది ప్రజలు పన్నీర్కే పట్టం కట్టడం విశేషం. మొత్తం 82,000 మంది పాల్గొన్న సర్వేలో 78,700 మంది పన్నీర్కు మద్దతు తెలుపగా.. కేవలం 3,700 మంది మద్దతు మాత్రమే చిన్నమ్మ పొందగలిగారు. తమిళ్ సమయమ్ నిర్వహించిన మరో సర్వేలో పన్నీర్కు ఏకంగా 97 శాతం మంది మద్దతు పలికారు.