రాహుల్ గాంధీ 'భూకంపం'పై మోదీ కౌంటర్ | good that rahul is speaking, but earthquake never comes, says narendra modi | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీ 'భూకంపం'పై మోదీ కౌంటర్

Published Thu, Dec 22 2016 12:36 PM | Last Updated on Tue, Aug 21 2018 9:36 PM

రాహుల్ గాంధీ 'భూకంపం'పై మోదీ కౌంటర్ - Sakshi

రాహుల్ గాంధీ 'భూకంపం'పై మోదీ కౌంటర్

తాను మాట్లాడితే భూకంపం వస్తుందన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్రమోదీ కౌంటర్ వేశారు. ''వాళ్లకు ఒక యువ నాయకుడు ఉన్నాడు. అతడు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటున్నాడు. ఆయనకు మాట్లాడటం వస్తే నేను చాలా సంతోషిస్తాను. నిజానికి ఆయన మాట్లాడి ఉండకపోతేనే భూకంపం వచ్చేదేమో. ఆ భూకంపాన్ని ప్రజలు పదేళ్ల పాటు అనుభవించాల్సి వచ్చేంది. ఆయన మాట్లాడం మొదలు పెట్టడం మంచిదైంది. ఇప్పటికైతే భూకంపం వచ్చే అవకాశం ఏమీ లేదు'' అని మోదీ అన్నారు. వారణాసిలో కేన్సర్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. 
 
వ్యవస్థను మార్చేందుకే పెద్దనోట్ల రద్దు ప్రక్రియ చేపట్టామని మోదీ అన్నారు. అవినీతిపరులకు కొంతమంది నేతలు మద్దతు ఇస్తున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావట్లేదని చెప్పారు. పేదల కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని చెప్పారు. నోట్ల రద్దుకు మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement