ముందే హెచ్చరించినా...
న్యూఢిల్లీః గోరఖ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు అద్వాన్నంగా ఉన్నట్టు ఏడాది కిందటే తాను ప్రభుత్వాన్ని హెచ్చరించానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. గతంలో తాను పర్యటించిన సందర్భంగా అక్కడి పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటికీ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రచార పర్వానికి రాహుల్ అహ్మదాబాద్‌లో శ్రీకారం చుట్టారు.
ఆక్సిజన్ కొరతతో బీజేపీ పాలిత యూపీలోని గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో 62 మంది చిన్నారులు మరణించిన ఘటనను ప్రస్తావిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం పేదల వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని, అందుకే విద్యా, వైద్యం వంటి మౌలిక సేవలనూ ప్రయివేటీకరించేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు.