
2017 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్‌ను సమర్పించారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో భాగంగా ప్రవేశపెట్టారు.
కేంద్ర బడ్జెట్కు సంబంధించిన ముఖ్య అంశాలు :
- మొత్తం బడ్జెట్ కేటాయింపు రూ.21 లక్షల 47వేల కోట్లు
- ద్రవ్యలోటు జీడీపీలో 3.2 శాతం, రెవెన్యూ లోటు 2.1 శాతం
- వేతన జీవులకు పన్ను చెల్లింపులో ఊరట
- 2.5-5 లక్షల వరకు 5 శాతం పన్నురేటు మాత్రమే
- వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారికి ఎలాంటి పన్నులేదు
- రూ.50 లక్షల నుంచి కోటి ఉంటే టాక్స్ 10 శాతం
-
రూ.కోటి మించి ఆదాయం ఉంటే టాక్స్ 15 శాతం
- రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో ఆంక్షలు
- నగదులో కేవలం రూ.2వేలు వరకే రాజకీయ పార్టీలకు విరాళం ఇవ్వొచ్చు
-
చెక్ లేదా డిజిటల్ రూపంలో ఎంతైనా రాజకీయ విరాళం
- అపార్ట్‌మెంట్ నిర్మాణ రంగంలో రియల్ ఎస్టేట్ కు శుభవార్త
- బిల్డప్ ఏరియా స్థానంలో ఇకపై కార్పెట్ ఏరియా విలువకే రిజిస్ట్రేషన్
- ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత నుంచి పన్ను మొదలు
-
క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ పరిమితిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గింపు
- ఆర్థిక వ్యవస్థ నుంచి బ్లాక్ మనీని తొలగిస్తాం
- సహేతుకంగా పన్నుల వ్యవస్థ
- నోట్ల రద్దు వల్ల వ్యక్తిగత ఆదాయ వివరాలు వెల్లడించారు
- ఇన్‌కం ట్యాక్స్ చెల్లింపుల శాతం 34.85కు చేరింది
- బ్లాక్ మనీ వెలికితీతకు సిట్ చేసిన సిఫార్సులను ఆమోదిస్తున్నాం
-
రూ.3 లక్షలకు మించితే నగదు చెల్లింపులు ఉండవు
- అమరావతి రైతులకు శుభవార్త, క్యాపిటల్ గెయిన్స్ రద్దు
- రాజధాని ప్రాంతంలో భూములు విక్రయించినవారికి పన్ను మినహాయింపు
- రాష్ట్రం ఏర్పాటు అయిన 2014 నుంచి క్యాపిటల్ గెయిన్స్ రద్దు
-
ల్యాండ్ పూలింగ్‌లో ఉన్నవారికి మాత్రమే క్యాపిటల్ గెయిన్స్ పన్ను రద్దు
- పన్ను ఎగవేతదారులపై చర్యలు కోసం కఠిన చట్టం
-
ఆర్థిక నేరాలకు పాల్పడేవారిపై ప్రత్యేక చట్టం
- రక్షణ రంగానికి రూ.2లక్షల 74వేల 114 కోట్లు
- ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్నుల నిష్పత్తి సామాజిక న్యాయం చేసేదిగా లేదు
-
6లక్షల కంపెనీలు మాత్రమే రిటర్న్ సమర్పించాయి
- మొబైల్ హ్యాండ్ సెట్ల తయారీ ప్లాంట్లకు ప్రోత్సహకాలు
- మొబైల్ పరిశ్రమ మౌలిక సదుపాయాలకు రూ.745కోట్లు
- చండీఘడ్ సహా హర్యానాలోని 8 జిల్లాలు ఇక కిరోసిన్ రహిత జిల్లాలు
- ఢిల్లీ, జైపూర్ లలో 5 మురుగు శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు
- మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3,96,134 కోట్లు
- నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు రూ.20వేల కోట్లు
-
గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గుతాయి
- జాతీయ రహదారుల నిర్వహణ, కొత్తరోడ్ల నిర్మాణానికి రూ.64వేల కోట్లు
- చిన్న నగరాల్లో పబ్లిక్, ప్రయివేట్ భాగస్వామ్య పద్ధతిలో ఎయిర్ పోర్టుల నిర్మాణం
-
లక్షన్నర గ్రామ పంచాయితీలకు స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్
- ఆధార్ ఆధారిత పేమెంట్‌లు త్వరలో ప్రారంభం
- మొబైల్, డెబిట్ కార్డులు లేకున్నా ఆధార్‌తోనే పేమెంట్ చేయవచ్చు
- సెప్టెంబర్ 2017 నాటికి 20 లక్షల ఆధార్ బేస్‌డ్ చెల్లింపు కేంద్రాలు
- వచ్చే ఏడాది రెండున్నర వేల కోట్ల నగదు రహిత లావాదేవీల లక్ష్యం
- భీమ్ యాప్ ను 125 లక్షలమంది డౌన్ లోడ్ చేసుకున్నారు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎఫ్‌ఐపీబీ విధానం రద్దు
- సామాన్యులకు డిజిటల్ లావాదేవీల వల్ల మేలు
- బ్యాంకులు 10 లక్షల పీఓఎస్‌లను సమకూరుస్తాయి
-
పోస్టాఫీసుల ద్వారా పాస్‌పోర్టులు జారీ
- సీనియర్ సిటిజన్ల హెల్త్ రికార్డు ఆథార్ తో అనుసందానం
-
లక్షన్నర ఆరోగ్య కేంద్రాలు వెల్‌నెస్ సెంటర్లుగా మార్పు
- ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో రూ.లక్ష 67వేలకోట్ల పెట్టుబడులతో 250 ప్రతిపాదనలు
- మౌలిక రంగానికి రూ.3 లక్షల 96 వేలకోట్లు కేటాయింపు
- ఆర్థిక రంగంలో సంస్కరణల అజెండా కొనసాగుతుంది
- కొత్తగా ఎఫ్‌డీఐ పాలసీ సవరింపు
-
టెలికం ఫైబర్ యాక్టీవిటీ కనెక్టివిటీ కోసం రూ.5వేలకోట్లు
- 2017-18 రైల్వే బడ్జెట్ రూ.1,31,000 కోట్లు
- వికలాంగులకు అనుకూలంగా ఉండేలా 500 రైల్వే స్టేషన్లు
- ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసే రైల్వే టికెట్లకు సర్వీస్ ట్యాక్స్ లేదు
- రైల్వేలో ప్రయాణికుల భద్రతకు వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయింపు
- రైల్వేలు, రోడ్లు, విమానయానానికి రూ.లక్షా 31వేల కోట్లు
- 2019 నాటికి అన్ని రైల్వేల్లో బయో టాయ్‌లెట్స్
- 7వేల రైల్వే స్టేషన‍్లలో సోలార్ పవర్ ఏర్పాటు
-
కొత్తగా 3,500 కిలోమీటర్లు రైల్వే లైన్లు
- ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి రూ.52 వేల 393 కోట్లు
- రూ.500 కోట్లతో గ్రామాల్లో మహిళ శక్తి కేంద్రాలు
- నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రూ.20వేల కోట్ల గృహ రుణాలు
- వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి రంగాలకు రూ.లక్షా 87 వేల కోట్లు
-
జార్ఖండ్, గుజరాత్ లో రెండు ఎయిమ్స్ ల ఏర్పాటు
- విద్యారంగానికి ప్రాధాన్యత, యూజీసీలో సంస్కరణలు
- విద్యార్థులకు ప్రయోగాత్మకంగా 350 ఆన్‌లైన్ క్లాసులు
- ఉన్నత విద్యలో ప్రవేశ పరీక్ష కోసం కొత్త విధానం
-
యువతలో నైపుణ్యాన్ని పెంచే సంకల్ప్ స్కీమ్ కు రూ.4వేల కోట్లు
- ప్రధాని ఆవాస్ యోజన పథకానికి రూ.23 వేలకోట్లు
- స్వచ్ఛ భారత్ మిషన్ మంచి ఫలితాలు ఇచ్చింది
- ప్రధానమంత్రి సడక్ యోజనకు రూ.19వేల కోట్లు
-
గ్రామీణ నిరుపేదలకు కోటి పక్కా ఇళ్లు
- జాతీయ ఉపాధిహామీ పథకంలో మహిళలకు భాగస్వామ్యం పెంపు
- జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.48వేల కోట్లు
-
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
- రూ.8వేల కోట్లతో డెయిరీ అభివృద్ధికి ప్రత్యేక ఫండ్
- మైక్రో ఇరిగేషన్ కోసం రూ.5వేల కోట్లు
- పేదలకు సామాజిక భద్రత, గృహనిర్మాణం, ఉపాధి కల్పన
- ఆర్థిక సంస్థల బలోపేతం, డిజిటల్ వ్యవస్థ
- భూసార పరీక్షల కోసం కృషి విజ్ఞాన కేంద్రల్లో మినీ ల్యాబ్‌లు
- 63 వేల ప్రాథమిక సహకార సంఘాల కంప్యూటీకరణ
- రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
-
నాబార్డ్ తో వ్యవసాయ సహకార సంఘాల అనుసంధానం
- 60 రోజుల్లోపు రుణాలు చెల్లిస్తే రైతులకు పూర్తి వడ్డీ రాయితీ
- వచ్చే అయిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా చర్యలు
- గ్రామీణ ప్రాంతాల్లో బడ్జెట్ ను ఎక్కువ ఖర్చు చేస్తాం
-
పేదరిక నిర్మూలనే మా ప్రధాన లక్ష్యం
- ఈ బడ్జెట్ లో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నాం
- బడ్జెట్ ను ముందుగానే ప్రవేశపెట్టాం
- రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో కలపడం చారిత్రాత్మకం
- ప్రణాళికేతర, ప్రణాళిక వ్యయంపై స్పష్టత ఇచ్చాం
- ఈ బడ్జెట్ లో గ్రామీణ ప్రాంతాలు, పేదరిక నిర్మూలనకు పెద్దపీట
-
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత
- బ్లాక్ మనీపై పోరాటం చేశాం, మా చర్యలకు ప్రజలు మద్దతు తెలిపారు
- పారదర్శకత, ఖచ్చితత్వాన్ని పాటించాం
- గడిచిన రెండేళ్లుగా అహర్నిశలు కష్టపడుతున్నాం
- ప్రజలు మాపై ఎన్నో ఆశలు పెట్టుకుని, మమ్మల్ని గెలిపించారు
- రెండంకెల ద్రవ్యోల్బణం అమల్లోకి వచ్చింది
- ప్రజా ధనానికి మేము రక్షకులుగా ఉంటాం
- వృద్ధిరేటును ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నాం
-
పారదర్శకత, అవినీతి లేని సుపరిపాలన కోసం గట్టిగా పని చేస్తున్నాం
- నల్లధనంపై యుద్ధం ప్రకటించాం, పెద్దనోట్లను రద్దు చేశాం
- వ్యవస్థీకృతంగా ఉన్న లోపభూయిష్ట విధానాలకు స్వస్తి చెప్పాం
- పరోక్ష పన్నులపై పార్లమెంట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది
-
ప్రపంచ జీడీపీ ఈ ఏడాది పెరుగుతుందని ఐఎమ్‌ఎఫ్ అంచనా వేసింది
- సరైన నిర్ణయం ఎప్పటికీ విఫలం కాదని మహత్ముడి ఉద్బోధ
- నోట్ల రద్దు అన్నిరకాలుగా మేలు చేసింది
- నోట్ల రద్దు, జీఎస్టీ రెండు కీలక నిర్ణయాలు ఆర్థిక వృద్ధికి తోడ్పుడుతాయి
- వచ్చే ఆర్థిక ఏడాదిలో జీడీపీ పెరుగుతుంది
(సంబంధిత వార్తలు..)
గృహ రంగానికి గుడ్న్యూస్
పేదలకు కేంద్ర బడ్జెట్‌లో వరాలు!
బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే..
ఐఆర్‌సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు
ఆదాయపన్ను రేట్లు ఇలా..
తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ