‘నేను గాడిదనే..’
సాక్షి,న్యూఢిల్లీః వివాదాస్పద ఆథ్యాత్మికవేత్త ఆశారాం బాపూ తనపై తానే సెటైర్ వేసుకున్నాడు. హిందూ ధార్మిక సంస్థ నకిలీ బాబాల జాబితాలో తనను చేర్చడంపై ఆశారం ఆగ్రహంతో ఊగిపోయారు. తాను గాడిదల వర్గానికి చెందిన వాడినని వ్యంగ్యోక్తి విసిరారు. 2013లో జోథ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో 76 ఏళ్ల ఆశారామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
అప్పటినుంచి జైలులో ఉన్న ఆశారాం దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తులను ఏడు సార్లు కోర్టు తోసిపుచ్చింది. ఇక ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణకు హాజరైన క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఆశారాం బాపూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆశారాం నకిలీ బాబా అని, ఆయన బోధకుడు కాదు, సన్యాసీ కాదని అఖారా పరిషద్ తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నించిన మీడియాకు తాను గాడిద వర్గానికి చెందిన వాడినని చెప్పుకొచ్చారు.