జూన్ 30 అర్థరాత్రి జీఎస్‌టీ లాంచ్
న్యూఢిల్లీ: ఒక దేశం ఒక పన్ను విధానంలో భాగంగా జూలై 1నుంచి జీఎస్‌టీ అమలుకు కేంద్రం కసరత్తును పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ బిల్లును జూన్ 30 అర్థరాత్రి లాంచ్ చేయనున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ప్రకటించారు. పార్లమెంట్ సెంట్రల హాల్ లో ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర‍్వహించనున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.
రాష్ట్రపతి సమక్షంలో నిర్వహించనున్న ఈ ప్రారంభ వేడుకలకు ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, స్పీకర్ కేంద్ర మంత్రులు, సహా జీఎస్‌టీ కౌన్సిల్ సభ్యులు హాజరవుతారని జైట్లీ చెప్పారు. అలాగే మాజీ ప్రధానులు మన్మోహన్, దేవెగౌడ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థకమంత్రులను ఆహ్వానించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా జీఎస్‌టీపై రెండు షార్ట్ ఫిలింలను ప్రసారం చేస్తామని జైట్లీ ప్రకటించారు.